రాష్ట్రీయం

అది డిజాస్టర్ టూరిజం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23:సెంట్రల్ వర్శిటీ విద్యార్థి రోహిత్ మృతిపై ప్రభుత్వం ఎట్టకేలకు స్పందించింది. రోహిత్ ఆత్మహత్య దురదృష్టకరమని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు వ్యాఖ్యానించారు. టిఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమం శనివారం తెలంగాణ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా సెంట్రల్ యూనివర్సిటీ సంఘటనపై విలేఖరులు ప్రశ్నించగా, ఈ సంఘటనను డిజాస్టర్ టూరిజంగా మార్చి నాయకులు సందర్శిస్తున్నారని విమర్శించారు. రోహిత్ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. విద్యార్థులు ఉద్వేగంతో ఉన్నారు, ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం నాయకులు సందర్శిస్తూ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేస్తున్నారని అన్నారు. నాయకులు సంయమనం పాటించాలన్నారు. రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం మంచిది కాదని చెప్పారు.