క్రీడాభూమి

ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 19: భారత పురుషుల జట్టు ఇక్కడ జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ సుమీ ఫైనల్ చేరింది. మలేసియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో 3-2 తేడాతో విజయం సాధించింది. మొదటి సింగిల్స్ మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్ 21-14, 21-15 తేడాతో మలేసియాకు చెందిన జుల్ఫద్లి జుల్క్ఫ్లిని ఓడించాడు. అనంతరం డబుల్స్ విభాగంలో మను అత్రి, సుమీత్ రెడ్డి 10-21, 22-20, 21-16 స్కోరుతో జవాన్ షెన్ లో, కియాంగ్ మెంగ్ తాన్ జోడీపై గెలిచింది. దీనితో భారత్‌కు 2-0 ఆధిక్యం లభించింది. అయితే, ఆతర్వాత మలేసియా ఎదురుదాడికి దిగింది. ఇస్కందర్ జుల్‌కర్మెయిన్ జైనుద్దీన్‌తో తలపడిన అజయ్ జయరామ్ పదేపదే పొరపాట్లు చేసి, చివరికి 21-17, 12-21, 16-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అనంతరం ప్రణవ్ జెర్రీ చోప్రా, అక్షయ్ దివాల్కల్ జోడీ 14-21, 21-14, 12-21 తేడాతో యూ సింగ్ ఒంగ్ ఇ ఏ తియేవో జోడీ చేతిలో ఓటమిపాలైంది. భారత్, మలేసియా జట్లు చెరి రెండు విజయాలతో సమవుజ్జీగా నిలవగా, చివరిదైన రెండో సింగిల్స్ మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఆ మ్యాచ్‌ని హెచ్‌ఎస్ ప్రణయ్ 21-12, 22-20 తేడాతో టెక్ జీపై గెల్చుకొని, భారత్‌కను సెమీస్ చేర్చాడు.