జాతీయ వార్తలు

ఆర్థిక వ్యవస్థ ఆశాజనకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే సంస్కరణలను చేపట్టాల్సిందేనని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. అలాగే అనవసర సబ్సిడీలను తొలగించాల్సిన అవసరం ఎంతో ఉందని మార్గనిర్దేశన చేసిన సర్వే, విత్త సంఘటన విషయంలోనూ నిర్ణీత కాల వ్యవధిలో లక్ష్యాలను సాధించే దిశగా సాగాలని తెలిపింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 7.7 శాతం నుంచి 7.75 శాతం వరకూ ఉండవచ్చని అంచనావేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జేట్లి శుక్రవారం మధ్యాహ్నం లోక్‌సభలో ఆర్థిక సర్వే ప్రతిపాదించారు. జిఎస్‌టి బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే దేశంలోని పన్నుల విధానం సమూలంగా మారిపోతుందని సర్వే ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గందరగోళంలో కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థ చాలా ఆశాజనకంగా ఉన్నట్లు ఆర్థిక సర్వే తెలిపటం గమనార్హం. జిడిపిలో 3.9 శాతం ఉన్న ఆర్థిక లోటును ప్రభుత్వం భర్తీ చేయగలుగుతుందనే ధీమాను ఆర్థిక సర్వే వెల్ల్లడించింది. 2016-17లో ద్రవ్యోల్బణం 4.5 శాతం నుండి 5 శాతం మధ్య ఉంటుందని సూచించింది. ప్రస్తుత ఖాతా లోటు స్వల్పంగా ఒకటి నుండి 1.5 శాతం మధ్య ఉంటుందని ఆర్థిక సర్వే ఆంచనా వేసింది. దేశ ఆర్థిక ప్రగతి ప్రపంచంలోనే అత్యధిక వ్యవస్థల్లో ఒకటని సర్వే సూచించింది. ఏడవ వేతన సంఘం సిఫారసుల మేరకు ప్రభుత్వోద్యోగుల వేతనాలు పెంచినా దీని ప్రభావం ధరలపై ఉండకపోవచ్చునని, ద్రవ్యోల్బణం పెరగక పోవచ్చునని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. దేశ వౌలిక సదుపాయాలను పటిష్టం చేసేందుకు అవసరమైన ప్రజా పెట్టుబడులను పెట్టటం జరిగిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. టోకు ధరల ద్రవ్యోల్బణం ఒక ఏడాదికంటే ఎక్కువ కాలం ప్రతికూలంగా కొనసాగిందని తెలిపింది. వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం కూడా తగ్గటంతోపాటు అంతకుముందు సంవత్సరం ఉన్నదాంట్లో సగమైందని వివరించింది. ద్రవ్యోల్బణం తగ్గటంతో రిజర్వు బ్యాంకు కూడా రెపో రేటును 6.75 నుండి 125 బేస్ పాయింట్లకు తగ్గించిందని గుర్తు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలతోపాటు కార్పొరేట్ రంగం, వౌలిక సదుపాయాల రంగం కూడా మంచి ఫలితాలను సాధిస్తుందనే ఆశాభావాన్ని ఆర్థిక సర్వే వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న పలు ఆర్థిక సంస్కరణల మూలంగా ఇది సాధ్యపడుతోందని సర్వే అభిప్రాయపడింది. భారత రైల్వే సరుకు రవాణా, నౌకాయానం, పౌరవిమానయానం, టెలికమ్యూనికేషన్ల రంగంలో ప్రగతి ఆకట్టుకునే విధంగా ఉన్నదని సర్వే తెలిపింది. ఇతర దేశాల నగదుతో పోలిస్తే మన రూపాయి తరుగుదల ప్రభావాన్ని అధిగమించగలిగిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. విద్య, ఆరోగ్యం,గృహ నిర్మాణం తదితర రంగాల్లో ఉన్న లోటును భర్తీ చేసుకోవలసి ఉన్నదని ఆర్థిక సర్వే తెలిపింది.