కృష్ణ

శైవ క్షేత్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఫిబ్రవరి 12: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాల వద్ద పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తెలిపారు. సోమవారం ఆయన జిల్లాలోని పలు శైవ క్షేత్రాలను సందర్శించి శాఖాపరంగా తీసుకున్న బందోబస్తు చర్యలను సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి, ముసునూరు మండలం బలివే ప్రా ంతాల్లోని శైవ క్షేత్రాలను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివరాత్రి మహోత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పోలీసు శాఖ చ ర్యలు తీసుకుందన్నారు. భక్తుల తాడికి అధికంగా ఉండే ప్రతి శైవ క్షేత్రం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయటంతో పాటు కంట్రోల్ రూమ్‌లు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది తీసుకున్న బందోబస్తు చర్యలను పునః సమీక్షించి అవసరమైతే అదనపు సిబ్బందిని విధుల్లోకి తీసుకుంటామని ఎస్పీ త్రిపాఠి తెలిపారు.