అక్షరాలోచన

మృత్యుగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనెక్కడికీ పోను
అనుక్షణం మీ వెంటే వుంటాను
పండుగగనో, పబ్బమనో
హారతినిచ్చే నదీజలాల్లోనో
ఆనందాన్ని ఆవిరిచేసే
ఆవేదనగ నిలిచిపోతాను.
మితిమీరిన వేగంలోనో
నిద్రమత్తులో జారిన క్షణంలోనో
బోరుబావిలో కూరుకుపోయిన సెకనుల్లోనో
మతవ్ఢ్యౌం పెరిగి బుల్లెట్ల రూపంలోనో
చరిత్రకు వక్రభాష్యలందించే సినిమా రూపంగానో
హింసను ప్రేరేపించే క్షణాలై
మీ వెంటే వుంటాను
నా నడక ఎప్పుడు మొదలౌతుందో
నా గమనం ఎటు నుంచి వస్తుందో
నా రూపం ఏ అదృశ్యమిత్తిగనో
నా ఉనికి ఎన్నిసార్లో ప్రశ్నించే ప్రశ్నగనో
నిశ్శబ్దంగా వస్తాను.. అల్లకల్లోలం సృష్టిస్తాను
నిరామయమాన్ని నింపుతాను. ఆవేదన మిగులుస్తాను
చిన్నాపెద్దా తేడా లేదు
పాపం పుణ్యంతో పనిలేదు
తీరని దుఃఖానికి చిరునామానైతాను
హఠాత్తుగ వస్తాను, అమాంతం మింగుతాను
మానవ సమాజాన్ని తొక్కుకుంటూ వెళతాను
దినపత్రికల పతాక శీర్షికనైతాను
ఇప్పటికే అవగతమై యుంటుంది
తెలియకపోతే.. తెలుసుకోమరి
అదే మృత్యుగీతం
కాలపురుషుడి చేతివేళ్ల నడుమ
జీవిత నాటక మృదంగమై
యుగాల నుండి మోగుతునేయున్నా..
కులం మతం వర్ణం ప్రాంతం
దేశాలు ఖండాలనే తేడా లేకుండా
ప్రచలిస్తూనేయున్నా...
కారణాలేమైనా
హేతువులెన్ని వున్నా
నిర్హేతుకంగానే నినదిస్తుంటా
మృత్యు సంగీతమై నిలుస్తుంటా
ఈ దిక్కుల కుడ్యాలలో నినదిస్తుంటా.
*

-లక్కరాజు శ్రీనివాసరావు 9849166951