విశాఖ

విద్యుత్ కార్మికుల సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరకులోయ, ఫిబ్రవరి 22: దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ విద్యుత్ శాఖ కంట్రాక్టు కార్మికులు నిరవదిక సమ్మెబాట పట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట సి.ఐ.టి.యు. అధ్వర్యంలో శిబిరాన్ని ఏర్పాటు చేసి కార్మికులు గురువారం నుంచి సమ్మెకు దిగారు. నియోజకవర్గం పరిధిలోని హుకుంపేట మండలం మినహా మిగిలిన ఐదు మండలాలకు చెందిన కంట్రాక్టు కార్మికులంతా నిరవదిక సమ్మెలో పాల్గొన్నారు. కంట్రాక్టు కార్మికులు సమస్యల సాధన కోసం చేపట్టిన సమ్మెకు వైసీపీ నియోజకవర్గం సమన్వయకర్త చెట్టి ఫల్గుణ మద్దతు ప్రకటిస్తూ కార్మికులకు సంఘీభావం తెలిపారు. విద్యుత్ కంట్రాక్టు కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయన కోరారు. సి.ఐ.టి.యు. జిల్లా ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో అమలు చేస్తున్న ఒప్పంద, ఔట్‌సోర్సింగ్, పీస్‌రేట్ విధానం రద్దు చేయాలని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 19వ తేదిన చలో విద్యుత్ సౌదా పేరిట విజయవాడకు తరలివెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. విద్యుత్ సంస్థలో సమాన పనికి సమాన వేతనం అమలు, ఉద్యోగ భద్రత, పీస్‌రేట్, మూడో పార్టీ విధానం రద్దు, కంట్రాక్టు కార్మికులను దశలవారీగా సంస్థలో విలీనం చేయడం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు సార్లు ఆందోళన చేసినా ప్రభుత్వం స్పందించలేదని ఆయన అన్నారు. దీంతో గత్యంతరం లేక నిరవదిక సమ్మెకు దిగినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థ కంట్రాక్టు కార్మికుల సంక్షేమ సంఘం నాయకులు ఎస్.అప్పలస్వామి, టి.నిరంజన్, కె.తిరుపతి, ఎం.మోహన్, పి.నగేష్ తదితరులు పాల్గొన్నారు.

నీటి పథకాల నిర్మాణాలలో అవినీతిపై విచారణ జరిపించాలి
* సీపీఎం డిమాండ్
అరకులోయ, ఫిబ్రవరి 22: మండలంలో జరుగుతున్న మంచినీటి పథకం పనులపై విచారణ నిర్వహించాలని సి.పి.ఎం. జిల్లా కార్యవర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర డిమాండ్ చేసారు. స్థానిక గిరిజన సంఘం కార్యాలయ భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని పదకొండు పంచాయతీలకు చెందిన 30 గ్రామాలలో ప్రత్యేక అభివృద్ధి నిధులతో చేపట్టిన మంచినీటి పథకాల పనులలో అవకతవకలు జరిగినట్టు తెలుస్తోందని అన్నారు. తాగునీటి సమస్యతో ప్రతి సంవత్సరం ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామాలలో శాశ్వత ప్రాతపదికన మంచినీటి పథకాలు ఏర్పాటు చేయాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం 4 కోట్ల 22 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిందని ఆయన చెప్పారు. గిరిజన ఉప ప్రణాళిక కింద 51 లక్షల రూపాయలతో నాలుగు గ్రామాలలో, నాబార్డుకు చెందిన 46 లక్షలతో మూడు గ్రామాలలో, జాతీయ గ్రామీణాభివృద్ధి మంచినీటి పథకం కింద ముఖ్యమంత్రి దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీలో 5 కోట్ల రూపాయలతో, ప్రపంచ బ్యాంకు నిధులు 30 లక్షలతో మూడు మంచినీటి పథకాలు, మండల వ్యాప్తంగా పదకొండు కోట్ల రూపాయలతో చేపట్టిన నీటి పథకాల పనుల్లో అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకున్నట్టు ఆయన ఆరోపించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి తాగునీటి పథకాల నిర్మాణ పనులు చేపడుతున్నా ఇంతవరకు గ్రామాలలో మంచినీరు అందించలేకపోయారని ఆయన అన్నారు. మంచినీటి పథకం నిర్మాణ పనులు చేపట్టిన కంట్రాక్టర్లకే లబ్ధి చేకూరుతుందే తప్ప గిరిజనులకు ఈ పథకాల వలన ఎటువంటి ప్రయోజనం లభించడం లేదని ఆయన చెప్పారు. వేసవి కాలానికి ముందే అన్ని గ్రామాలలో మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తామన్న ఉద్ధేశ్యంతో ఈ పనులు చేపట్టినప్పటికీ ఇంతవరకు పూర్తికాలేదని ఆయన అన్నారు. గడువులోగా నీటి పథకాల పనులు పూర్తికాకపోగా, ఈ పనుల్లో నాణ్యత లోపించడంతో పాటు అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆయన ఆరోపించారు. ఉన్నత అధికారులు ఈ వ్యవహారంపై దృష్టి సారించి మండలంలోని నీటి పథకాల నిర్మాణంపై సమగ్ర విచారణ నిర్వహిస్తే అవినీతి అక్రమాలు వెలుగుచూస్తాయని సురేంద్ర చెప్పారు. విలేఖరుల సమావేశంలో సి.పి.ఎం. నాయకులు పొద్దు బాలదేవ్, కె.రామారావు పాల్గొన్నారు.

