క్రీడాభూమి

ఆ హక్కు మీకెక్కడిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఫిబ్రవరి 12: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తనపై ఐదేళ్లు నిషేధం విధించడంపై కళంకిత పాక్ ఆంపైర్ అసద్ రవూఫ్ ఎదురుదాడికి దిగాడు. తాను అవినీతికి పాల్పడినట్లు ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని, అయినప్పటికీ బిసిసిఐ తనపై నిషేధం విధించిందని ఆయన చెప్పాడు. ‘నేను అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు లేవని ముంబయి కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది. అలాంటప్పుడు నాపై నిషేధం విధించే హక్కు బిసిసిఐకి గానీ ఐపిఎల్‌కు గానీ ఎక్కడిది?’ అని ఆయన శుక్రవారం పిటిఐ వార్తా సంస్థతో అన్నాడు. ఐపిఎల్‌లో అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయకుండా తాను భారత్ నుంచి వెళ్లిపోయినట్లు దర్యాప్తు కమిషనర్ చెప్పిన మాటలో నిజం లేదని, వాస్తవానికి ఐపిఎల్‌లో అన్ని బాధ్యతలు పూర్తిచేసిన ఒక రోజు తర్వాతే భారత్‌ను వీడానని రవూఫ్ చెప్పుకొచ్చాడు. తాను అవినీతికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలలేదని, నెలకు 30 లక్షల రూపాయలు పైగా సంపాదిస్తున్న తాను జీన్స్ ప్యాంట్లు, టీ-షర్టులు, టోపీల్లాంటి చిన్న చిన్న బహుమానాలను స్వీకరించడం పెద్ద విషయమేమీ కాదని కోర్టు కూడా చెప్పిందని రవూఫ్ అన్నాడు.