అంతర్జాతీయం

అలాస్కాలో భారీ భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 24: దక్షిణ అలాస్కాలో ఆదివారం గ్రీనిచ్ కాలమానం ప్రకారం ఉదయం పదిన్నర గంటల సమయంలో రిక్టర్ స్కేలుపై 7.1 పాయింట్ల తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు సంభవించిన ఈ భూకంపం కేంద్రం పాత ఇలియామ్నాకు తూర్పుగా 83 కిలోమీటర్ల దూరంలో ఉందని అమెరికా జియాలజికల్ సర్వే తెలియజేసింది. భూమిలోపల 127 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉందని అది తెలిపింది. ఈ భూకంపం వల్ల ఏదయినా ప్రాణ, ఆస్తినష్టం సంభవించిందా లేదా అనేది వెంటనే తెలియరాలేదు కానీ, ఈ భూకంపం తీవ్రత చాలా ఎక్కువగాను, సుదీర్ఘంగాను ఉన్నట్లు ట్విట్టర్‌లో పలువురు పేర్కొన్నారు. అయితే సునామీ వచ్చేందుకు అవకాశం లేదని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది.