రాష్ట్రీయం

అర్థంకాని మాస్టర్‌ప్లాన్ కోడ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 26: రాజధాని అమరావతికి సంబంధించిన ఫైనల్ మాస్టర్‌ప్లాన్ విడుదలైనప్పటికీ కోడ్‌లో పొందుపరచిన వివరాలు రైతులకు అర్థంకాక స్థానికంగా ఉన్న సిఆర్‌డిఎ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన సిఆర్‌డిఎ కార్యాలయాల వద్ద కూడా ఫైనల్ మాస్టర్‌ప్లాన్ కాపీలు పెట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతుల అనుమానాలు నివృత్తి చేసే విధంగా సిబ్బంది సమాచారం ఇవ్వటం లేదంటున్నారు.
రాజధానిలోని 29 గ్రామాల్లో అంతర్గత రహదారుల వివరాలు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు సంబంధించిన సమాచారంపై అవగాహన రావటం లేదని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించి విడుదలైన ఊహాచిత్రం మాత్రమే అందుబాటులో ఉండటంతో రైతులు అసంతృప్తికి గురౌతున్నారు. గతంలో మాస్టర్‌ప్లాన్ విడుదల చేసిన సమయంలో కోడ్‌కు సంబంధించిన వివరాల కాపీ కూడా పొందుపరచే వారని, ప్రస్తుతం వివరణ లేక పోవటంపై రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఉదాహరణగా ఉండవల్లి గ్రామాన్ని గుర్తిస్తే ఎన్ని రహదారులు వస్తాయనే విషయం తెలియక ప్రజలు అసంతృప్తికి లొనౌతున్నారు. గతంలో చూపిన రహదారులు ఉన్నాయా, లేవా అనే సమాచారం లేక అయోమయంలో ఉన్నారు.
మాస్టర్‌ప్లాన్‌లో సూచించిన సి-1, పి-1, ఆర్-1, ఎస్-1 తదితర కోడ్‌ల వివరాలు తెలియక రైతులు తికమకపడుతున్నారు.
ఇప్పటికైనా సిఆర్‌డిఎ అధికారులు మాస్టర్‌ప్లాన్‌పై అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు.