రంగారెడ్డి

ఆదివారం అభ్యర్థుల ప్రచార జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, జనవరి 24: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌కు తెదేపా, కాంగ్రెస్ పార్టీలు నేటివరకు ఒరగబెట్టిందేమీ లేదని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టిఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని బుద్వేల్ రైల్వేస్టేషన్, ఆదర్శనగర్, అరాంఘర్ ప్రాంతాల్లో ఆయన ఇంటింటికీ తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో గత పాలకులు చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు కేవలం అధికారాన్ని నిలబెట్టుకోవడానికే కృషి చేశారని, డివిజన్ అభివృద్ధికి ఎంత మాత్రం కృషి చేయలేదని పేర్కొన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు డివిజన్‌లో తన గెలుపునకు మార్గమవుతాయని చెప్పారు. కేసిఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్తూ అర్హులందరికీ అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో దేవులపల్లి స్వామి, జోగి శేఖర్, సురేందర్‌రెడ్డి, సరికొండ నర్సింగ్, శ్రీనివాస్‌రెడ్డి, శివారెడ్డి, విక్రమ్, చిన్న, మంచర్ల చిరంజీవి, అంజి ముదిరాజ్, అడికె అభిలాష్, కుమార్, మహేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో తెదేపా ఆధ్వర్యంలోనే ఎంతో అభివృద్ధి జరిగిందని తెదేపా మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ అన్నారు. ఆదివారం డివిజన్ పరిధిలోని ఆప్కోకాలనీ, ఆదర్శకాలనీ, భావనారుషి కాలనీలలో ఆయన ప్రచారం నిర్వహించారు. గత ఐదేళ్ల కాలంలో డివిజన్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తనకు రెండవ సారి అవకాశం ఇస్తే డివిజన్‌ను మరింత అభివృద్ధి చేసి చూపుతానన్నారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌లో గతంలో ఎన్నో సమస్యలు ఉండేవని వాటి అన్నింటినీ పరిష్కరించినట్టు చెప్పారు. టిఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపుతూ మభ్యపెడుతున్నాయని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి నిజాయితీగా ఉన్న నాయకుడికే పట్టం కట్టాలని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో తాను ఈసారి కూడా గెలుపొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కె.యాదగిరి, కె.ఎల్లప్ప, నరేందర్, టి.ప్రేమ్‌గౌడ్, మహేష్, గంజి వెంకటేష్, నిర్మల, లలితారెడ్డి, వివేక్, గోపాల్‌గౌడ్, రాజు ముదిరాజ్, అడికె అర్జున్, తిమ్మయ్య, నిరంజన్, సంకూరి జయప్రకాష్ పాల్గొన్నారు.
గోకుల్ ప్లాట్స్‌లో..
గచ్చిబౌలి: మాదాపూర్ డివిజన్ టిడిపి అభ్యర్థి ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ గోకుల్ ప్లాట్స్‌లో పాదయాత్ర నిర్వహించి, తనను గెలిపిస్తే వౌలిక సదుపాయాలతోపాటు, గోకుల్ ప్లాట్స్ భూ సమస్యను పరిష్కరిస్తానన్నారు. స్థానిక సమస్యలపై తనకు అవగాహన ఉందని, గ్రేటర్‌లోనే మాదాపూర్ డివిజన్‌ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఆయన హామి ఇచ్చారు. కార్యకర్తలతో కలిసి టీ కాస్తూ, సైకిల్ తొక్కుతూ, కూరగాయలు అమ్ముతూ అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ జంగయ్య యాదవ్, కార్యదర్శులు ప్రభాకర్ యాదవ్, నాయకులు అప్పారావు, శ్రీనివాస్, హరికృష్ణ ప్రసాద్, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి, హఫీజ్‌పేటలలో..
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ఆదివారం ముమ్మరంగా ప్రచారం చేశారు. సుదర్శనగర్, పాపిరెడ్డి కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, వీరేశంగౌడ్, బంతిరెడ్డి, రవీందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హఫీజ్‌పేట టిఆర్‌ఎస్ అభ్యర్థి వి.పూజిత జగదీశ్వర్‌గౌడ్ ఆదివారం అంబేద్కర్‌నగర్‌లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జనప్రియ అపార్టుమెంట్స్‌లో ఇంటింటికి తిరిగి ప్రచారం ప్రారంభించారు. కార్యక్రమంలో సంజీవరెడ్డి, సోమయాజులు, రాఘవాచారి, జ్యోతిరెడ్డి, లావణ్య, వసంత, రత్న పాల్గొన్నారు.
