నిజామాబాద్

ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించిన ఇన్‌చార్జి కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంఠేశ్వర్, ఫిబ్రవరి 12: జిల్లా కేంద్రంలోని ఆయా ప్రభుత్వ శాఖల కార్యాలయాలను శుక్రవారం ఇంచార్జ్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ అధికారులను హడలెత్తించారు. ఉద్యోగుల అటెండెన్స్ రిజిస్టర్‌తో పాటు ఇతర దస్త్రాలను పరిశీలిస్తూ, అధికారులు, సిబ్బందిని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ కార్యాలయం, పౌర సరఫరాల శాఖ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా భూమి కొలతల సహాయ సంచాలకుల కార్యాలయానికి వెళ్లి బయోమెట్రిక్ విధానం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అయితే కార్యాలయ సూపరింటెండెంట్ సరైన సమాధానం ఇవ్వకుండా ఇంచార్జ్ కలెక్టర్‌కు సూటిగా బదులు ఇవ్వలేకపోయారు. ఆయా కేడర్‌లలో పని చేస్తున్న వారందరి వివరాలను ఇంకనూ బయోమెట్రిక్‌కు అనుసంధానం చేయనందున ఈ విధానం ఇంకా ప్రారంభం కాలేదని ఇంచార్జ్ కలెక్టర్ దృష్టికి తేగా, ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయానికి సకాలంలో చేరుకోని ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకుని హాజరు పట్టికను స్వయంగా పరిశీలించారు. అనంతరం రికార్డ్ రూమ్‌ను తనిఖీ చేశారు. ఫైళ్లను క్రమ పద్ధతిలో ఉంచకపోవడాన్ని గమనించి మందలించారు. రికార్డులు సరైన పద్ధతిలో ఉంచుకోవాలని, చెదలు, పురుగులు పట్టకుండా అవసరమైన మందులు స్ప్రే చేయాలని, తద్వారా రికార్డులు భద్రంగా ఉంటాయని సూచించారు. 327సర్వే పనులు చాలాకాలం నుండి పెండింగ్‌లోనే ఉంచడం పట్ల సంబంధిత శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖలో 63మంది సిబ్బంది పని చేస్తున్నారని, అయినా కూడా సర్వే పనులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడం ఏమిటని నిలదీశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కంటే స్థానికంగానే సర్వే పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ మందలించారు. ఒకవేళ సిబ్బంది కొరత ఏర్పడితే భూభారతి సిబ్బందిని సర్వే పనులకు వినియోగించుకోవాలని ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా సర్వే పనులను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సర్వే పనుల కోసం రైతులు ఎంతో దూరం నుండి అనేక వ్యయ,ప్రయాసాలకు ఓర్చుకుని వస్తారని, సకాలంలో వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత తమదేనని అధికారులు గుర్తెరగాలని హితవు పలికారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ కార్యాలయం పనితీరుపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, ఇకపై ఫిర్యాదులు వస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రాధాన్యత క్రమంలో డిమార్కేషన్ పనులను వెంటనే పూర్తి చేయాలని, మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న పనుల జాబితాను సేకరించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం పౌర సరఫరాల కార్పొరేషన్‌లో బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించారు. ఏ అధికారి ఏయే విధులు నిర్వర్తిస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. పని ఎక్కువగా లేని సిబ్బందిని ఇతర విభాగాలకు పంపించాలని అధికారులను ఆదేశించారు. అక్కడి నుండి పౌర సరఫరాల శాఖ కార్యాలయానికి చేరుకుని బయోమెట్రిక్ విధానాన్ని పరిశీలించారు.

విద్యాశాఖలో సంస్కరణలకు శ్రీకారం..!
