కృష్ణ

15నాటికల్లా ఆధార్‌తో సెనె్సస్ డేటా అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 5: జిల్లాకి చెందిన ఎన్‌పిఆర్ డేటా వివరాలు ఆధార్‌తో అనుసంధానం చేయడంతో 8659 ఎన్యుమరేషన్ బ్లాకులకు గాను 5298 ఇబి డేటా పనులను పూర్తిచెయ్యడం జరిగిందని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక కార్యదర్శి లింగపాణి పాణిగ్రాహి నిర్వహించిన ఎన్‌పిఆర్ సెన్సస్‌పై నిర్వహించిన దృశ్య శ్రవణ కార్యక్రమంలో కలెక్టర్ బాబు.ఎ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెన్సస్ డేటా నమోదు ప్రక్రియ ఆధార్‌తో అనుసంధానాన్ని ఈనెల 15 నాటికల్లా పూర్తిచెయ్యాలని, ఇందుకు నిధులు కూడా విడుదల చెయ్యడం జరిగిందన్నారు. కృష్ణాజిల్లాలో 3 మున్సిపల్, 8 రూరల్ మండలాల్లో పనులు బాగా లేదని తెలిపారు. కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ జిల్లాలో 8659 ఎన్యుమరేషన్ బ్లాకుల్లో 2756814 మందికి గాను 2025703 మందిని ఎన్యుమరేషన్ చెయ్యడం జరిగిందని, ఆధార్ నెంబర్‌లతో అనుసంధానం పూర్తి చేశామన్నారు. కొత్తగా 4011 మందిని గుర్తించామన్నారు. 58164 మందికి ఆధార్ సంఖ్య లేదని తెలిపారన్నారు. అటువంటి వారి నుండి యుఐడి నెంబరును తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ నమోదు ప్రక్రియలో 533002 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్లు, చిరునామాలు మారినట్లు గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో 6133 మంది కొత్తగా ఎన్యుమరేషన్ చేపట్టామని కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. జిల్లాలో రూ.2.66 కోట్ల మేరకు నిధులు విడుదలయ్యాయని తెలిపారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీలు, విజయవాడ నగరపాలక సంస్థ, 8 మండలాలు సెనె్సస్ ప్రక్రియలో వెనుకబాటుతనం గుర్తించామన్నారు. వెంటనే అదనపు సిబ్బందిని నియమించి నమోదు ప్రక్రియ వేగవంతం చేయయ్యడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండియన్, జి.సృజన, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే అధిక దిగుబడులు
* మంత్రి దేవినేని ఉమ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 5: వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధించవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. నగరంలోని ఎ కనె్వన్షన్ సెంటర్ నందు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యవసాయ, పాడి పరిశ్రమల, వాణిజ్య ప్రదర్శనను శుక్రవారం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన నూతన పోకడలను వినియోగించి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే పద్ధతులను రైతులు సాధించాలని మంత్రి ఉమామహేశ్వరరావు అన్నారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను వినియోగించడం ద్వారా వాతావరణ సమతుల్యతతో రైతులకు వ్యవసాయం లాభసాటికి అవకాశాలు ఉంటాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలు, జలవనరుల శాఖకు అధిక ప్రాధాన్యతతో పాటు వేల కోట్ల రూపాయలను కేటాయించడం జరుగుతుందన్నారు. రైతులకు వ్యవసాయాన్ని లాభసాటి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం హైబ్రీడ్ విత్తనాలను, ఎరువులను సబ్సిడీపై అందిస్తుందన్నారు. వ్యవసాయ ప్రదర్శనలు నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించడం వలన మరింతమంది రైతులు వాటిని సందర్శించడం ద్వారా నూతన పద్ధతులు అవగాహనకు గుర్తింపు పొందిన కంపెనీలు, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్లు, నిపుణులైన శాస్తవ్రేత్తలతో నూతన పద్ధతులపై రైతులకు సదస్సులో వివరిస్తున్నారని మంత్రి తెలిపారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, మత్స్యశాఖ, ఉద్యానవనశాఖ, పట్టు పరిశ్రమ వంటి రంగాల్లో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించే నూతన హైబ్రీడ్ విత్తనాలను, సాగు పద్ధతులను, జీవ సాంకేతిక పద్ధతులు, జీవ నియంత్రణ ఎరువులు, జీవ రసాయన ఎరువులు, మైక్రో న్యూట్రింట్స్, ప్రదర్శనలు, సదస్సులు ద్వారా రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. తొలుత మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మరింత సంతృప్తికరంగా ఆరోగ్యశ్రీ సేవలు
* 37 కార్పోరేట్ ఆసుపత్రులు, ప్రభుత్వాసుపత్రుల ప్రతినిధులతో కలెక్టర్ బాబు.ఎ భేటీ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 5: గతంలో ఆరోగ్యశ్రీ సేవలపై 26 శాతం మంది రోగులు స్పందన తెలియజెయ్యడం జరిగిందని, ఇప్పుడు వాటిపై కేవలం ఒక శాతం మంది రోగులు మాత్రమే స్పందన తెలియజెయ్యడం పట్ల ఆసుపత్రుల సేవల మెరుగుపై గతంలో ఆరోగ్యశ్రీ సిఇవోగా తాను పనిచేసి వున్నందున స్పందిస్తున్నానని కలెక్టర్ బాబు.ఎ పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి 37 కార్పోరేట్ ఆసుపత్రుల, ప్రభుత్వాసుపత్రుల ప్రతినిధులతో ఉద్యోగుల ఆరోగ్య సేవా పథకంపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఉద్యోగస్తుల భాగస్వామ్యంతో కూడిన సేవలను ఆసుపత్రులకు జరిపే చెల్లింపులపై త్వరగా చెల్లింపు జరిగేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మదనపల్లిలో సబ్ కలెక్టర్‌గా పనిచేసే సమయంలో కార్యాలయంలోని నాల్గవ తరగతి ఉద్యోగి ఆరోగ్యరీత్యా కుటుంబ సభ్యునికి వైద్యం కోసం తోటి ఉద్యోగులందరం కలిసి రూ.60వేలు సేకరించి అందించామన్నారు. తదుపరి సందర్భంలో ఆ సొమ్మును తిరిగి ఇవ్వడంలో అతడు పడిన మనోవేదన తనను కలచి వేసిందని అన్నారు. ఆరోజు జరిగిన సంఘటన తన మనసులో నాటుకుపోయిందని ఆరోగ్యశ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టడం అదృష్టంగా భావించి మరో ఉన్నతాధికారి అగర్వాల్‌తో కలిసి పకడ్బందీ కార్యాచరణ రూపొందించామన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండుసార్లు ఈ విషయమై పిలుపు అందుకున్నానని, ప్రతి ఒక్కరూ సర్వత్రా హర్షం ప్రకటించడం జరిగిందన్నారు.
ఎన్‌జివో నాయకుడు ఎ.విద్యాసాగరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 7 లక్షల మంది ఉద్యోగులు హెల్త్‌కార్డు కలిగి వున్నారని, కృష్ణాజిల్లాలో 70వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి ఉద్యోగి రూ.90 నుండి రూ.120కు ప్రతి నెలా చందా చెల్లిస్తున్నారని వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి 270 నుంచి 300 రూపాయల వరకు చందాను పెంచడం జరుగుతుందన్నారు. ఉద్యోగులు చందా కట్టడానికి సిద్ధంగా వున్నామని అదే సందర్భంలో హెల్త్‌కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఆసుపత్రులు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు.

సాధారణ ఉద్యోగిగా 104కు కలెక్టర్ ఫోన్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 5: ఆరోగ్యశ్రీ కార్డులు కలిగిన వ్యక్తులు వైద్య సేవల కోసం ఫోన్ చేసే వ్యక్తిలాగా 104 కాల్‌సెంటర్‌కు కలెక్టర్ బాబు.ఎ ఫోన్ చేశారు. చాతిలో నొప్పిగా వుందని, లెనిన్ సెంటర్ దగ్గర విజయవాడలో వున్నానని పంచాయతీ రాజ్ ఉద్యోగినని ఆసుపత్రికి వెళ్లాలి అని అడిగారు. దీనిపై సరైన స్పందన రాకపోవడంతో కృష్ణా కలెక్టర్ బాబును మాట్లాడుతున్నాను నేను మాట్లాడిన రికార్డును మీ సిఇవో ముందుకు రేపు వినిపించండి. నేను వారితో మాట్లాడి సమస్యకు పరిష్కారం తెలుపుతానన్నారు. ఆరోగ్య మిత్రాలను తొలగించడంలో ప్రభుత్వం నూతనంగా తీసుకునే వ్యక్తులు మరింత ఉన్నతంగా మెరుగైన సేవలను ప్రజలకు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిఎంహెచ్‌ఓ ఎం.నాగమల్లేశ్వరి, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ సూర్యకుమారి, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ జీవన్‌కుమార్, ఎన్‌జివో నాయకులు బి.సత్యనారాయణరెడ్డి, కె.రవి, యు.కృష్ణ, శ్రీనివాస్, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

కౌన్సిల్ తీర్మానాలపై చర్యలేవీ?
