అంతర్జాతీయం

వేగంగా విస్తరిస్తున్న విశ్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 3: ఖగోళవేత్తలు గతంలో అంచనావేసిన దానికంటే విశ్వం చాలా వేగంగానే విస్తరిస్తోందని ఏకంగా ఐదు నుంచి తొమ్మిది శాతం మేర దీని విస్తృతి పెరుగుతునే వస్తోందని నాసా వెల్లడించింది. హబుల్ టెలిస్కోప్ అందించిన వివరాలను పరిశీలించిన నాసా శాస్తవ్రేత్తలు ఈ పరిణామాన్ని అనూహ్యమైనదిగానే పేర్కొంటున్నారు. దీని వల్ల శూన్య ఇంధనం, శూన్య పదార్ధం అలాగే రేడియేషన్ సహా ఏమాత్రం కాంతిని ప్రసరించని,.. విశ్వంలో 95శాతానికిపైగా ఉన్న మిస్టరీలను చేదించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశ్వవిస్తరణ క్రమాన్ని అత్యంత కచ్చితంగా ఈ తాజా అధ్యయనంలో అంచనావేయగలిగారు. అమెరికాలోని జామ్స్ ఆప్టిమ్స్ వర్శిటీ అలాగే స్పేస్ టెలిస్కోప్ సైన్స్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహిత ఆడమ్ రీస్ సారధ్యంలో ఈ అధ్యయనం జరిగింది. ఈ అంచనాలో ఏ మాత్రం అసంబద్ధత ఉన్నా అది కనిష్టస్థాయిలో అంటే కేవరం 2.4 శాతం మేర మాత్రమే ఉంటుందని స్పష్టం చేశారు. సుదూర నక్షత్ర మండలాలను గుర్తించడం, భూమికి వాటికి మధ్య ఉన్న దూరాన్ని అంచనా వేయడానికి అత్యాధునికమైన టెక్నిక్‌లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో విశ్వ విస్తరణ వేగాన్ని కూడా అంచనావేయగలుతున్నామని తెలిపారు.