బిజినెస్

ఏప్రిల్‌లో బ్రిక్స్ బ్యాంక్ రుణాలు: కామత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాంఘై, ఫిబ్రవరి 26: బ్రిక్స్ దేశాలు ఏర్పాటు చేసిన నూతన అభివృద్ధి బ్యాంక్ (ఎన్‌డిబి).. ఏప్రిల్ నుంచి ప్రాజెక్టులకు నిధులు అందిస్తుందని బ్యాంక్ అధ్యక్షుడు కెవి కామత్ తెలిపారు. తొలుత ఒక్కో సభ్యత్వ దేశం నుంచి ఒక్కో ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేస్తామని శుక్రవారం ఇక్కడ చెప్పారు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఈ బ్యాంక్‌ను ఏర్పాటు చేసినది తెలిసిందే. కాగా, ఈ ఏడాదిలో 10 నుంచి 15 ప్రాజెక్టులకు నిధులు అందుతాయన్న ఆశాభావాన్ని కామత్ వ్యక్తం చేశారు. బ్రిక్స్ దేశాల నుంచి అనేక ప్రాజెక్టులు ఆర్థిక సాయం కోసం వచ్చాయన్న ఆయన వీటిలో ఎక్కువగా వౌలిక, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులున్నాయన్నారు.