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 5: విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు చేసిన ప్రతిపాదిత తీర్మానాలు, కోరిన ఆఫీస్ రిమార్కులపై ఏయే చర్యలు తీసుకొన్నారంటూ నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ ఇంజనీరింగ్ అధికారులు నిలదీశారు. శుక్రవారం తన ఛాంబర్‌లో నిర్వహించిన ఇంజనీరింగ్ సమీక్షలో ఆయన మాట్లాడుతూ 2014లో ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్, నెలల్లో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు కోరిన సమాచారంతోపాటు చేసిన తీర్మానాల అనంతరం తీసుకొన్న తదుపరి చర్యలపై అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేకపోవడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గౌరవ సభ్యులు చేసిన ప్రతిపాదనలను తక్షణమే అమలులోకి తీసుకురావాల్సి ఉండగా ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, ఒకవేళ తీసుకొంటే ఆయా చర్యల వివరాలపై కనీసం సమాచారాన్నైనా అందుబాటులో లేకపోవడం ఇంజనీరింగ్ అధికారుల బాధ్యతారాహిత్యమేనని ఎద్దేవా చేశారు. సభ్యులు చేసిన తీర్మానాలను కార్యరూపంలోకి తీసుకురాలేకపోతే ఇక కౌన్సిల్‌కు, కౌన్సిల్ సమావేశాలకు ఇచ్చే గౌరవం ఏమిటని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ఒక సమావేశంలో చేసిన తీర్మాన అంశాన్ని తదుపరి సమావేశం కల్లా పూర్తి సమాచారాన్ని అందించాల్సి ఉందన్న విషయాన్ని అధికారులు మరుగున పెట్టడం హేయమన్నారు. గత సంవత్సరంలో చేసిన తీర్మానాలకు చెందిన చర్యల వివరాలన్నీ రాబోయే 7 రోజుల్లో పూర్తి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో విఎంసి ఇన్‌చార్జ్ సిఇ ఎంఎ షుకూర్, ఇఇలు నగేష్, పివికె భాస్కర్, సిహెచ్ ధనుంజయ తోపాటు కో అప్షన్ సభ్యుడు సిద్దెం నాగేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎపిఎస్‌పిడిసిఎల్ మొబైల్ యాప్ ద్వారా
బిల్లుల చెల్లింపు సరళతరం
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 5: ఎపిఎస్‌పిడిసిఎల్ రూపొందించిన మొబైల్ యాప్ విద్యుత్ వినియోగదారులకు అత్యంత సౌకర్యవంతంగా ఉందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించబడిన ఈ మొబైల్ యాప్‌కు వినియోగదారుల నుంచి అత్యంత ఆదరణ లభిస్తోందని తెలియజేశారు. వినియోగదారులు ఎపిఎస్‌పిడిసిఎల్ లేదా సదరన్ పవర్ మొబైల్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. యాప్ ఇన్‌స్టాలేషన్ అనంతరం వినియోగదారులు ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వినియోగదారుల సర్వీసు నంబరును రిజిస్ట్రేషన్ చేసుకుని, యాప్‌లోని అన్ని సదుపాయాలను ఉపయోగించుకోవచ్చని వివరించారు. ఈ ప్రక్రియ పూరైన తర్వాత వినియోగదారులు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్యాష్ కార్డు, వాలెట్ దేని నుంచైనా బిల్లులను చెల్లించవచ్చని వివరించారు. ఈ యాప్ ద్వారా త్వరితగతిన విద్యుత్ బిల్లును చెల్లించడంతో పాటు చివరి 12 చెల్లింపు వివరాలను తెలుసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ యాప్‌లోని రిమైండర్ అలర్ట్ విద్యుత్ బిల్లును చెల్లించాల్సిన తేదీలను కూడా తెలియజేస్తుందని, తద్వారా వినియోగదారులు సకాలంలో బిల్లులను చెల్లించవచ్చన్నారు. అదే విధంగా గత 12 నెలలకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారుడు తమ విద్యుత్ సమస్యలపై ఫిర్యాదులను నమోదు చేయడంతోపాటు ఫిర్యాదుల స్థితిని కూడా పరిశీలించవచ్చని తెలిపారు. ఇక వినియోగదారులు కొత్త సర్వీసును పొందేందుకు అవసరమైన వివరాలను తెలుసుకోవడంతోపాటు సర్వీసు కనెక్షన్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చున్నారు. వినియోగదారులు తమ విద్యుత్ సర్వీసుకు సంబంధించిన ఫీడరు, సబ్‌స్టేషన్, సెక్షన్ ఆఫీస్, అధికారుల మొబైల్ నంబర్లు, వినియోగదారుల సేవా కేంద్రం నంబరును కూడా తెలుసుకోవచ్చన్నారు. ఈ యాప్‌ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

రేపు మెగా సైక్లోథాన్
లబ్బీపేట, ఫిబ్రవరి 5: సైకిల్ వినియోగం వల్ల ప్రజలకు ప్రయోజనాలను తెలియజేస్తూ, ఆరోగ్యం మీద అవగాహన కల్పిస్తూ, 7న నగరంలో 1000 మందికి పైగా సైక్లిస్టులతో మెగా సైక్లోథాన్ నిర్వహిస్తున్నామని ఆంధ్రా బైస్లింగ్ క్లబ్ అధ్యక్షుడు, ఆంధ్రా హాస్పటల్ మేనేజింగ్ డైరక్టర్ పివి రమణామూర్తి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సైక్లింగ్‌లో పాల్గొనే వారు స్టేడియంకు చేరాలని, సాధ్యనమైనంత వరకు సొంత సైకిల్స్ తీసుకురావాలని, సొంత సైకిల్ లేని వారు ఆధార్ వంటి గుర్తింపు కార్డు ఒరిజనల్ వెంట తెచ్చుకోవాలని తెలిపారు. బందరురోడ్డులోని మురళీ ఫార్చ్యూన్ హోటల్‌లో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో మెగా సైక్లోథాన్ టీ షర్టును క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పివి రమణామూర్తి, డాక్టర్ రమేష్, ఆంధ్రా చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ ముత్తవరపు మురళీకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పివి రమణామూర్తి మాట్లాడుతూ ఈ ర్యాలీ ఆంధ్రా బైస్‌క్లింగ్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ రమేష్ మాట్లాడుతూ ఈ ర్యాలీ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర ప్రారంభమై తిరిగి అక్కడే ముగుస్తుందని తెలిపారు. బెంజిసర్కిల్, రామవరప్పాడు రింగు, గుణదల, పాత బస్టాండు మీదుగా తిరిగి స్టేడియంకు చేరుతుందని వివరించారు. ముత్తవరపు మురళీకృష్ణ మాట్లాడుతూ నగరం మొత్తం పొల్యూషన్ అయిపోతోందని, వారంలో ప్రతి ఒక్కరూ సైక్లింగ్ వాడటం చాలా మంచిదన్నారు. ఫౌండర్ తుమ్మల పద్మ మాట్లాడుతూ సైక్లింగ్ జరిగే మార్గంలో కొన్ని చోట్ల మంచి నీటి సరఫరా ఏర్పాటు చేయటం జరిగిందని, అలాగే అంబులైన్స్, వైద్య బృందం కూడా అందుబాటులో ఉంటుందని, పోలిస్ శాఖ కూడా పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. నగరంలో ప్రతినెల మొదటివారం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ విలేఖరుల సమావేశంలో వి సత్యనారాయణ, వి కృష్ణ ప్రసన్న పాల్గొన్నారు.

