ఆంధ్రప్రదేశ్‌

సెప్టెంబర్ 2న కార్మిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఏప్రిల్ 18: ప్రధాని మోదీ, తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కెసిఆర్ పరిశ్రమల యాజమాన్యాలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఐఎన్‌టియుసి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆరోపించారు. యాజమాన్యాల తీరుతో కార్మికులు పస్తులుంటున్నా పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సోమవారం ఐఎన్‌టియుసి జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సంజీవరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సేవలో మునిగితేలుతున్న మోదీ ప్రభుత్వం కార్మికుల కోర్కెలపై ఇంతవరకూ స్పందించలేదన్నారు. కాంట్రాక్టు కార్మికులకు ఇవ్వాల్సిన సమానపనికి సమాన వేతనం అమలు చేయటం లేదన్నారు. మరో రెండు మాసాల్లో అమలు చేయకుంటే దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మంది కార్మికులు సమ్మెబాట పడతారని హెచ్చరించారు. కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులు కార్మిక చట్టాలను సవరిస్తూ వారి హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానిసలుగా చేసే చట్టాలకు రూపకల్పన చేస్తోందని, ఇలాంటి చట్టాలను ఎదిరించేందుకు కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాటానికి సిద్ధం కావాలని సంజీవరెడ్డి అన్నారు. క్రేంద్రప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు సెప్టెంబర్ 2వ తేదీ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈసమ్మె భారత్ బంద్‌ను తలపించేలా ఉంటుందన్నారు. ప్రతి కార్మికుడు సమ్మెలో పాల్గొనేలా చూస్తామన్నారు.