ఆంధ్రప్రదేశ్‌

ఈ దారి మాది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 19: దశాబ్దాలుగా రెండువర్గాల మధ్య రాజుకుంటున్న రహదారి వివాదం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుబాడు గ్రామంలో బుధవారం పార్టీ కక్షల రూపంలో భగ్గుమంది. ఈ దారి మాది... ఇకపై ఈవైపుగా నడిచేందుకు వీలులేదని ఏకంగా రోడ్డుకు అడ్డంగా గోడకట్టిన ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం పొనుగుబాడు గ్రామంలో అగ్రవర్ణాల వారు గతంలో తమ పొలాలకు వెళ్లేందుకు వీలుగా డొంకమార్గాన్ని నిర్మించుకున్నారు.
కాలక్రమంలో ఆ రహదారి వెంబడి దళితులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అప్పట్లో అధికారులు రహదారి విషయమై దళితులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా, అగ్రవర్ణాల వారి జీవనానికి అడ్డులేకుండా వ్యవహరించాలని సూచించారు.
కాలక్రమంలో రెండువర్గాల మధ్య ఈ మార్గం విషయంలో అనేక పర్యాయాలు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించటంతో బుధవారం దళితులు ఈ దారి మాది, మాకు చెందినది మాత్రమే అంటూ రహదారికి అడ్డంగా సుమారు ఆరు అడుగుల ఎత్తులో బ్రిక్స్ రాళ్లతో అప్పటికప్పుడు గోడను నిర్మించారు. అగ్రవర్ణాలకు చెందిన వారిలో ఎక్కువ మంది టీడీపీకి, దళితుల్లో ఎక్కువ మంది వైసీపీకి ఓటేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అవాక్కైన అగ్రవర్ణ పెద్దలు ఇదేమిటని ప్రశ్నించగా, కోపోద్రిక్తులైన దళితులు తమ ఆవాసాల మీదుగా వెళ్లటానికి వీలు లేదంటూ భీష్మించుకుని కూర్చున్నారు. పరిస్థితి అదుపుతప్పే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇరువర్గాలకు చెందిన కొంతమంది తహశీల్దార్ రాజ్యలక్ష్మీ, ఎస్‌ఐ శ్రీహరి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో తహశీల్దార్ గ్రామంలో 145 సిఆర్‌పిఎస్ సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ఘటనలో రెండువర్గాలకు చెందిన 15 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో సామాజిక మాద్యమాల ద్వారా వైరల్ కావడంతో రాష్టవ్య్రాప్తంగా పొనుగుబాటు గోడ ఘటన సంచలనం రేకెత్తించింది.
ఇదిలా ఉండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షం రోజుల్లోనే గుంటూరు జిల్లాలో విధ్వంసకర సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో రాజకీయ రంగు పులుముకుంటుంది.
ఇటీవల పల్నాడు ప్రాంతమైన మాచర్ల మండలం పినె్నల్లిలో కొందరిని గ్రామ బహిష్కరణ చేస్తూ వైసీపీకి చెందిన కొందరు నాయకులు నిర్ణయం తీసుకోవడంతో, గ్రామస్థులు రూరల్ ఎస్‌పీని కలిసి ఫిర్యాదు చేశారు. అది మరవకముందే మంగళవారం రాత్రి నర్సరావుపేటలోని ఓ హాస్పిటల్‌పై వైసీపీ కార్యకర్తలుగా భావించే అల్లరిమూకలు దాడి చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడంతో పాటు వైద్యులపై దాడి చేయడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా పొనుగుబాడు ఘటన కూడా ఇదే కోవకు చెందినదిగా భావిస్తుండటం శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగే ప్రమాదం లేకపోలేదని జిల్లావాసులు, రాజకీయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.