బోయవాల్మీకులపై సంతకాల సేకరణ
అరకులోయ, ఫిబ్రవరి 22: బోయ వాల్మీకులను గిరిజన జాబితాలో చేర్పించరాదంటూ ఎస్.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ప్రారంభమయ్యింది. ఎస్.ఎఫ్.ఐ. నాయకుడు పి.రామన్న ఆధ్వర్యంలో విద్యార్థులు సంతకాల సేకరణ చేపడుతున్నారు. మండలంలోని ప్రభుత్వ నివాసానుబంధ పారిశ్రామిక శిక్షణా సంస్థ, దండకారణ్య వృత్తివిద్యా కోర్సు కళాశాల, యువజన శిక్షణా కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, వివిధ పాఠశాలల విద్యార్థుల నుంచి సంతకాలు సేకరిస్తున్నారు. సంతకాల సేకరణ కార్యక్రమం తరువాత వీటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపనున్నట్టు రామన్న చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ. నాయకులు ఆనంద్‌బాబు, బాబురావు, రామన్న తదితరులు పాల్గొన్నారు.

వచ్చేది వేసవి కాలం...నీటి ఎద్దడి లేకుండా చూడాలి
* ఎంపీపీ సుకల రమణమ్మ
నర్సీపట్నం(టౌన్), ఫిబ్రవరి22: వచ్చేది వేసవి కాలం... గ్రామాల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీపీ సుకల రమణమ్మ అర్‌డబ్ల్యూ ఎస్ అధికారులను ఉద్దేశించి అన్నారు. గురువారం ఉదయం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వేములపూడిలో పెద్ద ట్యాంకు నుండి మంచి నీరు ఎందుకు ఆటంకం ఏర్పడుతుందో అధికారులు వివరణ ఇవ్వాలని అన్నారు. సంవత్సరాల తరబడి ట్యాంకు సమస్య నాన్చుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాగే గురందొరపాలెంలో మంత్రి అయ్యన్నపాత్రుడు 3లక్షలు రూపాయలు మంజూరు చేసి నిర్మించిన మంచి నీటి ట్యాంకు కరెంటు సమస్య కారణంగా జాప్యం జరుగుతుందని అన్నారు. అధికారులు వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో మంచి నీటి ఉత్పన్నమవ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. మండల సర్వసభ్య సమావేశానికి 25 ప్రభుత్వశాఖల అధికారులు హాజరు కావల్సి ఉండగా కేవలం 11 శాఖలు మాత్రమే హాజరు కావడం జరిగిందన్నారు. అన్ని శాఖల అధికారులు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ అధికారులకు సూచించారు. పెళ్లికానుక పథకంలో బీసీలకు 30వేలు, ఎస్సీలకు 40వేల రూపాయల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. అయితే సంబంధం కుదుర్చుకున్న వెంటనే విషయం అధికారుల దృష్టికి తీసుకురావల్సి ఉందని అన్నారు. చంద్రన్న బీమా పథకం బాగా నడుస్తుందని, చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఒక అండగా పథకంగా నిలుస్తుందని ఎంపీపీ అన్నారు. మండలంలో ఎన్టీఅర్ హౌసింగ్ పథకంలో మంజూరైన ఇళ్లు త్వరగతిన పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వేములపూడి ఎంపీటీసీ బోళెంరాంప్రసాద్ మాట్లాడుతూ వేలిముద్రలు పడని తెల్లరేషన్ కార్డు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. వేలిముద్రలు పడని వారి ఏదైన ఒక తేదీ సూచించి ఆతేదికి రేషన్ డిపోకి రమ్మంటే లబ్ధిదారులు డిపోల చుట్టూ తిరిగే పని ఉండదని అన్నారు. వేములపూడిలో అంగన్‌వాడి బిల్గింగ్‌కు మంజూరైన నిధులు రద్దు కావడంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని తప్పుపట్టారు. ఒకసారి మంజూరైన నిధులు తిరిగి వెనక్కితీసుకురాగలరా అంటూ పీఅర్ జే ఈ అలేఖ్యని నిలదీశారు. గబ్బాడ సర్పంచ్ మాట్లాడుతూ విశాఖపట్నం ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు ప్యాంసిజర్ బస్సు మాదిరిగా ఆగి ఆగి వెళ్తుందని, అటువంటప్పుడు నాన్‌స్టాప్ రేటు ఎందుకు వసూలు చేస్తున్నారని ఆర్టీసీ అధికారులను నిలదీశారు. బస్సుల్లో ఉన్న టీవీలు పని చేయడం లేదని, డీ ఎమ్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంకు ఎంపీడీవో ఆలస్యంగా రావడం పట్ల ఎంపీపీ అసహనం వ్యక్తం చేశారు. మండల సమావేశం ఉదయం 11గంటలకు మొదలు కావల్సి ఉండగా 11:30గంటలు దాటి పోవడంతో ఆమె ఎండీవోని నిలదీశారు. ఈసమావేశంలో జెడ్సీటీసీ చదలవాడ సువర్ణలత, ఎం అర్‌వో రమణ, పర్యవేక్షణ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.

