బిజినెస్

అమీర్‌ఖాన్ చేజారిన స్నాప్‌డీల్ కాంట్రాక్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశీయ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ స్నాప్‌డీల్ కాంట్రాక్టును ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కోల్పోయారు. దేశంలో అసహనంపై ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆయన్ను కొనసాగించేందుకు స్నాప్‌డీల్ విముఖత చూపింది. ఖాన్ చేసిన వ్యాఖ్యలతో స్నాప్‌డీల్ కూడా చిక్కుల్లో పడినది తెలిసిందే. దీంతో అమీర్‌ఖాన్‌తో ఒప్పందాన్ని పునరుద్ధరించకూడదని స్నాప్‌డీల్ నిర్ణయించుకుంది. అయితే దీనిపై స్పందించేందుకు ఆ సంస్థ అధికార ప్రతినిధి నిరాకరించారు. అమీర్‌ఖాన్ కూడా అందుబాటులోకి రాలేదు. కాగా, ఖాన్ స్థానంలో మరొక సెలబ్రిటీని నియమించుకునే పనిలో స్నాప్‌డీల్ నిమగ్నమైనట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే ‘ఇంక్రెడిబుల్ ఇండియా’ టూరిజం క్యాంపెయిన్ బ్రాండ్ అంబాసిడర్ హోదాను అమీర్‌ఖాన్ చేజార్చుకోగా, ఆయన స్థానంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్‌తోపాటు ప్రియాంక చోప్రా నియమితులయ్యారు.