రాష్ట్రీయం

అనుసంధానానికి సంకల్పంగా పుష్కరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 26: కృష్ణానది పుష్కరాలను నదుల అనుసంధానానికి సంకల్పంగా స్వీకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి సంకల్పం తీసుకున్నట్లు చెప్పారు. సిఎంఓలో శుక్రవారం రాత్రి 12శాఖల అధికారులతో జరిపిన కృష్ణా పుష్కరాల సమీక్షా కార్యక్రమంలో మాట్లాడుతూ ఆగస్టు 12 నుంచి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాల సందర్భాన్ని రాష్ట్రంలో మిగిలిన నదుల అనుసంధానానికి సంకల్పంగా తీసుకుందామన్నారు. పుష్కరాలను నిర్వహించేది మనిషి ప్రకృతిని ఆరాధించటం, ప్రేమించటం నేర్చుకోవాలన్న ఆకాంక్షతోనే అని చెప్పారు. పంచ భూతాల్లో నీటి ఆవశ్యకతను చాటడానికే పుష్కరాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు పుష్కరాలు ఒక సందేశం లాంటివన్నారు. నదుల అనుసంధానం చేపట్టి రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా చేస్తామన్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పుష్కరాల ద్వారా ఒక పండుగ వాతావరణం సృష్టించాలని చంద్రబాబు కోరారు. ఈ మూడు నాలుగు నెలల్లో రోడ్ల బాగుసేతకు ప్రాధాన్యమివ్వాలని, పుష్కరఘాట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. గోదావరి పుష్కర ఘాట్ల వలె కృష్ణా పుష్కర ఘాట్లు శాశ్వత ప్రాతిపదికన నిర్మించాలని సూచించారు. రాష్ట్రంలో 280 ఘాట్లు ఏర్పాటు చేయాలని, వాటినన్నింటికి అనుసంధానంగానున్న రహదారులకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. విజయవాడ, గుంటూరులలో ట్రాఫిక్ కంట్రోల్‌పై దృష్టి పెట్టాలన్నారు. రాజధాని శంకుస్థాపన కార్యక్రమానికి పోలీసులు ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా చేసి ప్రజల ప్రశంసలు పొందారో, అదే రీతిలో పనిచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే నెలలో మరో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పైడికొండల మాణిక్యాలరావు, సిఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.