రంగారెడ్డి

అభివృద్ధి కోసమే టిఆర్‌ఎస్‌లోకి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, ఫిబ్రవరి 12: నియోజకవర్గ టిడిపికి పెద్దషాక్ తగిలింది. నియోజకవర్గ టిడిపి ఇంచార్జితో పాటు, మున్సిపల్ వైస్‌చైర్మన్ హెచ్.సురేష్, కౌన్సిలర్లు రాజమల్లు, స్వరూప, ధమయంతి, అనసూయ, సంగీత, పట్టణ పార్టీ అధ్యక్షుడు వెంకట్‌యాదవ్, టిఎన్‌ఎస్‌ఎఫ్ పశ్చిమ రంగారెడ్డి జిల్లా ఇంచార్జి రంగరాజు, నాయకుడు నవీన్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీలోకి అభివృద్ధి కోసమే వెళుతున్నామని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ది పథకాలకు తాము ఆకర్షితులమైనట్లు చెప్పారు. అంతే కాకుండా ఈ ప్రాంతవాసుల చిరకాల వాంఛ వికారాబాద్ జిల్లా కేంద్రం నెరవేరబోతున్న తరుణంలో పార్టీలో చేరుతున్నామని పేర్కొన్నారు. టిడిపి కౌన్సిలర్ల వార్డులు ఎక్కువ మురికివాడలే కావడంతో అభివృద్ది చేసుకోవాలని టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు.
జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, వికారాబాద్ శాసనసభ్యుడు బి.సంజీవరావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నామని, ఎన్టీయార్ భవన్‌కు రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపామని చెప్పారు. టిడిపి అధినేత చంద్రబాబుపై, పార్టీపై ఎలాంటి కోపం లేదని తెలిపారు.