మైనింగ్ తవ్వకాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వైకాపా నాయకులు
నాతవరం, ఫిబ్రవరి 22: మండలంలోని సరుగుడు పంచాయతీ మైనింగ్ తవ్వకాల అవకతవకలపై నర్సీపట్నం వై ఎస్సార్ సి.పి. కన్వీనర్ పెట్ల ఉమాశంకర్ గణేష్ మండల నాయకులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వినతి పత్రం అందించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ( ఎర్రమట్టి) టన్నుకు 43 రూపాయలు చొప్పున (డి. ఎం. ఎఫ్) ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటికే ఐదు లక్షల టన్నులు తరలించారని, సుమారు రెండు కోట్లపైనే ప్రభుత్వానికి చెల్లించినట్లైతే పంచాయతీకి ఒక కోటికి పైగా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనిపై గతంలో ఆర్డీవోకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా నిబంధనలకు విరుద్దంగా రవాణా చేయడంతో రోడ్లు శిధిలావస్థకు చేరడమే కాకుండా రోడ్డు పక్కన నివాసం ఉంటున్న కుటుంబాల వారు అనారోగ్యం పాలవుతున్నారన్నారు. దీనిపై తక్షణం స్పందించకుంటే ఆయా గ్రామాల వారితో ఆందోళనలు చేపడతామని గణేష్ హెచ్చరించారు. ఈకార్యక్రమంలో వై ఎస్సార్ సి.పి. నాయకులు జమీలు, శెట్టి నూకరాజు, పైల పోతురాజు, మండల వైకాపా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

న్యూట్రీ గార్డెన్ల ద్వారా పౌష్టికాహారం
కొయ్యూరు, ఫిబ్రవరి 22: పిల్లలు, గర్భిణీ స్ర్తిలకు పౌష్టికాహారం అందించేందుకు వీలుగా ఐ.సి.డి. ఎస్. ఆధ్వర్యంలోన్యూట్రీ గార్డెన్స్ ఏర్పాటు చేయనున్నారు. మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఉండే చిన్నారులు, బాలింతలు, గర్భిణీ స్ర్తిలకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం అన్ని పంచాయతీకేంద్రాల్లోనూ న్యూట్రీ గార్డెన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. వీటి ద్వారా క్రిమి సంహారక మందులు, రసాయనాలు వాడకుండా పోషక విలువలు కలిగిన తాజా కూరగాయలను పడించి అంగన్‌వాడీలకు అందించనున్నారు. ఐ.సి.డి. ఎస్. ఆధ్వర్యంలో మండలంలోని 33 పంచాయతీల్లో ఏర్పాటు చేసే వీటి ఏర్పాటుకు స్థానిక రెవెన్యూ అధికారులు ఆయా పంచాయతీల సర్పంచ్‌లు, వి. ఆర్. ఓ.లతో గ్రామాల్లో ఉండే ప్రభుత్వ భూమిని పరిశీలిస్తున్నారు . కనీసం నుండి 20 నుండి 35 సెంట్లు భూమి అయినా కేటాయించాల్సి ఉండగా అనువైన చోట్ల 40 నుంచి 60 సెంట్లు భూమిని పరిశీలిస్తున్నట్లు రెవెన్యూ సిబ్బంది తెలిపారు. రేవళ్ళు పంచాయతీలో 50 సెంట్లు భూమిని సర్పంచ్ కొండమ్మ, సర్వేయర్ రామకృష్ణ, వి. ఆర్. ఓ. పండయ్యలు పరిశీలించి కేటాయించారు. మంపలో 40 సెంట్లు భూమి కేటాయించినట్లుగా రెవెన్యూ సిబ్బంది తెలిపారు. అంగన్‌వాడీల్లోని పిల్లలకు, గర్భిణీలకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

