అంతర్జాతీయం

మతం నుంచి ఉగ్రవాదాన్ని విడదీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనామా, జనవరి 24: మతం నుంచి ఉగ్రవాదాన్ని వేరుచేయాల్సిన అవసరం ఉందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఉద్ఘాటించారు. ఉగ్రవాద గ్రూపులను పెంచి పోషించేవారు చివరికి వాటికే బలి అవుతారని ఆమె హెచ్చరిస్తూ, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత్, అరబ్ దేశాలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మనామా చేరుకున్న సుష్మా స్వరాజ్ ఆదివారం భారత్-అరబ్ సహకార వేదిక మంత్రుల స్థాయి సమావేశంలో ప్రసంగిస్తూ అరబ్ లీగ్ సభ్య దేశాల మంత్రులకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ వేదికను భారత్, అరబ్ దేశాల మధ్య సంబంధాల్లో ‘కీలక మలుపు’గా సుష్మా స్వరాజ్ అభివర్ణించారు. మతాన్ని ఉపయోగించుకుని హింసాకాండకు తెగబడుతున్న ఉగ్రవాదులు అన్ని మతాలవారికి తీవ్ర హాని కలిగిస్తున్నారని, మతం నుంచి ఉగ్రవాదాన్ని విడదీయడమంటే మానవత్వాన్ని విశ్వసించే వారిని, విశ్వసించని వారిని వేరుచేయడమేనని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇలావుండగా, వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు తదితర రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, బహ్రెయిన్ నిశ్చయించుకున్నాయి. నేరస్థుల బదిలీ ఒప్పందంపై కూడా ఇరు దేశాలు సంతకాలు చేశాయి. భారత్-అరబ్ లీగ్ సహకార వేదిక సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన సుష్మా స్వరాజ్ శనివారం బహ్రెయిన్ విదేశాంగ మంత్రి ఖలీద్ బిన్ అల్ ఖలీఫాతో వివిధ అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. ఈ చర్చలు ముగిసిన అనంతరం ఇరువురు నేతలు నేరస్థుల బదిలీ ఒప్పందంపై సంతకాలు చేశారు.