రాష్ట్రీయం

అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 23: రాజధాని రైతులకు ఎలాంటి అన్యాయం జరగదని, వారంతా ఇచ్చిన సూచనలను తప్పక పరిగణనలోకి తీసుకుని సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, సిఆర్‌డిఎ వైస్ చైర్మన్ పి నారాయణ స్పష్టం చేశారు. సిఆర్‌డిఎ కమిషనర్ శ్రీకాంత్‌తో కలిసి సింగపూర్‌లో రెండు రోజుల పర్యటనను శనివారం ఉదయం ప్రారంభించిన సందర్భంగా మంత్రి నారాయణ ఒక ప్రకటన విడుదల చేశారు. మాస్టర్‌ప్లాన్ ముసాయిదాపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించిన సందర్భంగా రైతుల నుంచి వ్యక్తమైన అభిప్రాయాలు, అభ్యంతరాలను సుర్బానా కంపెనీ ప్రతినిధులతో చర్చించామన్నారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ హైవే, ప్రధాన రహదారులు, గ్రామకంఠా తదితర అంశాలపై చర్చ కొనసాగింది. ప్రస్తుతం రైతుల ముందు చర్చించిన మాస్టర్‌ప్లాన్ కేవలం ముసాయిదా మాత్రమేనని అందువల్ల చేర్పులకు, మార్పులకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ విషయంలో రాజధాని రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గ్రామాల్లో సమస్యలు జఠిలంగా ఉన్నపక్షంలో ప్రత్యామ్యాయాన్ని అనే్వషించాల్సిందిగా సుర్బానా ప్రతినిధులకు వివరించినట్లు వెల్లడించారు. ఇప్పటికే సిఆర్‌డిఎ అధికారులు ప్రతి గ్రామంలో పర్యటించి మాస్టర్‌ప్లాన్ ముసాయిదాపై రైతులకు అవగాహన కల్పించడమే కాకుండా అభిప్రాయాలను కూడా స్వీకరించడం జరిగిందన్నారు. ఆయా గ్రామ ప్రజల నుంచి ఎదురైన సందేహాలను, సలహాలను స్వీకరించి సింగపూర్ కంపెనీ ప్రతినిధులకు తెలియజేయడం జరిగిందన్నారు. కంపెనీ ప్రతినిధులు ప్రజలు వ్యక్తంచేసిన సమస్యలపై చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలని మంత్రి నారాయణ సుర్బానా కంపెనీ ప్రతినిధులకు సూచన చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో సాంకేతికంగా ఎదురైన ఇబ్బందుల కారణంగా ఇచ్చిన హామీల అమలులో కొంత జాప్యం చోటు చేసుకుందన్నారు. అయినప్పటికీ సాంకేతిక ఇబ్బందులను అధిగమించి వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వివరణ ఇచ్చారు.