రాష్ట్రీయం

ఆఫ్ఘనిస్తాన్ టు గల్ఫ్.. వయా కడప!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జనవరి 23: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కడప జిల్లా అడ్డగా మారింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి గల్ప్ దేశాలకు వీటిని రవాణా చేసేందుకు అక్రమార్కులు కడప జిల్లాను కేంద్రంగా చేసుకున్నారు. చాలా కాలంగా ఈవ్యవసారం కొనసాగుతోంది. తాజాగా శనివారం జిల్లా పోలీసులు ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేయడంతో మాదకద్రవ్యాల అక్రమ రవాణా వ్యవహారం బట్టబయలైంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొకైన్‌ను భారతదేశానికి దిగుమతి చేసుకుని ఇక్కడి నుంచి కువైట్, దుబాయ్, ఖతార్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
కడప జిల్లా ఒంటిమిట్ట మండలానికి చెందిన ప్రసాద్(28), ఖాజా రహమ్మతుల్లా(34), సుండుపల్లె మండలానికి చెందిన షేక్ మస్తాన్‌వలీ(45), కేరళ రాష్ట్రానికి చెందిన మొహిద్దీన్(40), పరివెంగళ అజుబు(34)ను జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుండుపల్లెకు చెందిన షేక్ మస్తాన్‌వలీ గతంలో గల్ఫ్‌లో ఉన్నపుడు అక్కడి పరిచయాలతో మిగతా నలుగురిని కలుపుకుని కొకైన్‌ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి కడపకు తెప్పించి ఇక్కడి నుంచి ప్రయాణికుల సాయంతో గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసి విక్రయించేవాడు.
ఇదే వ్యవసారంలో గల్ఫ్ పోలీసులకు పట్టుబడి కొంతకాలం జైల్లో ఉండి తిరిగి సుండుపల్లెకు చేరుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తెచ్చిన కొకైన్‌ను ఈ ముఠా సభ్యులు గల్ఫ్‌లో ఉన్న భాస్కర్, మరో ముగ్గురికి సరఫరా చేస్తున్నారు. కేరళకు చెందిన మొహిద్దీన్ , పరివెంగళ అజుబు కదలికలపై నిఘా పెట్టిన అక్కడి పోలీసులు వారి అదుపులోకి తీసుకుని విచారించారు. వారి ఫోన్లలో కడప జిల్లాకు చెందిన షేక్ మస్తాన్‌వలీ, ప్రసాద్, ఖాజా రహమ్మతుల్లా నెంబర్లు కనిపించడంతో రెండురోజుల క్రితం జిల్లా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఒంటిమిట్ట, సుండుపల్లెల్లో నిఘావేసి కొకైన్ ఎగుమతులపై ఆరా తీశారు.
కొకైన్‌ను చిన్నచిన్న లగేజి బ్యాగుల్లో సర్ది ఇక్కడి నుంచి కువైట్, ఖతార్, సౌదీ, మస్కట్ వెళ్లే వారి సాయంతో ఎగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి అనుమానం రాకుండా ముఠా సభ్యులు ఈ తతంగం నిర్వహిస్తున్నారు. అవసరమైతే కొంతమందికి ముఠానే విమాన టికెట్లు కొనివ్వడం గమనార్హం. లగేజి గల్ఫ్‌కు చేరగానే భాస్కర్ వాటిని తీసుకుని కొకైన్‌ను చిన్న చిన్న ప్యాకెట్లలో నింపి విక్రయించేవాడు. చాలా కాలంగా ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతూ వస్తోంది. దీంతో ముఠా సభ్యుల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఎట్టకేలకు ఐదుగురిని అరెస్టుచేసి మాదకద్రవ్యాల రవాణాకు చెక్ పెట్టారు.