టిఆర్‌ఎస్‌ని గెలిపించండి
వనస్థలిపురం: మన్సురాబాద్ డివిజన్ టిఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల విఠల్‌రెడ్డిని గెలిపిస్తే స్థానిక సమస్యలు సులువుగా పరిష్కరించవచ్చని మంత్రి జగదీశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా వినాయక్‌నగర్, బొమ్మలగుడి, బాల్‌రెడ్డి నగర్, లెక్చరర్ కాలనీలలో ఆయన పర్యటించారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చి దిద్దటానికి ప్రణాళికను ముఖ్యమంత్రి కేసిఆర్ సిద్దం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక అభ్యర్థి కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు పి.జగదీష్ యాదవ్, టి.నాగరాజు, రాజశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు.
వనస్థలిపురం డివిజన్ టిఆర్‌ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి జిట్టా రాజశేఖర్‌రెడ్డి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకు పోతున్నారు. ఆయన సతీమణికూడా మహిళలను కలుస్తూ కారుగుర్తుకే ఓటు వేయండని అభ్యర్థిస్తున్నారు. వీరికి మద్దతుగా అచ్చంపేట ఎంఎల్‌ఏ బాలరాజు కూడా పాల్గొంటూ కార్యకర్తలకు ఉత్సాహాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా పలు కాలనీలలో ఆయన ప్రచారం నిర్వహించారు.
టిడిపి విజయం ఖాయం
వనస్థలిపురం డివిజన్‌లో టిడిపి అభ్యర్థి విజయం ఖాయమని పార్టీ సమన్వయ కర్త రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. స్థానిక అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా ప్రశాంత్‌నగర్, హిల్ కాలనీ, క్రాంతి హిల్స్‌లలో టిడిపి, బిజెపిలు కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, కోడాలి గోపి, రవిశంకర్ పాల్గొన్నారు.
యాప్రాల్‌లో..
జవహర్‌నగర్: టిఆర్‌ఎస్‌కి అడుగడున ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని నేరేడ్‌మెట్ డివిజన్ ఇన్‌చార్జి పుట్ట మధు కొనియాడారు. ఆదివారం యాప్రాల్‌లోని జెజెనగర్ కాలనీ అంబేద్కర్ విగ్రహానికి టిఆర్‌ఎస్ అభ్యర్ధి కె.శ్రీదేవి పూలమాల వేసి జెజెనగర్, యాప్రాల్ విలేజీలోని బస్తీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి చేబడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అల్వాల్ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ జీవకన్, మాజీ కార్పొరేటర్ ప్రసన్నకుమారి, సాయికుమార్, మధుసూదన్‌రెడ్డి, రాజన్, గోపు రమణారెడ్డి, దుర్గ పాల్గొన్నారు.
కాంగ్రెస్ వైపు మహానగర
ప్రజల చూపు
పటన్‌చెరు: జిఎచ్‌ఎంసి ఎన్నికల నేపథ్యంలో మహానగర ప్రజలు కాంగ్రెస్ వైపు ఆసక్తిగా చూస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ విశ్వాసం వెలిబుచ్చారు. కేవలం కాంగ్రెస్ పార్టీ పాలనతోనే గ్రేటర్ హైద్రాబాద్ అభివృద్ధి సాధ్యమని నమ్మిన ప్రజలు ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ఆదివారం పటన్‌చెరు డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌యాదవ్‌తో కలిసి పట్టణంలోని చైతన్యనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దివంగత సిఎం వైఎస్‌ఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి చూసిన నగర ప్రజలు మరోసారి జిఎచ్‌ఎంసిలో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ఆసక్తిగా ఉన్నారని అన్నారు. మహానగరం చుట్టూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఔటర్ రింగ్ రోడ్డు వైఎస్‌ఆర్ పాలనలోనే చేపట్టిన విషయం నగర ప్రజలకు తెలుసునన్నారు. హైదరాబాద్ ప్రజలు ప్రయాణంలో అనునిత్యం అనుభవిస్తున్న ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల వ్యయంతో ఓఆర్‌ఆర్ నిర్మాణం చేపట్టిందన్నారు.
శంషాబాద్ విమానాశ్రయం నిర్మించి భారతావనిలోనే మహానగరానికి మంచి గుర్తింపు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని అన్నారు. నిరుపేదలు సైతం లక్షల రూపాయలు సంపాదించడానికి అనువుగా రియల్‌ఎస్టేట్ వ్యాపారానికి ఊతమిచ్చిన ఘనత కాంగ్రెస్ సిఎం వైఎస్‌ఆర్‌కే దక్కిందన్నారు. ఓఆర్‌ఆర్ నిర్మాణం జరిగిన తరువాత వ్యవసాయ భూములు కోట్ల రూపాయలు పలుకుతున్నాయని, ఇది కాంగ్రెస్ పుణ్యమే అని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ అభ్యర్థి శంకర్‌యాదవ్, పాటి సర్పంచ్ రాములు యాదవ్, ఇస్నాపూర్ మాజీ సర్పంచ్ శ్రీశైలం పాల్గొన్నారు.