అక్షర

అంధ విశ్వాసాలపై అక్షర సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామాజిక జీవనంలో
వైజ్ఞానిక స్పృహ
రచన: దేవరాజు మహారాజు
పేజీలు: 103.. ధర: రు.70/-
నవచేతన పబ్లిషింగ్ హౌస్, బండ్లగూడ, నాగోల్,
హైదరాబాద్- 500068
ఫోన్: 24224453

ఈ ప్రపంచంలో చాలా సంగతులు అందరికీ తెలిసే ఉంటాయి. కొందరు వాటిని గురించి ఆలోచించరు. వాటి గురించి ఎవరూ మాట్లాడడానికి ముందుకు రారు. ఎవరో ఒకరు చర్చ మొదలుపెట్టకుంటే ఆందరు మనకెందుకులే అనుకుంటే కొన్ని సంగతులు కుళ్లి బతుకులను కష్టం చేస్తాయి. దేవరాజు మహారాజు అటువంటి కొన్ని విషయాలను తన వ్యాసాల్లో చర్చించాడు. వాటన్నిటినీ ప్రస్తుతం పుస్తకంగా ప్రచురణ కర్తలు పాఠకులకు అందించారు.
డాక్టర్ మహారాజు పేరున్న కవి, కథకుడు, అనువాదకుడు. అన్నింటికీ మించి సైన్సు రచయిత. సైన్సు పేరున ప్రజలకు అందించవలసింది సమాచారం ఒక్కటే కాదు. సరైన అవగాహన కలిగించడం ముఖ్యం అన్నది ఈ రచయిత పద్ధతి. ఆయన వ్యాసం రాసినా, అందులో కవిత, కథల తీరు తోస్తుంది. ఆ కలం బలంతో ఆయన కొన్ని విషయాలను చర్చకు తెచ్చాడు.
ప్రజలు పాతపద్ధతి గుడ్డి నమ్మకాలలోనికి తిరుగుదారి పట్టడానికి, పత్రికలు, టీవీలు వీలైనంత వీలు కలిగిస్తున్నాయి. రానురాను ప్రజల్లో, ప్రగతిపథం ఆలోచనలు కరవవుతున్నాయి. మన బతుకులు సైన్సు పద్ధతిలో సాగుతాయని హెచ్చరించే వారు కరువయ్యారు. మతం, దేవుడు, స్వాములు, ఆధారంలేని ఆరోగ్య సూత్రాలు, అలవాట్లు, ఆరాధనలు దినదినానికీ పెరుగుతున్నాయి. ఈ రకమైన వాతావరణంలో మహారాజు వ్యాసాలు కొందరినైనా ఆలోచింపచేస్తాయని ఆశించవచ్చు.
ఈ రచయిత తన వ్యాసాల ద్వారా కొన్ని ముఖ్యాంశాలను చర్చించాడు. దేవుని పేరున జరుగుతున్న తతంగాలను ఈయన సహేతుకంగా విమర్శించాడు. యాగాలు, అభిషేకాలు, ఇతర తంతులను ఆలోచించమన్నాడు. బాబాల మోసాలను పరికించమన్నాడు. ఏటేటా జరిగే చేప ప్రసాదంలోని సత్యం గురించి వివరించాడు. మకర జ్యోతి బండారం, తిరుమలలో డబ్బు బలం మొదలైన అంశాలను ఈయన చర్చించిన తీరు అందరినీ ఆలోచింపచేస్తుందంటే అనుమానం లేదు. కొన్నిచోట్ల రచయిత వాదం, మరీ మొరటుగా వినిపించవచ్చు. అయినా అభిప్రాయాన్ని ప్రతిపాదించిన తరువాత ఆలోచన పాఠకుల వంతు. పుస్తకం వల్ల పాఠకులకు ఆలోచనలు మొదలైతే తమకు తామే వారు తెలివిగా నిర్ణయాలకు చేరుకోగలుగుతారు. ఇది దారి అని చెప్పడం మతానికే చెల్లింది. ఎవరి దారి వారు తెలుసుకునేలా సాయం అందించడం అసలు సిసలైన సైన్స్ పద్ధతి. సైన్సులో కూడా మోసాలు జరుగుతున్నాయని రచయిత చెప్పిన సంగతులు నిజంగా గుర్తించదగినవి.
చాలామందికి ఈ వ్యాసాలలో సంగతులు వెంటనే నచ్చకపోవచ్చు. అది వారి తప్పుకానేకాదు. సమాజం వారికి ఆ రకంగా శిక్షణ ఇచ్చింది. ఆ శిక్షణలో వైజ్ఞానిక స్పృహ లేదని చెప్పడమే రచయిత ప్రయత్నం!

-గోపాలం కె.బి