మెయిన్ ఫీచర్

మహిళ చొరవతో మార్పు సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా ఇలా ఎన్నో రకాలైన పాత్రలు పోషించే నారీ మణి నేడు ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్వర్తిస్తోంది. ఇంట్లో నే కాదు సుమా ఆఫీసుల్లోను ఆర్థిక వ్యవహారాలకు ఆడవారే సరైనవారు అనే అంటున్నారట. క్యాషియర్ దగ్గర నుంచి కంపెనీ యజమాన్య వ్యవహారాల్లోను స్ర్తీ ల పాత్ర ఉంటే ఆ కంపెనీ గణాంకాలు విజయావకాశాల అంచులల్లోనే కాపురం చేస్తాయని సర్వేల ద్వారా తెలిసిందట.
మహిళలే దేనినైనా ఎంత కష్టసాధ్యమైనదైనా సరే తానే పూనుకొని మరీ వ్యవహారాన్ని చక్కదిద్ది విజయాన్ని అందిపుచ్చుకుంటుంది అని నిపుణలంతా ఏకకంఠంతో చెప్తున్నారు. కాని కాని కాలం అప్పుడప్పుడూ అక్కడక్కడా కనె్నర్ర చేస్తునే ఉంది.
కావ్యాల్లో మాత్రమే కన్యలను ఆకాశానికెత్తేశారు అంటే కాదు మనుధర్మశాస్త్రం కూడా స్వాతంత్య్రం అక్కర్లేదు అంటూనే అజేయమైన శక్తిగా అభివర్ణించింది. ఋగ్వేద కాలంలో స్ర్తిలు మంత్రశాస్తవ్రేత్తలు గా ఉన్నారు. మగవాళ్లకు ధీటుగా చదివారు. మైత్రేయి, గార్గేయి లాంటివారు ఉన్నారు.
నేడు కూడా అగ్రగామిగా ఉన్న స్ర్తిని పత్రికలన్నీ మల్టినేషనల్ కంపెనీ లాంటిది స్ర్తి అంటున్నారు
ఎందరో మహిళామణులు కీర్తి కిరీటాలు ఆనాడు పొందారు. నేడు పొందుతున్నారు. ఇట్లాంటి కీర్తి కిరీటాలు అందుకుంటూనే ఉన్నారు. వాటిని మోస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల క్రితం సతీ సుమతితన భర్త కుష్ఠువ్యాధి గ్రస్తుడైనా వేరే ఒక యువతిని కోరుకొన్నాడట. దానికోసం ఆయన్ను బుట్టలో పెట్టుకుని ఆ యువతి దగ్గరకు తీసుకొని వెళ్లింది. దారిలో ఎవరో శాపం ఇవ్వబోతే సూర్యుణ్ణే గమనాన్ని ఆపు చేయంచింది ఆ సుమతి. అంతటి శక్తివంతురాలు ఆమె.
సీతమ్మ రావణుని చెరలో ఉన్నందుకు రాముడు ఏదో మాట అన్నాడని ఆమె తన్ను తాను అగ్నికి సమర్పించుకుంది. పునీతగా వాసికాంచింది.
ద్రౌపది తన్ను అవమానించారని కుమిలి కుమిలి ఏడ్చి అటు కృష్ణ్భగవానుని దయను పొందింది. ఇటు తన భర్తల శౌర్యపరాక్రమాలతో శత్రువులను గెలిచింది.
దమయంతి కూడా అపూర్వశక్తి సామర్థమున్న మహిళే. తన్ను దేవతలు కావాలన్నా వద్దని నలుడనే మానవుణ్ణి కోరి పెళ్లి చేసుకొంది. పరిస్థితులదృష్ట్యా భర్త దూరమైతే తల్లిగారింటికి చేరింది. ఆమె అక్కడే తన చాతుర్యాన్ని చూపించి తిరిగి తన భర్త జాడను కనుక్కొని దగ్గరైంది. కణ్వుని నీడలో పెరిగిన శకుంతల కూడా నీతి నిజాయతీలు లేని దుష్యంతుని ఆగడాన్ని బట్టబయలుచేసింది కానీ వీరందరినీ కూడా మగవేషం వేసుకొన్న మృగాలు హింసించాయి. కాని చివరలో అన్యాయం , అధర్మం కాలరాచి విజేతలుగా ఈ నారీమణులే చరిత్రలో నిలిచారు. ఊసరవెల్లి ముదిరి సీతాకోక చిలుక అయినట్లుగా మృగాల్లోని శాడిజం పెరిగింది. వాళ్లే యాసిడ్ దాడులు, గొంతుకోయడాలు, నరకడాలు ఇలాంటి వాటికి తెగబడుతున్నారు.
ఇపుడు మహిళకు చట్టం వెన్నుదన్నుగా నిలిచింది. గృహ హింసలో మగ్గిపోయేవారికి చట్టాలున్నాయి.వాటిని ఉపయోగించుకుని మగరాక్షసుల నోర్లు నొక్కవచ్చు.