పెనుగంచిప్రోలు అభివృద్ధికి సత్వర చర్యలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 5: పెనుగంచిప్రోలు గ్రామం అభివృద్ధికి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను సత్వరం అమల్లోకి తీసుకురానున్నామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. పంటకుంట కార్యక్రమం ద్వారా పంట సంజీవని కార్యక్రమాన్ని పెనుగంచిప్రోలులో నిర్దేశించుకున్న లక్ష్యాల ప్రకారం పూర్తిచేయాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పెనుగంచిప్రోలులో జన్మభూమి గ్రామసభలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పంటకుంట లక్ష్యాలను నెరవేర్చితేనే బోరు బావిల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించడం జరుగుతుందని పేర్కొన్నారు. మండలస్థాయి, గ్రామస్థాయి, ప్రత్యేక అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పరిపూర్ణం చెయ్యడంలో నిబద్ధతతో కూడి పనిచెయ్యాలని స్పష్టం చేశారు. కలెక్టర్ బాబు.ఎ వివరాలు తెలుపుతూ కల్యాణ మండపంకు సంబంధించి దేవాదాయశాఖ, ఇండోర్ స్టేడియం కొరకు క్రీడా ప్రాధికారిత సంస్థ కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు, ప్రభుత్వానికి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. జిల్లా పరిషత్ పెనుగంచిప్రోలు 10 కిలోమీటర్ల సమాంతరరోడ్డు, కల్యాణ మండపం, జడ్‌పి హైస్కూల్, మునే్నరు చెరువు కరకట్ట నిర్మాణం, పంట సంజీవని ద్వారా 1400 పంటకుంటలు, డ్రైనేజి కాలువతో కూడి సిమెంట్ రోడ్లు నిర్మాణం, బైపాస్ రోడ్లు వంటి అంశాలపై ఆయా శాఖల అధికారులు పూర్తిస్థాయి నివేదిక అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పనుల నిర్వహణకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలను అందించాలని ఆయన కోరారు. వీటి కోసం ప్రాథమికంగా రూ. 5.22 కోట్లతో అంచనాలు రూపొందించామని రూ. 3 కోట్లు పెనుగంచిప్రోలు దేవస్థానం నుంచి మిగిలిన రూ.2.22 కోట్లు ప్రభుత్వం విడుదల చెయ్యడం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు, సబ్ కలెక్టర్ జి.సృజన, జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో తహశీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులు, గ్రామ సర్పంచ్, జిల్లాస్థాయిలోని పంచాయతీ రాజ్, రోడ్లు, భవనాలు, డ్యామ్, పంచాయతీ, ఎండోమెంట్, జిల్లా పరిషత్, అధికారులు పాల్గొన్నారు.

ముద్రగడ అవగాహన రాహిత్యం
లబ్బీపేట, ఫిబ్రవరి 5: కాపునాయకుడు ముద్రగడ పద్మనాభం అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నాడని బిసి హక్కుల సాధన సమితి జిల్లా ఉపాధ్యక్షుడు దార్న చంద్రశేఖర్ విమర్శించారు. శుక్రవారం తన కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులను బిసిలో చేర్చటానికి వారేమైనా కుండలు చేశారా, బట్టలు నేశారా, పాలు పితికారా, కల్లు తీశారా, బట్టలు ఉతికారా, చాపలు పట్టారా, గడ్టాలు గీశారా, కాపులను బిసిలో చేరిస్తే బిసిలకు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో పూర్తిగా అన్యాయమే జరుగుతుందని, కావున కాపులను బిసిలో చేరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సాధ్యం కానీ హామీలను అమలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పటం తప్పని, సాధ్యం కాదని తెలిసి ఆ బిసి నిధి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి కాపు, ఒంటరి, తెలగ, బలిజలను అపహస్యం చేయవద్దని కోరారు. 5శాతం ఉన్న కాపులు ఓటు వేస్తే టిడిపి గెలిచిందని అనుకుంటే పొరపాటేనని, 55శాతం ఉన్న బిసిలు టిడిపికి ఓటు వేయలేదా అని ప్రశ్నించారు. అంతేకాని బిసి రిజర్వేషన్ నిధి కోసం వారు ఆరాటపడితే ప్రత్యక్ష పోరాటానికి వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు.