కంఠేశ్వర్, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలోని విద్యా శాఖలో సంస్కరణలు చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తుండడంతో ఈ శాఖకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇందులో భాగంగానే జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ కొన్ని సంస్కరణలకు ఇప్పటికే శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయులు సమయానికి విధులకు హాజరు కావడం, విద్యార్థుల అటెండెన్స్ పరిశీలన, మధ్యాహ్న భోజన వివరాల గురించి ప్రధానోపాధ్యాయులు ఎస్‌ఎంఎస్ పెట్టాలని డిఇఓ ఆదేశించారు. దీనిని ప్రయోగాత్మకంగా నిజామాబాద్‌లో అమలు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ నుండి ఈ మేరకు ఆదేశాలు అందాయి. అయితే ఎస్‌ఎంఎస్ విధానం అమలుపై ఉపాధ్యాయులు రెండు వర్గాలుగా విడిపోవడంతో విద్యా శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎస్‌ఎంఎస్ విధానాన్ని ఎలాగైనా సరే అమలు చేయాలని ప్రభుత్వంతో పాటు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపడుతుండగా, మరోవైపు కొంతమంది ఉపాధ్యాయులు ఈ విధానాన్ని తీవ్రంగ వ్యతిరేకిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నుండి ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల హాజరుపై ఎస్‌ఎంఎస్ పెట్టాలని ఈ మేరకు డిఇఓ లింగయ్య ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ విషయమై జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవులకు ముందు పాఠశాలలకు సమాచారం అందించారు. జనవరి 19 నుండి ఎస్‌ఎంఎస్ విధానం ప్రారంభించారు. ఎస్‌ఎంఎస్ విధానం పూర్తి స్థాయిలో అమలైతే ఉపాధ్యాయుల రాకపోకలు ఖచ్చితంగా ఎంఇఓ మొదలు డిఇఓ వరకు ఆన్‌లైన్‌లో చూడవచ్చు. బోగస్ విద్యార్థుల పేరిట పాఠశాలల్లో మధ్యాహ్న భోజన అక్రమాలకు చెక్ పెట్టవచ్చని భావిస్తున్నారు. పాఠశాలలకు డుమ్మా కొట్టి అధికారులకు సమాచారం ఇవ్వని వారి గురించి కూడా ఇట్టే తెలిసిపోతుంది. పాఠశాలల పనితీరును ఎస్‌ఎంఎస్ విధానం ద్వారా రోజువారీగా అధికారులు పర్యవేక్షిస్తూ నిర్వహణను చక్కదిద్దేందుకు ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. తద్వారా సర్కారీ బడుల్లోనూ ఫలితాలు మెరుగుపడేందుకు ఈ విధానం దోహదపడుతుందని అనేక మంది ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. దీనివల్ల డుమ్మా మాస్టర్లకు, దీర్ఘకాలంగా గైర్హాజరైన ఉపాధ్యాయులకు ముకుతాడు వేయవచ్చనే భావనతో ఎస్‌ఎంఎస్ విధానంకు శ్రీకారం చుట్టారు. ఎస్‌ఎంఎస్ ఆధారంగా అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేసి, స్కూల్‌కు రాని గురువులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వీలుండడంతో ఈ వ్యవహారాన్ని ప్రధాన ఉపాధ్యాయ సంఘం నాయకులకు రుచించడం లేదని ప్రచారం జరుగుతోంది. కీలకంగా వ్యవహరిస్తున్న సంఘం దీనిని వ్యతిరేకిస్తుండగా, జిల్లాలోని మిగతా ఉపాధ్యాయ సంఘాలు మాత్రం సానుకూలంగానే ఉన్నాయని తెలుస్తోంది. విధులకు ఎగనామం పెట్టి సొంత వ్యాపకాలకు పరిమితం అయ్యే ఉపాధ్యాయుల లీలలు ఎస్‌ఎంఎస్ విధానంతో బట్టబయలు అవుతాయని, అందుకే కొందరు ఈ విధానాన్ని వద్దంటున్నారని మిగతా ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రధాన ఉపాధ్యాయ సంఘంగా చెప్పుకునే ఆ సంఘంలోని సభ్యులు విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శించి సుమారు 250మంది వరకు ఇదివరకు సస్పెన్షన్‌కు గురైన వారిలో ఉన్నారు. అందుకే తమ సంఘం నుండే ఎక్కువ మంది ఉపాధ్యాయులు బోధన విధుల కంటే సొంత పనులు చేసుకుంటున్నారని, అందుకే