అక్షరాలోచన

రెక్కలు లేని ఆకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంక్షల మధ్య ఆకాశం
తెగిపోయినట్టుగా
కనిపిస్తుంది
అసలు మెరవటమే మానుకుంది
ఏ మెరుపూ లేదు. ఏ తూర్పు కనిపించటంలేదు.
ఆంక్షలు ఇప్పటివా
స్వాతంత్య్రం ఆకాశాన్ని ఆంక్షలలో బంధించింది
ఆకాశం నా స్వేచ్ఛకు ప్రతీక
నేనో పిట్టను
నేనో పావురాన్ని
ఆకాశాన్ని కత్తిరించటమే కాదు
నా రెక్కలను కూడా కత్తిరించారు
దుర్మార్గ రాజకీయాల గుప్పిట్లో
ఆకాశం ఇరుక్కోవటం ఆశ్చర్యం కల్గిస్తుంది
గాలి
ఎవరి గుప్పిట్లో ఉంటుంది?
జనం గాలికి ప్రతీక
గాలి చెలరేగితే
ఆంక్షలే కాదు అణుబాంబులు కూడా
నిర్వీర్యమవుతాయి
నేను ఆకాశాన్ని
ఆంక్షల మీద యుద్ధం ప్రకటించిన గాలిని నేలను
జనం సైనికుడిని.

-సిహెచ్.మధు 9949486122