ఆంధ్రప్రదేశ్‌

రెండేళ్లలో పది లక్షల గృహలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 20: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో పది లక్షల గృహాలు నిర్మించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ కాంతిలాల్ దండే చెప్పారు. గురువారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఎన్‌టిఆర్ గృహ నిర్మాణ పథకం, గ్రామీణ, పట్టణ గృహనిర్మాణ పథకాలతోపాటు ఐఎవై పథకాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనిర్మాణ సంస్థలో పనిచేస్తున్న ఇంజనీర్ల పనితీరు అధ్వాన్నంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహనిర్మాణ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక, జియో ట్యాగింగ్, బిల్లుల చెల్లింపు తదితర అంశాలను వేగవంతం చేయాలన్నారు. గత ఏడాది లక్ష్యాలకు సంబంధించి మిగిలిపోయిన లబ్ధిదారులను గుర్తించి ఈ నెలాఖరులోగావెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. అదే విధంగా ఈ నెలాఖరు నాటికి 60 శాతం నిధులు ఖర్చు చేయాలన్నారు. గృహాలు నెలకోల్పకముందే లబ్ధిదారుల వివరాలతో ప్రస్తుతం నివసిస్తున్న ఇంటిని, కట్టబోయే స్థలాన్ని జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. స్మార్ట్ పల్స్ సర్వే డేటా ద్వారా లబ్ధిదారులను గుర్తించి గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి జిల్లా కమిటీకి సమర్పించాలన్నారు.
డిసెంబర్ నెలాఖరు నాటికి గృహనిర్మాణాలను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వివేక్‌యాదవ్, గృహనిర్మాణశాఖ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం.. సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కాంతిలాల్ దండే