వారికి ఎస్‌ఎంఎస్ విధానం గుదిబండగా మారిందని గ్రహించి దీని అమలుకు ససేమిరా అంటున్నట్టు సమాచారం. జిల్లా విద్యా శాఖ మాత్రం ఎస్‌ఎంఎస్ విధానం అమలు చేస్తామని స్పష్టంగా తేల్చి చెబుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధనను ప్రవేశపెడుతున్న తరుణంలో ఎస్‌ఎంఎస్ విధానం తప్పనిసరి అని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. మొత్తం మీద ఎస్‌ఎంఎస్ విధానంతోనైనా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు గాడినపడుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

బీడీ కట్టలపై పుర్రె గుర్తును
ఉపసంహరించుకోవాలి
ఎఐటియుసి డిమాండ్
కంఠేశ్వర్, ఫిబ్రవరి 12: బీడీ కట్టలపై కేంద్ర ప్రభుత్వం పుర్రె గుర్తు సైజును పెంచిందని, ఈ ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ఎఐటియుసి కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుండి బీడీ కట్టలపై 85శాతం పుర్రె గుర్తును ముద్రించాలని ఆదేశిస్తూ జీవోనెం.727ను జారీ చేసిందన్నారు. దీనివల్ల బీడీ పరిశ్రమ మూతబడి లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2003వ సంవత్సరంలో యుపిఎ ప్రభుత్వం 727జీవోను జారీ చేసి బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించాలని నిర్ణయిస్తే లక్షలాది మంది కార్మికులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించారని, ఫలితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గి 40శాతం పుర్రె గుర్తును ముద్రించాలని సూచించిందన్నారు.
ప్రస్తుత బిజెపి ప్రభుత్వం బరితెగించి బీడీ పరిశ్రమపై ఆధారపడ్డ కార్మికులను రోడ్డున పడేసే కుట్రలో భాగంగా 85శాతం పుర్రె గుర్తును ముద్రించాలని జీవో జారీ చేయడం శోచనీయమన్నారు. తెలంగాణలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద ఉపాధి బీడీ పరిశ్రమ ద్వారానే ప్రజలు పొందుతున్నారని అన్నారు. కానీ బిజెపి ప్రభుత్వం బడా పెట్టుబడిదారులకు, సిగరెట్ కంపెనీలకు లాభాలను సమకూర్చడానికి చేతివృత్తి పరిశ్రమ అయిన బీడీ పరిశ్రమను దెబ్బతీయాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరోమారు ఉద్యమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎఐటియుసి నాయకులు నర్సింహారావు, హైమదీబేగం, వెంకటేశం గుప్తా తదితరులు పాల్గొన్నారు.

వార్షిక పరీక్షల వరకూ మధ్యాహ్న భోజనం
ఇన్‌చార్జి కలెక్టర్ రవీందర్‌రెడ్డి
ఇందూర్, ఫిబ్రవరి 12: ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యేంత వరకు మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్టు ఇంచార్జ్ కలెక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి తెలిపారు. తద్వారా విద్యార్థులకు మరింత ఎక్కువ సమయం పాటు కళాశాలల్లో ఉండి పరీక్షలకు బాగా సన్నద్ధం అయ్యేందుకు ఆస్కారం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. శుక్రవారం తన చాంబర్‌లో జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, విద్యాశాఖ, సంక్షేమ శాఖల అధికారులతో ఇంచార్జ్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు మరింత ఎక్కువ సమయం కళాశాలల్లోనే ఉండేలా చూడడం ద్వారా వారికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఉత్తీర్ణతా శాతం గణనీయంగా మెరుగుపడేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పరీక్షలు ప్రారంభమయ్యే వరకు జిల్లాలోని 31 జూనియర్ కాలేజీలతో పాటు 11డిగ్రీ కళాశాలల్లోనూ సుమారు 16వేల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని సూచించారు.
