క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లో సెరెనా, షరపోవా ఢీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 24: ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ వన్, రష్యా బ్యూటీ మరియా షరపోవా మధ్య పోరు ఖాయమైంది. ప్రీ క్వార్టర్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా 6-2, 6-1 ఆధిక్యంతో రష్యాకు చెందిన అన్‌సీడెడ్ మార్గరితా గాస్పర్యాన్‌ను చిత్తుచేసింది. రాడ్ లెవర్ ఎరినాలో జరిగిన ఈ మ్యాచ్‌లో 21 గ్రాండ్ శ్లామ్ టైటిళ్ల విజేత, 34 ఏళ్ల సెరెనా ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలుపొందగా, షరపోవా 7-6, 7-5 ఆధిక్యంతో 12వ సీడ్ బెలిండా బెన్సిక్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆమె చిరకాల ప్రత్యర్థి సెరెనాతో అమీతుమీ తేల్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంది. ప్రపంచ
ర్యాంకిం గ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న 28 ఏళ్ల షరపోవా ఇప్పటి వరకూ సెరెనాతో 20 పర్యాయాలు ఢీ కొంది. వీటిలో 18 మ్యాచ్‌లను చేజార్చుకొని, కేవలం రెండు విజయాలను మాత్రమే సాధించింది. 6.2 రెండు అంగుళాల పొడవుతో టెన్నిస్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న షరపోవా 2001లో ప్రొఫెషనల్‌గా మారగా, 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుగల సెరెనా 1995లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా అవతారం ఎత్తింది. కెరీర్‌లో షరపోవా 597 విజయాలు సాధించింది. 144 పరాజయాలను చవిచూసింది. అదే విధంగా సెరెనా 737 మ్యాచ్‌ల్లో గెలిచింది. 123 మ్యాచ్‌లను కోల్పోయింది. షరపోవా ఐదు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకుంటే, సెరెనా ఖాతాలో 21 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు ఉన్నాయి. మొత్తం మీద కెరీర్‌లో షరపోవా 35, సెరెనా 69 చొప్పు టైటిళ్లను అందుకున్నారు. ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో వీరిద్దరి మధ్య పోరు మరోసారి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది. షరపోవాపై సెరెనాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకుల అంచనా. ఇలావుంటే, నాలుగో సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా కూడా క్వార్టర్స్‌లో స్థానం సంపాదించింది. ఆమె 6-7, 6-1, 7-5 తేడాతో అనా లెనా ఫ్రైడ్‌సమ్‌ను ఓడించింది. డరియా గొఫిన్‌ను ఢీకొన్న కార్లా సౌరెజ్ నవరో మొదటి సెట్‌ను 0-6 తేడాతో చేజార్చుకుంది. అయితే, ఆతర్వాత పుంజుకొని ఎదురుదాడికి దిగింది. వరుసగా రెండు సెట్లను 6-3, 6-2 తేడాతో సొంతం చేసుకొని క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది.