రాష్ట్రీయం

ఆర్డినెన్స్ వృథా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 5:రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి గెలిచిన ఎమ్మెల్సీలను గ్రేటర్ హైదరాబాద్ ఎక్స్‌అఫిషియో సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం గురువారం హడావుడిగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ అవసరం లేకుండాపోయింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 99 డివిజన్లలో విజయం సాధించింది. స్పష్టమైన మెజారిటీ లభించకపోతే ఎక్స్ అఫిషియో సభ్యుల ఓట్లతో మేయర్ స్థానం కైవసం చేసుకునేందుకు టిఆర్‌ఎస్ అవసరమైన ఏర్పాట్లు చేసుకుంది. నీలం సంజీవరెడ్డి కాలంలో, కిరణ్‌కుమార్‌రెడ్డి కాలంలో సైతం హైదరాబాద్ ఎన్నికల్లో ఎక్స్ అఫిషియే సభ్యుల ఓటును ఉపయోగించుకున్నారు. ఇప్పుడు మేయర్ ఎన్నికల్లో సైతం ఎక్స్‌అఫిషియో సభ్యుల ఓటు ఉపయోగించుకోవలసి వస్తుందని అనుకున్నారు. వంద డివిజన్లలో గెలుస్తాం అని టిఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో చెబుతూ వచ్చినా ముందు జాగ్రత్తగా ఇతర ఏర్పాట్లు సైతం చేసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మేయర్ స్థానం కైవసం చేసుకోవడానికి తమకు మూడు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మెజారిటీ స్థానాల్లో విజయం సాధించి మేయర్ పదవి చేపడతాం, అది కాకపోతే ఎక్స్ అఫిషియో సభ్యులతో మేయర్ స్థానం సాధిస్తాం, అదీ కాకుంటే మా మిత్రపక్షం ఎంఐఎం ఎలాగూ ఉందని చెప్పారు. సింగిల్ లార్జెస్ట్ అని కెసిఆర్ చెప్పగానే టిడిపితోపాటు ఇతర పక్షాలు విమర్శల దాడి పెంచారు. అయితే అధికార పక్షం మాత్రం మొదటి నుంచి గ్రేటర్ ఎన్నికల్లో ఆచి తూచి వ్యవహరించింది. విజయంపై అతివిశ్వాసానికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా ప్రచారం సాగించింది. చివరకు 99 స్థానాల్లో విజయం సాధించి ఎవరి మద్దతు అవసరం లేకుండా, ఎక్స్ అఫిషియే సభ్యుల ఓట్లతో అవసరం లేకుండా గ్రేటర్ పీఠాన్ని కైవసం చేసుకుంది.