జాతీయ వార్తలు

అమరావతి, వరంగల్‌కు 12కోట్లు కేటాయింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి, తెలంగాణలోని వరంగల్ వారసత్వ పట్టణాలలో పర్యాటక వౌలిక సదుపాయాలను పెంచేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూ. 12 కోట్లు కేటాయించింది.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన హృదయ్ సాధికారిక కమిటీ ఈ కేటాయింపులు చేసినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతిలో 7.36 కోట్ల ఖర్చుతో వివిధ కార్యక్రమాలు చేపడతారు. ధ్యాన బుద్ధ విగ్రహం ముందున్న మూడున్నర ఎకరాల్లో వారసత్వ ఉద్యానవనాన్ని నిర్మిస్తారు.
నాలుగు ప్రదర్శన శాలలు ఏర్పాటు చేస్తారు. 22 విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. 20 దుకాణాలు, ఫుడ్ కోర్టులు, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తారని వెంకయ్య నాయుడు తెలిపారు.
వరంగల్‌లో వారసత్వ కట్టడాల అభివృద్ధికి రూ. 4.85 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో వెయ్యి స్తంభాల గుడికి మరమ్మతులు చేసి లైట్లు ఏర్పాటు చేస్తారు. కాజీపేట దర్గను అభివృద్ధి చేస్తారు. పద్మాక్షి దేవాలయం చెరువును పునరుద్ధరిస్తారు.
గిరిజన పాఠశాలలకు
600 పోస్టులు మంజూరు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 5: ఆంధ్రప్రదేశ్ ఎస్‌సి ఉప ప్రణాళిక, ఎస్‌టి ఉప ప్రణాళిక కింద 600 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 450 టీచింగ్ పోస్టులు, 150 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పి వి రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని ఇటీవల రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చిన హాస్టళ్లలో నియమిస్తారు.