సూర్యుని శక్తిని కప్పిపుచ్చడానికి వీలుకానట్టుగానే స్ర్తి శక్తి అనేక రకాలుగా నేడు గళం విప్పుకొంటోంది. అనిబిసెంట్, లతా వాడేదర్, విజయలక్ష్మి పండిట్, అమృతకౌర్ , అరుణ అసఫలి, సుచేత కృపలానీ , కస్తూరీ బా సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశముఖ్ లాంటివారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు.
ఐక్యరాజ్య సమితితో పాటుగా ఎన్నో స్వచంధ సంస్థలు, మరెన్నో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు పితృస్వామ్యభావాలను విడనాడి స్ర్తి హక్కులకోసం పోరాడడంలో వెన్నుదన్నుగా ఉన్నారు. నేటి మహిళ సామాజికంగా , ఆర్థికంగా, రాజకీయంగా, ప్రసార మాధ్యమం కళా సాంస్కృతిక , సేవారంగల్లో ను సాంకేతిక రంగంలోను అన్నింటి కీలక పాత్రలనే పోషిస్తున్నారు. చాలాచోట్ల సమాన అవకాశాలు అందుకుంటున్నారు. స్ర్తీవాద ఉద్యమశక్తి పెరిగింది.స్ర్తి సమూహాలు ఎక్కడ అన్యాయం జరిగినా తామున్నామని వెళ్తున్నాయ.
కాని వాటిని అమలు జరుపడంలోను, అమలు జరిపే పరిస్థితులు రాకుండా చేయడంలోను అలసత్వం కనిపిస్తున్నారు. అందుకే నేడు ఎక్కడ చూసినా మహిళలకు ప్రాణాపాయ సిథతినే ఎథుర్కొంటోంది.
మహిళా శిశు అభివృద్ధి శాఖ వారు సబల పథకం చేపట్టారు. దానిద్వారా కౌమార దశలో ఉండే బాలికలకు సర్వ సమృదిధ సాధికారత, పోషకాహారం ఆరోగ్య హోదా పెంచడం ఆరోగ్యసమస్యలను ఎదుర్కోవడం, పునరుత్పత్తి అంశాలు, లైంగిక పరమైన అనారోగ్యస మస్యలు , కుటుంబం, పెళ్లి పిల్లలు ఇట్లాంటి అన్ని అంశాల పైన నిర్ధుష్టమైన అవగాహనను పెంచుతున్నారు.
పెద్ద వారైన స్ర్తీలు లేక చిన్న పిల్లలైన స్ర్తీలు గృహహింసను కుటుంబ హింస ను తట్టుకోలేక లేక ఇంకేవిధంగానైనా అనాధలైన వారికి స్వాధార్ హోం ను ప్రభుత్వం కల్పిస్తోంది. మానసిక పరమైన సమస్యలకు కౌన్సలింగ్ లు ఏర్పాటు చేస్తోంది. ఇదే కాక అసలే విధమైన ఆధారం లేనివారికోసం స్టేట్ హోం ను, వ్యభిచార గృహం నుంచి విముక్తి పొందినవారు, లేక ఆడపిల్లల అక్రమ రవాణాలో విడుదలైన పిల్లలు ఉండడానికి పునరావాస కేంద్రంగా ఉజ్వల హోం లాంటివి కూడా ఫ్రభుత్వాలు ఏర్పాటు చేసి ఉన్నారు. కాని ఇవన్నీ ప్రజాబాహుళ్యంలోకి తక్కువగా ప్రచారం అయ ఉన్నాయ. వీటిని అందరికీ తెలిసేలా ప్రచార ఏర్పాటు చేయాలి. ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని నిరోధించేశక్తిగా ఎదిగితే అండగా నిలబడడానికి అటు ప్రభుత్వమూ ఇటు స్వచ్చంధ సంస్థలు ఉన్నాయన్న సంగతి అందరికీతెలిసే విధంగా ప్రసార మాధ్యమాలు కృషి చేయాలి. వాటిపై అవగాహనను ప్రతి మహిళకూ తెలిసే విధంగా కృషి చేయాలి. ఇట్లా ఎన్ని ఆసరాలు, చట్టాలు కల్పించినా ఎన్ని చట్టాలు తెచ్చినా లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకే నేటి మహిళలు సాధికారత కోసం పోరాడినా ముందుగా మనుష్యుల్లో మానవత్వాన్ని పెంచడానికి కృషి చేయాలి. శిశువు కు మొట్టమొదటి గురువు తల్లే కనుక కనీసం పుట్టిన వారికి చిన్నప్పటి నుండి మంచితనాన్ని, మానవత్వాన్ని నేర్పించాలి. అతి భయం కాని అతి స్వేచ్ఛ కాని లభించినా దాన్ని నలుగురి మంచికోసం ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించాలి. రాబోయే తరం అన్నా సర్వసమానత్వాన్ని సాధించేలా చేయగలగేశక్తి నేటి మహిళలపైనే ఉంది.

- జి. కల్యాణి