ఈ మేరకు పౌర సరఫరాల శాఖ నుండి అవసరమైన 500క్వింటాళ్ల బిపిటి బియ్యం సరఫరా చేయాలని సంబంధిత శాఖ కమిషనర్‌కు లేఖ రాస్తున్నామని అన్నారు. కూరగాయలు, ఇతర ఖర్చులకు సంబంధించిన నిధులను ఏజెన్సీలకు చెల్లించి నెల రోజుల పాటు విద్యార్థులకు కళాశాలల్లో మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తామని ఇంచార్జ్ కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని, తద్వారా విద్యార్థులు సమర్ధవంతంగా వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఆస్కారం ఉంటుందని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు జె.సి రాజారాం, డిఇఓ లింగయ్య, డిఎస్‌ఓ కృష్ణప్రసాద్, డిఎంసిఎస్ జయదేవ్‌సింగ్, డివిఇఓ ఒడ్డెన్న, గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, ఇంచార్జ్ డిసిఓ గంగాధర్, సంక్షేమ శాఖల అధికారులు విజయ్‌కుమార్, విమలాదేవి తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప ఆలయాభివృద్ధికి కృషి
దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 12: తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ కింద 12వేల దేవాలయాలున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయంలోస్వామివారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విలేఖరులతోమాట్లాడారు. రాష్ట్రంలోదేవాదాయ శాఖ కింద 12వేల దేవాలయాలున్నాయని, 12,001వ గుడిగా ఎల్లారెడ్డి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయాన్ని అభివృద్ది చేసేందుకు రాష్టస్రిఎంతోమాట్లాడి,ఆలయం చుట్టు ప్రహరి గోడ నిర్మాణం చేసేలా కృషిచేస్తానని హామి ఇచ్చారు. కేరళ రాష్ట్రంలోని పంప నది తీరానా తెలంగాణ రాష్ట్ర అయ్యప్ప స్వాముల కోసం 5 ఎకరాల స్థలం కేరళ ప్రభుత్వం కేటాయించిందని, ఇట్టి స్థలంలోస్వాముల కోసం అన్ని హంగులతోకూడిన వసతిగృహాన్ని రాష్ట్ర సిఎం కేసిఆర్ నిర్మించనున్నట్లు తెలిపారు. సిఎం వద్ద ఎమ్మెల్యేకు మంచి పలుకు బడి ఉందని, అందుచేతనే రాష్రంలోని మిషన్ కాకతీయ పథకాన్ని నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ చెరువును ఎంపిక చేసి మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. బసంత పంచమి రోజున హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామిజీ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన చేయడం శుభ సూచకమని, ప్రజలందరు సుఖసంతోషాలతోఉండాలని, వర్షాలు మంచిగా కురిసి పాడిపంటలు మంచిగా పండేలా అయ్యప్పస్వామి ఆశీస్సులు కలగాలని అన్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, 60 సంవత్సరాల తెలంగాణ వాధుల కలను రాష్టస్రిఎం కేసిఆర్ పోరాటం ద్వారా సాధించుకోగలిగామని, సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా చేసుకోవడానికి సిఎం కేసిఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని మరింత అబివృద్ది చేసేందుకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉంటుందని అన్నారు. ఈసందర్భంగా ప్రధాన రహదాని నుంచి ఆలయం వరకు రోడ్డు ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తానని హామి ఇచ్చారు. ఈకార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఏనుగురవీందర్‌రెడ్డి తదితరులుఉన్నారు.
