ఆంధ్రప్రదేశ్‌

కార్పొరేట్ల కోసమే భూ ఆక్రమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 9: కార్పొరేట్లు, కొద్దిమంది పెద్దల కోసం దేశంలో ఉన్న భూమిని సేకరణ, సమీకరణ పేరుతో భూములు లాక్కుంటున్నారని, దీన్ని రాజకీయ పరిభాషలో ప్రభుత్వ భూ దురాక్రమణగా వర్ణించొచ్చని జెఎన్‌యు ప్రొఫెసర్ ప్రవీణ్ ఝూ అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమ నేత దివంగత మాకినేని బసవపున్నయ్య 25వ వర్దంతి సందర్భంగా ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన ‘సమకాలీన భారతదేశం ప్రభుత్వ భూ కబ్జా’ అనే అంశంపై జరిగిన స్మారకోపన్యాసంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పారిశ్రామిక అభివృద్ధి అంటే భూములు లాక్కోవడమే అనే ధోరణిలో ప్రభుత్వాలున్నాయని తెలిపారు. ప్రభుత్వాల సాయంతో కార్పొరేట్లు, పెట్టుబడిదారులు భూములు కొల్లగొడుతున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు చట్టాలనూ సమూలంగా మార్చేస్తున్నాయని, చట్టాలు, ఆర్డినెన్స్‌లు ప్రజలకు ఉపయోగంగా చూపుతూ కార్పొరేట్లకే ఎక్కువ ప్రయోజనం కలిగిస్తున్నాయని చెప్పారు. 2011లో 1.20 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా అప్పట్లో 11.20 లక్షల మందికి ఉపాధి కల్పించారని, 2016 వచ్చే నాటికి ఈ కల్పన 1.50 లక్షల మందికి తగ్గిపోయిందని చెప్పారు. జపాన్, తైవాన్, కొరియా లాంటి దేశాల్లో 50 శాతం భూ పంపిణీ జరిగిందని వివరించారు. గతంలో కేంద్రం నియమించిన గోవిందరాజన్ కమిటీ అటవీ, పర్యావరణ హక్కు చట్టాలు పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా మారినట్లు చెప్పారు. 2005లో సెజ్ చట్టాన్ని తీసుకొచ్చారని, ఈ చట్టం పేరుతో దేశ, విదేశీ పెట్టుబడిదారులకు భూములు కట్టబెట్టారన్నారు. 2006లో పర్యావరణ చట్టానికి చేసిన సవరణల వల్ల భూములు లాక్కోవడం మరింత సులభతరమైందని పేర్కొన్నారు. పిపిపి, ప్రైవేట్ దేనికైనా భూములు ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో సవరణలు చేసిందని పేర్కొన్నారు. నివేదికను ట్రస్టు కార్యదర్శి వై.వెంకటేశ్వరరావు ప్రవేశపెట్టారు. ఎంబివికె మేనేజ్‌మెంట్ కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ వక్తలను వేదిక మీదకు ఆహ్వానించారు.