ఆంధ్రప్రదేశ్‌

అనంతలో వజ్రాల కోసం అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రకరూరు, ఫిబ్రవరి 5: సుధీర్ఘకాలం పాటు శిక్షణకే పరిమితమైన అనంతపురం జిల్లా వజ్రకరూరులోని వజ్రముల ప్రక్రమణ కర్మాగారం (డైమండ్ ప్రాసెసింగ్ ప్లాంట్)లో శుక్రవారం నుంచి పరిశోధనలు ప్రారంభమయ్యాయి. 300 టన్నుల ముడిసరుకుతో పరిశోధనలు ప్రారంభించారు. దేశంలోని ఏకైక వజ్రముల ప్రక్రమణ కేంద్రం అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఉంది. సరైన ముడిసరుకు లభించని కారణంగా భారతీయ భూవైజ్ఞానిక సర్వేక్షణ(సర్వే ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలోని పదేళ్లుగా యంత్రాలు మూలనబడ్డాయి. ఇటీవల కడప జిల్లాలో కింబర్‌లైట్లు లభించి ఆశించిన ఫలితం రావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. దీంతో ఏకంగా 300 టన్నుల ముడి సరుకు సేకరించి పరిశోధనలు ప్రారంభించారు. ఈ ముడిసరుకులో కింబర్‌లైట్ శాతం బయటపడితే దేశంలో వజ్రానే్వషణ జరిపిన కేంద్రంగా ఈ కర్మాగారం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇదే జరిగితే వజ్రకరూరులోని వజ్రానే్వషణ కేంద్రం ఇటు పరిశోధనలు, అటు శిక్షకులతో కళకళలాడుతుందని సీనియర్ జియాలజిస్టు భాస్కరరావు తెలిపారు. ఇప్పటివరకు యంత్రాలకు పనిలేకపోవడంతో కొన్ని భాగాలు మొరాయించాయన్నాయి. వీటికి మరమ్మతులు చేయించి పని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. పెద్దగా ఉన్న కింబర్‌లైట్స్ ముడి సరుకును మిల్లర్‌లో వేసి పొడిపొడిగా చేసి వజ్రం శాతం గురించి పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కడప జిల్లా తుమ్మటపల్లి పరిసర ప్రాంతాల్లో మట్టి సేకరించి పరిశోధనలు నిర్వహిస్తామన్నారు. వజ్రకరూరు కేంద్రం భారత్‌లోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లో దొరికిన ముడి సరుకులు గతంలో ఇక్కడే పరిశోధించామన్నారు.