యాదవ యువగర్జన విజయవంతం చేయాలి
అనకాపల్లి, ఫిబ్రవరి 22: ఈనెల 25వ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే రాష్ట్ర యాదవ యువగర్జనను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఫ్రధాన కార్యదర్శి సబ్బి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక యాదవ సంఘం కార్యాలయంలో జిల్లా యాదవ సంఘ నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సబ్బి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా యాదవ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ విజయవాడలో అఖిలభారతీయ యాదవ మహాసభ వారి ఆధ్వర్యంలో నిర్వహించే యువగర్జనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు పంచదార్ల సూరిబాబు, కార్యదర్శి వియ్యపు సింహాచలం యాదవ్, వాయిబోయిన శేఖర్, బొట్టా పద్మావతి, పల్లా అర్జున, మొల్లి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

అగ్రీగోల్డ్ బాధితుల కోసం 4వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి
అనకాపల్లి, ఫిబ్రవరి 22: అగ్రీగోల్డ్ కష్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అగ్రీగోల్డ్ బాధితులకు నాలుగువేల కోట్లతో ప్రత్యేక నిధిని కేటాయించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. గురువారం సంఘం నాయకులు వైఎన్ బద్రం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఆయన మాట్లాడుతూ అగ్రీగోల్డ్ కంపెనీ ఎనిమిది రాష్ట్రాలలో 32లక్షల మందిని మోసగించిందన్నారు. రాష్ట్రంలో 19.52లక్షల మంది పేదలను నిలువునా ముంచిందన్నారు. అగ్రీగోల్డ్ కంపెనీ చేసిన మోసానికి గురైన బాధితులు బలవన్మరణానికి పాల్పడ్డారని, వారిని తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఎస్‌ఎల్ గ్రూప్ అగ్రీగోల్డ్ కంపెనీని టేకోవర్ చేసుకోవడంలో తత్సారం జరుగుతుందని ఈ విషయాన్ని గుర్తించి ప్రభుత్వం ముందుగా తన నిధుల నుండి ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కరణం మాణిక్యాలరావు, ఎంజి రమణ, మల్లిఖార్జున, ఎస్. కోటేశ్వరరావు, కోన లక్ష్మణ్, బాధితులు పాల్గొన్నారు.

కర్ణాటక సాంస్క్రతిక ఉత్సవాలకు నేహఅక్షయ, సౌమ్యశ్రీలకు పిలుపు
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 22: కర్ణాటక రాష్ట్రంలోని కడూరులో మార్చి 1 నుండి రెండురోజులపాటు నటనం బాల్యనాట్య కేంద్రం సంస్థ నిర్వహిస్తున్న ఇంటర్ స్టేట్ కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్‌కు అనకాపల్లికి చెందిన కండ్రెడ్డి నేహ అక్షయ, వాసిరెడ్డి శ్యామసౌమ్యలు హాజరవుతున్నట్లు స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ కొరియోగ్రాఫర్ ఆర్. నాగరాజు పట్నాయక్ తెలిపారు. అనకాపల్లికి చెందిన ఈ చిన్నారులు ఆంధ్రప్రదేశ్ సాంస్క్రతిక శాఖచే గుర్తింపుపొందరన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్ ఫోక్‌లెర్ ఫెస్టివల్‌లో ఇండియన్ టీమ్ సభ్యులుగా పాల్గొని ఆంధ్రా, ఒరిస్సా జానపద నృత్యాలను ప్రదర్సించారన్నారు. సుమారుగా 14 దేశాల నుండి జానపద నృత్య కళాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఈ పోటీల్లో చక్కని హావాభావాలతో ప్రదర్శనలిచ్చిన ఆయా దేశాల ప్రతినిధుల నుండి మన్ననలు పొందారన్నారు. అలాగే బాలభవన్ సొసైటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నిర్వహించిన జాతీయ యువ పర్యావరణ శాస్తవ్రేత్తల సమ్మేళనం, విశాఖ ఉత్సవ్, ప్రపంచ పర్యాటక ఉత్సవ్ తదితర పలు జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొని తమ నాట్య ప్రదర్శనలతో పలువురి నుండి ప్రశంసలతోపాటు గుర్తింపును పొందారని ఆయన తెలిపారు.