బిజినెస్

ఆర్థిక సర్వే ముఖ్యాంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) జిడిపి వృద్ధి 7-7.75 శాతం
* ఈ ఆర్థిక సంవత్సరం (2015-16) జిడిపి వృద్ధి 7.6 శాతం
* ఎగుమతులు పుంజుకుంటే 8-10 శాతానికి జిడిపి వృద్ధిరేటు
* ప్రపంచ ఆర్థిక మాంద్యంలో సుస్థిరతకు సిసలైన చిరునామా భారత్
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో 35 డాలర్ల వద్ద బ్యారెల్ ముడిచమురు ధర
* ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యారెల్ ముడిచమురు సగటు ధర 45 డాలర్లు
* 2016-17లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5-5 శాతం
* మున్ముందూ తక్కువగానే ద్రవ్యోల్బణం, ధరల స్థిరీకరణ
* ధరల స్థిరీకరణపై వేతన సంఘం సిఫార్సుల అమలు ప్రభావం తక్కువే
* పన్ను పరిధిలో ఉన్న వ్యక్తిగత ఆదాయంపై పన్ను పెంపు యోచన
* దేశ ఆర్థిక విధానాలకు సవాల్‌గా అంతర్జాతీయ పరిస్థితులు
* 3.9 శాతం ద్రవ్యలోటు లక్ష్యం ఈ ఆర్థిక సంవత్సరం సాధ్యమే
*వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యసాధన సవాల్
* 2016-17 జిడిపిలో 2 శాతం దిగువకు రాయితీల భారం
* వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆలస్యం ఆందోళనకరం
* ఇంకా ఒత్తిడిలోనే కార్పొరేట్, ప్రభుత్వరంగ బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు
* గుర్తింపు, పునఃపెట్టుబడులు, తీర్మానం, సంస్కరణలు అవసరం
* 2018-19 నాటికి ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ. 1.8 లక్షల కోట్ల మూలధనం అవసరం
* ఫిబ్రవరి ప్రథమార్ధానికి 1-1.5 శాతంగా కరెంట్ ఖాతా లోటు
* 351.5 బిలియన్ డాలర్ల వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు
* 2015-16లో సేవా రంగం వృద్ధి 9.2 శాతం
* విదేశీ పెట్టుబడులు తరలిపోతున్న క్రమంలో దేశీయంగా పెట్టుబడులను పెంచేందుకు చర్యలు
* ఇటీవలి సంస్కరణలతో మున్ముందు పురోగతిలో పారిశ్రామిక, వౌలిక, కార్పొరేట్ రంగాలు
* ఆరోగ్య, విద్యా రంగాల్లో మరిన్ని పెట్టుబడులు, వ్యవసాయాభివృద్ధిపై దృష్టి
* బడ్జెట్ అంచనాను మించి ప్రభుత్వ పన్నుల ఆదాయం
* వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు వృద్ధి
*వాణిజ్యంలో రక్షణాత్మక చర్యలను భారత్ ప్రతిఘటిస్తుంది
* ఎరువుల రంగం కోసం సంస్కరణల ప్యాకేజీకి యోచన