బిజినెస్

అంచనాలు, ఆశలతో పైపైకి.. భారీ లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. మదుపరుల పెట్టుబడుల జోరుతో భారీ లాభాలను అందుకున్నాయి. దీంతో 20 నెలలకిపైగా కనిష్ట స్థాయి నుంచి సూచీలు కోలుకోగా, తిరిగి బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 24వేల స్థాయిని, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 7,400 స్థాయిని చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పుంజుకుంటున్న సంకేతాలు, యూరోజోన్ నుంచి మరోసారి ఉద్దీపనలు వెలువడనున్నాయన్న అంచనాలు భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లను నిలబెట్టాయి. బ్యారెల్ ముడి చమురు ధర 1.52 డాలర్లు పెరిగి 30.77 డాలర్లకు చేరింది. ముఖ్యంగా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ బలపడటం భారతీయ మార్కెట్లను ఉత్సాహపరిచింది. 39 పైసలు పెరిగి 29 నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుని 67.63 వద్ద స్థిరపడింది. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 473.45 పాయింట్లు పెరిగి 24,435.66 వద్ద, నిఫ్టీ 145.65 పాయింట్లు అందిపుచ్చుకుని 7,422.45 వద్ద స్థిరపడ్డాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి గమనిస్తే ఒకరోజులో ఈ స్థాయిలో సూచీలు లాభపడటం ఇదే తొలిసారి. కాగా, గడచిన రెండు రోజుల్లో (బుధ, గురువారం) సెనె్సక్స్ 517.63, నిఫ్టీ 158.30 పాయింట్లు పడిపోయినది తెలిసిందే. ఇదిలావుంటే శుక్రవారం మెటల్, ఆటో, చమురు, గ్యాస్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, యుటిలిటీస్, ఇండస్ట్రియల్స్, ఫైనాన్స్ రంగాల షేర్ల విలువ 4.32 శాతం నుంచి 2.48 శాతం పెరిగింది. బిఎస్‌ఇ మిడ్-క్యాప్, స్మాల్-క్యాప్ 2.25 శాతం వరకు లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ సూచీలు 5.88 శాతం, 2.9 శాతం చొప్పున లాభపడగా, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలూ 1.20 శాతం నుంచి 2.11 శాతం వరకు పెరిగాయి. ఐరోపాలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలూ 2.09 శాతం నుంచి 3.14 శాతం ఎగిశాయి.
రూ. 1.7 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను అందుకున్న నేపథ్యంలో మదుపరుల సంపద కూడా అంతే స్థాయిలో ఎగిసింది. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లోని సంస్థల మార్కెట్ విలువ 1,73,007 కోట్లు పెరిగి 92,03,826 కోట్ల రూపాయలకు చేరింది. బుధవారం సంభవించిన భారీ నష్టాలతో మదుపరుల సంపద 1.84 లక్షల కోట్లు ఆవిరైనది తెలిసిందే.
ఇండిగో, ఐడియా మార్కెట్ విలువ పతనం
శుక్రవారం ఇండిగో ఎయిర్‌లైన్స్ మార్కెట్ విలువ 8,242.46 కోట్ల రూపాయలు తరిగిపోయి 34,909.54 కోట్ల రూపాయలకు పడిపోగా, ఐడియా సెల్యులార్ మార్కెట్ విలువ 2,529.16 కోట్ల రూపాయలు దిగజారి 38,469.84 కోట్ల రూపాయలకు చేరింది. ఆయా సంస్థల వ్యాపార కార్యకలాపాల ప్రగతి ఆశాజనకంగా లేకపోవడంతో మదుపరులు షేర్ల అమ్మకాలకు దిగారు. మరోవైపు మదుపరుల కొనుగోళ్ల మద్దతుతో మహీంద్ర అండ్ మహీంద్ర మార్కెట్ విలువ 3,177 కోట్ల రూపాయలు పెరిగి 74,000 కోట్ల రూపాయలకు ఎగిసింది.
ఎన్‌ఎస్‌ఇ బాండ్ల వేలం
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సోమవారం విదేశీ మదుపరులకు 3,476 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీ బాండ్లను వేలం వేయనుంది. సాధారణ ట్రేడింగ్ కార్యకలాపాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటలపాటు ఈ వేలం జరుగుతుంది. ఎన్‌ఎస్‌ఇలో ప్రభుత్వ రుణ సెక్యూరిటీల్లో విదేశీ పెట్టుబడులకున్న పరిమితిని 1,31,924 కోట్ల రూపాయల నుంచి 1,35,400 కోట్ల రూపాయలకు పెంచారు.