ధర్మసందేహాలు

ఆత్మసాక్షాత్కారానికి మార్గం భక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సకల జీవకోటి రాశిలో అన్నీ జన్మలకెల్లా మానవ జన్మ అత్యుత్తమమైనది. అలాంటి జన్మ చరితార్ధం కావాలంటే.. మనం భగవంతుని సన్నిధిలో సర్వదా భక్తి భావనతో మెలగి జీవితాన్ని కొనసాగించాలి. అందుకు మన మహాత్ములు మనకు కొన్ని నియమ నిబంధనలు, ఆచారాలు, సాంప్రదాయాలు నేర్పారు. అందులో నమస్కార విధానం గురించి తెలుసుకుందాం.
నమఃఅనగా త్యాగమని వాచ్యర్ధం. నేను నీ కంటే తక్కువవాడను. నీవు నాకంటే గొప్పవాడవు అనే ‘దాస్యభావం’ దైవానికి, దైవ విషయాలకు స్ఫురిస్తుంది. నాకు నేను ఉపయుక్తుడనుకాను ‘‘కాబట్టి’’ నీవే నన్ను ఉద్దరించగలవాడవు అని ఆత్మర్పణము చేసుకోవటం అని ఒక అపూర్వ యోగాన్ని ‘‘నమః’’ అను పదం సూచిస్తోంది. తన నికృష్టతను (నికృష్ణతను) పూజ్యుడగువాని ఉత్కృష్టతను చూపటానికి ‘నమస్కారం’లో ఒక రహస్యం ఉంది. నమస్కారం వంటి తారకమంత్రం మరొకటి లేదు. శత్రువులోని శత్రుభావాన్ని సమూలంగా పొగొట్టే శక్తి ఈ నమస్కారానికుంది. నమస్కారంతో సకలార్ధసిద్ధిని పొందవచ్చు. శ్రీ కృష్ణపరమాత్మకు ఒక్కసారి నమస్కరించితే పది అశ్వమేధయాగాల అనంతరం చేయబడు...అవభృథ స్నానంతో సమానమని భారతంలో చెప్పబడింది.
నమస్కారం వలన మనలోని అహంకారం తగ్గుతుంది. సేవాభావం వలన భగవత్ భక్తి పెంపొంది, భగవంతుని పట్ల విశేష ఆరాధనాభావం కలుగుతుంది. అలాంటి ప్రేమ ఆరాధనే భక్తి. అలాంటి భక్తితో సాధింపరాని సిద్ధులు లేవు. భక్తియే ఆత్మ సాక్షాత్కార జ్ఞానానికి మూలం. పరమభక్తియే మోక్షప్రాప్తికి ఉత్తమ సాధనం.నమస్కారం, కాయకం, వాచికం, మానసికం, అని మూడు విధాలు. మొదటిది కాయకం. ఇది శారీరకమైనది. రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం. పడుకొని అష్టాంగాల్ని నేలపై మోపి చేసే సాష్టాంగ నమస్కారం. ధ్యానముద్ర నమస్కారం, ఎడమ బొటనవేలిపై కుడి బొటనవేలు ఉంచి, పరస్పరం పట్టుకొని, ఇతర వ్రేళ్లను సాచి ఉంచితే మహాముద్ర అవుతుంది. ఈ ధ్యానముద్ర నమస్కారంతో, భగవంతుని ధ్యానిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
రెండవది వాచికం. నోటితో ఉచ్ఛరించేది. ‘‘నమః’’, ‘‘నమస్కారం’’ శబ్ధాలతో మనోభావాన్ని తెలపటం, మూడవది మానసికం. దైవంపట్ల మనస్ఫూర్తిగా ‘నమస్కార’ భావాన్ని మనసునందే ఏకాగ్రతతో తలవటం.
ఏ విధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనటమే అవుతుంది. శారీరక నమస్కారంలో (కాయకం) అష్టాంగం, పంచాంగం, త్రయ్యంగం, ఏకాంగం అనే నాలుగు విధాలున్నాయి. అష్టాంగ నమస్కారం ఉత్తమమైనది. ముఖ్యమైనది. దేవతలకు, గురువులకు, పెద్దలకు ఈవిధమైన నమస్కారం చేయాలి. పంచాంగ నమస్కారం - ‘‘శిరోహస్తాచ బహుచకృత్యాజామని సంస్ధితా ఇదం పంచాంగ మేనోక్తమ్’’ అనగా శిరస్సు, రెండు చేతులు, రెండు భుజాలు, మోకాళ్లు నేలపై ఆనించి చేసే నమస్కారం పంచాంగ నమస్కారం అని అంటారు. ఈ విధమైన నమస్కారం స్ర్తిలకు ఉత్తమమైనది. ఇక మూడవది త్రయ్యంగ నమస్కారం. ‘‘హస్తా బద్ధ్వాతుముకళవమ్మార్ధ్ని దేశే వియోజయేత్’’ రెండు చేతులు జోడించి తలపై ఉంచి చేసే నమస్కారం. నాల్గోది ఏకాంగ నమస్కారం’’-ఏకాంగంతు నమస్కారం శిరపైన కృతాభవేత్’’ తలను మాత్రం వంచి చేసే నమస్కారం ‘‘ఏకాంగ నమస్కారమంటారు.
రెండు చేతులు, రెండు కాళ్ళు, వక్షస్థలం, నొసలు, రెండు భుజాలు మొత్తం ఎనిమిది అంగాలను నేలకు తాకునట్లు బోర్లపడి నమస్కరిస్తున్నందువల్ల ‘‘సాష్టాంగనమస్కారం’’ అంటారు. ఈ విధమైన నమస్కారం శ్రేష్ఠమైనది. ‘నమస్కారం’ అనే నమృతాక్రియకు పరిపూర్ణత సిద్ధిస్తుంది.

-కురువ శ్రీనివాసులు