నేర్చుకుందాం

నరసింహ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ॥ కూటికోసము నేఁను గొణగాని జనులచే
బలు గద్దరింపులు పడఁగ వలసె
దారసుతభ్రమ దగిలి యుండుటఁగదా
దేశదేశములెల్లఁ దిరుగవలసె
పెను దరిద్రతపైనఁ బెనఁగయుండుటఁ గదా
చేరి నీచుల సేవఁ జేయ వలసె
నభిమానములు మది నంటి యుండుటఁ గదా
పరులఁజూచిన భీతిపడఁగవలసె

తే॥ నిటుల సంసారవారాశి నీదలేక
వేయి విధముల నిన్ను నే వేడుకొంటి
భూషణవికాస! శ్రీ్ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!

భావం: నేను కూటి కోసం కొఱమాలిన జనంచేత మాటలు పడవలసి వచ్చింది. ఆలుపిల్లలనే భ్రాంతిలో ఊరూరు తిరగవలసి వచ్చింది. పేదరికం వల్ల నీచుల్ని ఆశ్రయించి ఊడిగం చేయవలసి వచ్చింది. అభిమానంవల్ల ఇతరుల్ని చూచి భయపడవలసి వచ్చింది. తండ్రీ! సంసార సముద్రాన్ని తరించలేక నిన్ను వేడుకుంటున్నాను. నన్ను రక్షించు స్వామీ!