ఆంధ్రప్రదేశ్‌

వేడుకగా శ్రీ జ్వాలా నరసింహుని కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 26: ప్రముఖ పుణ్యక్షేత్రం ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహస్వామి కల్యాణ వేడుకలు సోమవారం రాత్రి వేడుకగా జరిగాయి. ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలా నరసింహస్వామి, చెంచులక్ష్మి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, చీనాంబరాలు తొడిగించి అందంగా అలంకరించారు. పల్లకిలో స్వామి, అమ్మవార్లను ఆశీనులను చేసి తొలుత ఎదుర్కొలు ఉత్సవం నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య వేలాదిగా తరలివచ్చిన భక్తుజనం తిలకిస్తుండగా స్వామి, అమ్మవార్ల కల్యాణం నిర్వహించారు. చివరకు స్వామి, అమ్మవార్ల పాదాల చెంత ముత్యాల తలంబ్రాలు పోశారు. జిల్లా నుంచే గాగ రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని తిలకించి పునీతులయ్యారు.