ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 5: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 1000 పడకల సామర్థ్యం కలిగిన అధునాతన ఆసుపత్రితో పాటు వైద్య, నర్శింగ్ కళాశాలల నిర్మాణానికి భారత్ - యుకె (యునైటెడ్ కింగ్‌డమ్) సంస్థ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇండో, యుకె ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఎండి అజయ్ రంజన్ గుప్త, ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు(ఇడిబి) సిఇఓ కృష్ణకిషోర్‌లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో విశాఖలో శుక్రవారం ఎంఒయు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇండో, యుకె ఇనిస్టిట్యూట్ ఎండి అజయ్ రంజన్ గుప్త మాట్లాడుతూ గతంలో బ్రిటన్ (యుకె)లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా పలు అంశాల్లో రెండు దేశాల మధ్య అవగాహన కుదిరిందన్నారు. దీనిలో భాగంగా భారత్‌లో వైద్య రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ముందుకు వచ్చినట్టు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన కింగ్స్ మెడికల్ కళాశాలతో కలిసి తమ సంస్థ భారత్‌లో 11 అధునాతన ఆసుపత్రుల నిర్మాణానికి సిద్ధంగా ఉందన్నారు. మొదటి ఆసుపత్రి, వైద్య కళాశాలను అమరావతి కేంద్రంగా నిర్మించనున్నట్టు వెల్లడించారు. రూ.1000 కోట్లతో 1000 పడకల ఆసుపత్రిని, వైద్య, నర్శింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూన్‌లో ఈ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించనున్నట్టు వెల్లడించారు. అలాగే ఇండో-యుకె ఆసుపత్రుల ప్రధాన కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాలను కేటాయించేందుకు హామీ ఇచ్చిందన్నారు. మిగిలిన 10 ఆసుపత్రులను దేశంలోని ప్రధాన కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ కళాశాల సౌజన్యంతో వీటి నిర్వహణ చేపట్టనున్నట్టు తెలిపారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఆసుపత్రి తొలిదశలో 250 పడకలతో ఆరు నెలల్లో అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. ఇడిబి సిఇఓ కృష్ణకిషోర్ మాట్లాడుతూ దేశంలో వైద్య పర్యాటకాన్ని ఆకర్షించే విధంగా ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఆసుపత్రులు, వైద్య, నర్శింగ్ కళాశాలల ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 3000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. కార్యక్రమంలో సిఎంతో పాటు మంత్రులు గంటా శ్రీనివాసరావు, నిమ్మకాయల చినరాజప్ప, ఇండో-యుకె ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ చైర్మన్ పార్కర్, బ్రిటన్ హెడ్ ఆఫ్ మిషన్ అభిలాష్, విశాఖ కలెక్టర్ ఎన్ యువరాజ్ పాల్గొన్నారు.