శిలాఫలకం ఆవిష్కరణ
పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలోస్వామి శుక్రవారం విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆలయ విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపి బీబీపాటిల్, స్థానిక ఎమ్మెల్యే ఏనుగురవీందర్‌రెడ్డి ఆయన సతీమణి మంజులారెడ్డి, జడ్పీచైర్మైన్ దఫేదార్ రాజు, స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు, అయ్యప్ప గురుస్వాములు,స్వాములు తదితరులున్నారు.

తెరాసతోనే బంగారు తెలంగాణ
ప్రభుత్వ విప్ గంపగోవర్దన్
కామారెడ్డి రూరల్, ఫిబ్రవరి 12: అన్ని రంగాలను అభివృద్ది చేస్తూ బంగారు తెలంగాణ సాదన దిశగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ గంప గోవర్థన్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ కెసిఆర్ నాయకత్వంలో ఎదురులేని శక్తిగా ఎదిగిందన్నారు. గ్రామంలో 40 లక్షలతో చేపట్టిన బిటి రోడ్డు, 3 లక్షలతో సిసి రోడ్డులను, మాడూరి అంజయ్య జ్ఞాపకార్థం వారి కుమారులు ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ ప్లాంట్, పాఠశాలలో ఏర్పాటు చేసిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇతర పార్టీలకు చెందిన గ్రామ స్థాయి నాయకులు టిఆర్‌ఎస్ లో చేరగా ప్రభుత్వవిప్ కండువలు కప్పి వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఐడిసిఎంఎస్ చైర్మన్ ముజీబొద్దిన్, ఎంపిపి లద్దూరి మంగమ్మలక్ష్మిపతియాదవ్, వైస్ ఎంపిపి కృష్ణాజిరావ్, సర్పంచ్ లు బాగ్యవతి , శ్యామల, వెంకట్రావ్, రామాగౌడ్, ముల్కరాజు, భూపతి, నాయకులు నిట్టు వేణుగోపాల్‌రావ్, గోపిగౌడ్, పిప్పిరి ఆంజనేయులు, మంద వెంకటేశ్వర్‌రెడ్డి, బల్వంత్‌రావ్, రాంరెడ్డి, సాయాగౌడ్, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.

ఖేడ్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌దే గెలుపు
రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి పోచారం
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 12: మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ అసేంబ్లీ ఉప ఎన్నికలలో టిఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపాల్ రెడ్డి భారీ మెజార్టీతోఅఖండ విజయంతోగెలుపొంది, ప్రతిపక్షాల డిపాజిట్‌లు గల్లంతుచేసి , వరంగల్ ఉపఎన్నికల్లోప్రజలు ఇచ్చిన తీర్పులాంటి మరోతీర్పును ప్రజలు ఇచ్చి, టిఆర్‌ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపి బీబీ పాటిల్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి పట్టణంలోని అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన వారు విలేఖరులతోమాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశ పెడ్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అబివృద్దిని చూసి ప్రజలు టిఆర్‌ఎస్‌కే పట్టం కడ్తారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అబివృద్ది చేసే సామర్థ్యం సిఎం కేసిఆర్‌కు మాత్రమే ఉందని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని, అందుకే ఎక్కడి కెళ్లిన సిఎంకు ప్రజలు బ్రహ్మరథం పడ్తున్నారన్నారు. తెలంగాణలోరాష్ట్రంలోటిడిపి ఖాళీ అయ్యిందని టిడిపి ఎమ్మెల్యేలు అధికార పార్టీలోచేరుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం టిడిపి కాంగ్రేస్ పార్టీలతోసాధ్యం కాదని, తెలంగాణ రాష్ట్ర టిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే సంక్షేమం, అబివృద్ది పథకాలను అమలుచేయడం సాధ్యవౌతుందన్నారు. విలేఖరుల సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే ఏనుగురవీందర్‌రెడ్డి, జడ్పీచైర్మైన్ ధపెదార్ రాజు, డిసిసిబి చైర్మైన్ గంగాధర్ పట్వారి, స్థానిక ఎంపిపి నక్కగంగాధర్, చినబాలి సామెల్, తదితరులు పాల్గొన్నారు.