జాతీయ వార్తలు

అత్యాచార నిరోధక చట్టానికి మరింత పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: షెడ్యూల్డు కులాలు (ఎస్సీ), షెడ్యూల్డు తెగలకు (ఎస్టీ) చెందిన వారిపై అత్యాచారాలకు పాల్పడే వారిపై మంగళవారం నుంచి కఠినమైన చర్యలు అమలులోకి వస్తున్నాయి. సామాజిక, ఆర్థిక బహిష్కరణసహా ఎస్సీ, ఎస్టీల గౌరవానికి ఎలాంటి భంగం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీల (అత్యాచార నిరోధక) సవరణ చట్టం-2015 ప్రకారం ఎస్సీ, ఎస్టీల తల లేదా మీసాలు గొరిగించినా, వారి గౌరవానికి భంగం కలిగించినా అది వారిపై అత్యాచారానికి పాల్పడినట్లే అవుతుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎస్సీ, ఎస్టీలకు సాగునీటి వసతిని నిరాకరించినా, వారి అటవీ హక్కులను అడ్డుకున్నా, వారికి చెప్పుల దండ వేసినా, వారితో బలవంతంగా మనుషుల మృతదేహాలు లేదా జంతువుల కళేబరాలను మోయించినా, మృతదేహాలను పూడ్చిపెట్టడానికి గుంతలు తవ్వించినా, పాకీపని చేయించినా, ఎస్సీ, ఎస్టీ మహిళలను దేవదాసీలుగా మార్పించినా, వారిని కులం పేరుతో దూషించినా అది ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారానికి పాల్పడినట్లే అవుతుంది. ఎస్సీ, ఎస్టీలపై సామాజిక లేదా ఆర్థిక బహిష్కరణకు పాల్పడినా, ఎస్సీ లేదా ఎస్టీ మహిళ దుస్తులను తొలగించడం ద్వారా ఆమెను బాధించినా, ఎస్సీ లేదా ఎస్టీ వ్యక్తిని ఇల్లు లేదా నివాసం లేదా గ్రామం వదలిపోవాలని బలవంతం చేసినా, ఎస్సీ, ఎస్టీలపై లైంగిక చర్యలకు పాల్పడినా, సైగలద్వారా లైంగికంగా హింసించినా, ఫలానా వ్యక్తికే ఓటు వేయాలని లేదా ఫలానా వ్యక్తికే ఓటు వేయొద్దని బెదిరించినా, అడ్డుకున్నా దాన్ని ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారానికి పాల్పడినట్లుగానే పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీలను గాయపరిచినా, తీవ్రంగా గాయపరిచినా కిడ్నాప్‌కు పాల్పడినా ఈ చట్టం కింద పదేళ్లకు తగ్గకుండా శిక్షకు గురయ్యే అవకాశం ఉంది.