అక్షర

అర్థంకాని ‘అంతిమ’ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతిమం
- రామాచంద్రవౌళి
వెల: రూ.150;
పుటలు: 199
ప్రతులకు:
నవోదయా బుక్‌హౌస్

పుస్తక ప్రచురణ/ ముద్రణ ఖర్చులు మిగతావాటి ధరలలాగే పెరుగుతున్నాయి. పూర్వంలాగా ప్రచురణకర్తలు కరువై, రచయితలే పూనుకుని రచనలకు పుస్తకరూపం కల్పించాల్సిన పరిస్థితులున్నాయి. పాఠకులకు పుస్తకాలు చదవడానికి ఇంటర్నెట్/ అంతర్జాలం కూడా అవకాశం కల్పిస్తోంది. అనేక అంతర్జాల పత్రికలు కూడా వెలువడుతున్నాయి. అంతర్జాల మాసపత్రిక ‘మాలిక’లో ధారావాహికంగా వెలువడిన రామాచంద్రవౌళి రచించిన ‘అంతిమం’ నవల పుస్తకరూపంలో పాఠకుల ముందుకు వచ్చింది.
అసలు మనిషికి ఏం కావాలి? ఎంత ప్రేమకావాలి? ఈ ప్రేమ దాహానికి ఒక అవధీ, అంతమూ అనేది ఉందా? ఉంటే ఎంత? ఎక్కడివరకు? ఎప్పటివరకు? తదితర ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం కనిపిస్తుందీ నవలలో. అత్యాధునిక సమకాలీన జీవితాలలోకి తొంగిచూసి సమాధానాలు తెలుసుకోవాలంటారు రచయిత.
నవల ‘జయరాజ్’ పాత్రతో మొదలవుతుంది. జయరాజ్ ఒక సర్కస్ కంపెనీలో పనిచేస్తూంటాడు. భార్య శైలతో కలిసి సాహసకృత్యాలు చేస్తూంటారు. గోళంలో అతివేగంగా మోటర్ సైకిళ్లు నడపడం ఒక సాహసం. రెండవది భార్య తిరిగే చక్రం మీద బంధింపబడి ఉన్నపుడు గురిచూసి ఆమెచుట్టూ పదునైన కత్తులు విసరడం ఏమాత్రం అవి తప్పినా భార్యని హత్యచేసినట్టేకదా? అన్న భయం జయరాజ్‌ని పీడిస్తూంటుంది. కాని శైలకి భర్త నేర్పరితనం మీద అపారమైన నమ్మకం ఉంటుంది. ఇద్దరి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా అమ్మాయి పుడుతుంది. కానీ కాన్సర్ వ్యాధిగ్రస్తురాలవుతుంది.
జానకి, రమణల పాత్రలు గురించి కూడా ప్రస్తావించాలి. రమణ ఐ.ఎ.ఎస్.అధికారి, జానకి పి.హెచ్.డి చేసినా పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా ఉద్యోగంచేస్తూంటుంది. పి.హెచ్.డి. చేసిన దానివి పి.జి. విద్యార్థులకి యూనివర్సిటీలో పాఠాలు చెప్పకుండా స్కూలు పిల్లలకి చెప్పడమేమిటన్నది రమణ అభిప్రాయం. ఇద్దరికి అభిప్రాయ బేధాలువచ్చి విడిపోతారు. అక్రమార్జన మీద పరస్ర్తిల మీద మోజున్న రమణ దగ్గిర కూతురు రవళి పెరగకూడదన్న నిశ్చయంతో జానకి కూతురురి బాధ్యతని తీసుకుంటుంది. రమణ సుమ మీద వ్యామోహంతో విడాకులు తీసుకుంటాడు.
వకుళ తీవ్రవాదుల దళంలో కొన్నాళ్లుండి సాధారణ జీవితంలోకి మారిన యువతి. రైలులోనుంచి వరంగల్ స్టేషన్ దిగినప్పుడు చిత్రమైన పరిస్థితిలో, అదే రైలులోంచి ఒక యువకుడు ప్లాట్‌ఫారం మీదకి తోయబడడం గమనిస్తుంది. అతన్ని ఆదుకోవాలనే నిర్ణయం తీసుకుని వరంగల్‌లో అద్దెకి ఇల్లు తీసుకుని ఉండడం ప్రారంభిస్తుంది. అతను గత జీవితం పూర్తిగా మరచిపోయాడన్నది గమనించి, మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తుంది.
అనూరాధ ఐ.ఎ.ఎస్. ఆఫీసర్, రమణ ఆకర్షణలో పడి అతన్ని వివాహం చేసుకుంటుంది. ఆవిడ సంతానం కావాలనుకుని పెళ్లిచేసుకుంటే రమణ ఆవిడ ఆస్తికోసం చేసుకుంటాడు. నవలా రచయిత అనుకున్న ప్రకారం పాత్రలు ప్రవర్తిస్తాయి. వకుళ పాత్రధారిణి చెప్పిన సూక్తిముక్తావళితో నవల ముగుస్తుంది. ఉదాహరణకు రాజకీయవేత్తలకు కూడా అరవై ఏళ్ల తర్వాత రిటైర్‌మెంటు తప్పనిసరి. రాజకీయవేత్తకి కనీసం విద్యార్హత ఉండాలి వగైరా.
అంతిమం నవల చదివినవారికి రచయిత అంతిమంగా ఏం చెప్పదలచుకున్నారు అంటే స్పష్టమయిన సమాధానం దొరకదు. నవలలో తను చదివిన పుస్తకాల ప్రస్తావన, సైకాలజీ విషయాలు సందర్భం కాకపోయినా ప్రస్తావించడం చదువరి సహనాన్ని పరీక్షిస్తాయి. ఫుట్ అన్న ఏకవచనానికి, ఫీట్లు అన్న బహువచనం వాడడం, పంటికింద రాయిలా అనిపిస్తుంది.

-పాలంకి సత్యనారాయణ