రేషన్ పంపిణీలో
నూతన ఒరవడికే ‘ఈపోస్’
* సబ్ కలెక్టర్ సృజన వెల్లడి
మైలవరం, ఫిబ్రవరి 5: రేషన్ పంపిణీలో అవకతవకలను అరికట్టి అర్హత కలిగిన లబ్ధిదారులకు సక్రమంగా సరుకులను పంపిణీ చేయటానికే ఈఫోస్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు విజయవాడ సబ్ కలెక్టర్ సృజన వెల్లడించారు. శుక్రవారం ఆమె స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ పింఛనుదారులకు ప్రతినెలా 3వ తేదీకల్లా పింఛన్ల పంపిణీని నూరు శాతం పూర్తి చేస్తున్న మాదిరిగానే రేషన్ సరుకులను కూడా ప్రతినెలా మొదటి పది రోజుల్లో పూర్తి చేయటానికి ఉదయం ఏడు గంటలకే రేషన్ దుకాణాలు తెరవాలని ఆదేశించినట్లు తెలిపారు. అంతేగాక సమయానికి రేషన్ దుకాణాలు తెరవని షాపుల యజమానులకు మొదటి తప్పును మన్నిస్తామని, ఐనప్పటికీ మారకపోతే జరిమానాలు విధిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ జిల్లాలో 180 షాపులకు జరిమానా విధించినట్లు తెలిపారు. ఈవిధానం వల్ల ఇప్పటికే జిల్లాలో 56శాతం రేషన్ పంపిణీ పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే కృష్ణాజిల్లా పంపిణీలో అగ్రస్థానంలో ఉందన్నారు. రెండవ స్థానం 45శాతంతో అనంతపురం ఉందని చిట్టచివర కేవలం 18శాతంతో చిత్తూరు జిల్లా ఉందని పేర్కొన్నారు. ఈవిధానం వల్ల ఈనెల 3న ఒకే రోజు రెండు లక్షల రేషన్ కార్డులకు రేషన్ సరుకులు అందించినట్లు వివరించారు. జిల్లాలో బంటుమిల్లి మండలం 84శాతం రేషన్ పంపిణీ చేసి అగ్రస్థానంలో ఉందన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించి టైటిల్ డీడ్ జారీ చేయటంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని విలేఖర్లు ఆమె దృష్టికి తీసుకురాగా దీనిపై ప్రభుత్వంలో కొన్ని మార్పులు జరగనున్నాయని అందుకే ఆలస్యం జరుగుతుందన్నారు. బలహీన వర్గాలకు ఇళ్ళ స్థలాల మంజూరుపై ఆమె స్పందిస్తూ ఇళ్ళ స్థలాల కన్నా ఇళ్ళను నిర్మించి ఇవ్వటానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోందని అర్హత కలిగిన అందరికీ ఇవ్వటం జరుగుతుందన్నారు. అదేవిధంగా జాతీయ రహదారి విస్తరణలో ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు కోల్పోయిన వారికి త్వరలోనే న్యాయం చేస్తామన్నారు. ఈసమావేశంలో తహశీల్దార్ కెవి శివయ్య కూడా పాల్గొన్నారు.

గ్రీన్‌జోన్లతో రైతులకు తీవ్రనష్టం
కూచిపూడి, ఫిబ్రవరి 5: రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న వ్యవసాయ గ్రీన్‌జోన్ కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని దాదాపు 56 మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతారని మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు కెపి సారథి పేర్కొన్నారు. గ్రీన్‌జోన్‌పై వైకాపా చేపట్టిన రైతుల అవగాహనా సదస్సులలో భాగంగా శుక్రవారం రాత్రి కోసూరు గ్రామంలో వైకాపా మండల అధ్యక్షులు రాజులపాటి రాఘవరావు అధ్యక్షతన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన సారథి మాట్లాడుతూ కృష్ణాజిల్లాలో 30 మండలాలు, గుంటూరు జిల్లాలో 26 మండలాలు గ్రీన్‌జోన్ పరిధిలోకి రావటంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు కేవలం వ్యవసాయానికే పరిమితమవుతాయని, రియల్ ఎస్టేట్‌కు, వాణిజ్య అవసరాలకు మార్చుకునే అవకాశం లేదన్నారు. రాజధాని ప్రాంతంలోని భూముల ధరలకు రెక్కలొస్తుండగా ఈ ప్రాంతంలోని భూముల ధరలు తగ్గుముఖం పట్టే ప్రమాదం ఉందన్నారు. గ్రీన్‌జోన్‌పై రైతులు అవగాహన కలిగి వైకాపా చేపట్టిన ఉద్యమానికి బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, జడ్‌పిటిసి చిమటా విజయ శాంతి, సర్పంచ్ చిందా వీర వెంకట నాగేశ్వరరాజు, మాజీ సర్పంచ్ దగాని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై సంఘటితం కావాలి
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 5: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎదుర్కొనేందుకు అన్ని కార్మిక సంఘాలు సంఘటితం కావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డివి కృష్ణ పిలుపునిచ్చారు. ఈ నెల 10న దేశ వ్యాప్తంగా 11 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మిక హక్కులను ధారాదత్తం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే కార్మిక చట్టాలను మార్చేశాయన్నారు. ఏళ్ళ తరబడి పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను హరింప చేస్తున్నారని మండిపడ్డారు. కార్మిక వర్గంపై దాడి చేస్తూ కార్పొరేట్ కంపెనీలకు కార్మిక హక్కులను దారాదత్తం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. బాబు వస్తే జాబు వస్తుందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారన్నారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర, ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 10న నిర్వహించే నిరసన ప్రదర్శనను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో సిఐయు నాయకులు వివి రమణారావు, బూర సుబ్రహ్మణ్యం, టి చంద్రపాల్, సిహెచ్ జయరావు తదితరులు పాల్గొన్నారు.
