ఆంధ్రప్రదేశ్‌

అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనానికి సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, ఫిబ్రవరి 5: నవ్యాంధ్ర రాజధాని పరిధిలోని విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ ఒడిలో ఐదవ అంతర్జాతీయ కూచిపూడి నాట్య మహా సమ్మేళనం నిర్వహించేందుకు సన్నాహాలు చేపట్టనున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్ కూచిభొట్ల ఆనంద్ శుక్రవారం ఈ విలేఖరికి తెలిపారు. కూచిపూడి నాట్యానికి విశ్వ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలన్న ఆశయంతో సిలికానాంధ్ర అమెరికాలోని సిలికాన్ వ్యాలిలో 2008వ సంవత్సరంలో పద్మభూషణ్ డా. వెంపటి చినసత్యం రూపొందించిన అఠాణా రాగంలో వందలాది మంది కళాకారులతో ప్రారంభించిన అంతర్జాతీయ కూచిపూడి నాట్య మహాసమ్మేళనాలు అప్రతిహతంగా 2014 వరకు నిర్వహించింది. ఈ నాట్యోత్సవాలు వరుసగా గిన్సీస్‌బుక్ ఆఫ్ వరల్డు రికార్డు సాధించి కళాకారుల ప్రోత్సాహానికి నాంది పలికిందన్నారు. అమెరికా నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో 2010-12, 14 సంవత్సరంలో నాట్యోత్సవాలు వైభవంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు 23, 24, 25 తేదీలలో విజయవాడలో అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళన నాట్యోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 10వేల మంది కళాకారులు ఒకే వేదికపై ఒకే రీతిలో కూచిపూడి శాస్త్ర సాంప్రదాయ నాట్యాన్ని ప్రదర్శింప చేసి ఐదవ విడత గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించేందుకు సిలికానాంధ్ర వసుదైక కుటుంబం కృషి చేస్తుందని ఛైర్మన్ ఆనంద్ తెలిపారు.