అగ్ని ప్రమాదంలో కోళ్ల ఫారమ్ దగ్ధం
రూ. 6లక్షల ఆస్తినష్టం
నందిగామ, ఫిబ్రవరి 5: ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని కోళ్ల ఫారం ధగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని కమ్మవారిపాలెం గ్రామ శివారులో శుక్రవారం జరిగింది. సేకరించిన సమాచారం ప్రకారం నందిగామ శివారు అనాసాగరానికి చెందిన దామాల రవికి కమ్మవారిపాలెం గ్రామ శివారులో కోళ్లఫారం ఉంది. శుక్రవారం కోళ్ల ఫారంనకు నిప్పు అంటుకుని దగ్ధం కాగా 2 వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి. 2 టన్నుల దాణా, షెడ్డు పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ట్రాన్స్‌కో ఆధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం కాదని వారు నిర్ధారించారు. సుమారు 6 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు బాధితుడు రవి తెలిపారు.
ముద్రగడ్డ ఆమరణ దీక్షకు మద్దతు
కృత్తివెన్ను, ఫిబ్రవరి 5: కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు మద్దతుగా స్థానిక గాంధీనగర్‌లో కాపు సామాజిక వర్గానికి చెందిన యువకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఖాళీ పల్లాలు, గెరటలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వమే కాపులు బిసిల్లో ఉన్నారని, కొంత మంది తమ స్వార్ధ ప్రయోజనాల కోసం బిసి జాబితా నుండి తొలగించారని ఆరోపించారు. సిఎం చంద్రబాబు తక్షణం కాపులను బిసిల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యండపల్లి సర్పంచ్ నరసింహరావు, దాసరి వెంకట శ్రీనివాస్, కన్నా శ్రీనివాసరావు, కూనసాని రవి తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల అదుపులో మండల కాంగ్రెస్ నేత పసుపులేటి
నందిగామ, ఫిబ్రవరి 5: కాపులను బిసిల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా నందిగామలో ఆమరణ దీక్షకు పూనుకున్న మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసరావును శుక్రవారం ఉదయం ఆయన గృహంలో పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పసుపులేటిని పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలియడంతో పలు గ్రామాల నుండి కాపుసంఘం నాయకులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులు పసుపులేటిని దీక్ష విరమించుకోవాలని సూచించి మధ్యాహ్నం పంపించారు.
కలెక్టరేట్ ఎదుట హమాలీల ధర్నా
మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 5: హమాలీ కార్మికులకు పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఎఐటియుసి ఆధ్వర్యంలో కలెక్టరేట ఎదుట ధర్నా నిర్వహించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయడం వల్ల హమాలీలపై పడరాని పని భారం పడిందని, దీని వల్ల హమాలీలు శారీరకంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని సిపిఐ నాయకుడు మోదుమూడి రామారావు వాపోయారు. ప్రతి నెల 21 నుండి 31వతేదీ లోపు లోడింగ్, అన్‌లోడింగ్‌కు గడువు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీ కూలీ రేట్లు క్వింటాకు రూ.24లు ఇవ్వాలని, ప్రతి ఎంఎల్‌ఎస్ పాయింట్ వద్ద వేబ్రిడ్జి కాటాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు చలసాని వెంకట రామారావు, సివిల్ సప్లయిస్ హమాలీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కోఠారి రమణ, జిల్లా కార్యదర్శి ఆర్ నూకరాజు, జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎల్ ఫిలిప్స్ తదితరులు పాల్గొన్నారు.