అంతర్జాతీయం

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా భారతీయుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 14: అమెరికా సుప్రీం కోర్టు ధర్మాసనంలో నియమితుడైన తొలి ఇండో-అమెరికన్ న్యాయమూర్తిగా శ్రీ శ్రీనివాసన్ చరిత్రకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్సర్వేటివ్ న్యాయ యోధుడు ఆంటోనిన్ స్కాలియా ఆకస్మికంగా మృతిచెందడంతో ఆయన స్థానంలో అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటు అధికార డెమోక్రటిక్ పార్టీతో పాటు అటు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి విస్తృత మద్దతును కలిగివున్న శ్రీ శ్రీనివాసన్‌ను నియమించడం ఖాయమన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. చండీగఢ్‌లో జన్మించిన శ్రీకాంత్ ‘శ్రీ’ శ్రీనివాసన్ (48) అమెరికా సర్వోన్నత న్యాయ వ్యవస్థలో చోటు దక్కించుకునే అవకాశాలున్న న్యాయమూర్తుల జాబితాలో అందరికంటే ముందున్నారు. దీంతో స్కాలియాకు వారసుడిని ఎంపికచేసి సాధ్యమైనంత త్వరగా తన రాజ్యాంగ బాధ్యతలను నెరవేర్చాలని భావిస్తున్నట్లు ఒబామా స్పష్టం చేశారు. అమెరికా సుప్రీం కోర్టులో నియమితులయ్యే న్యాయమూర్తులకు సాంప్రదాయ ‘లాంచింగ్ ప్యాడ్’లా కొనసాగుతున్న కొలంబియా సర్క్యూట్ జిల్లా కోర్టులో శ్రీనివాసన్ అమెరికా అప్పీల్స్ కోర్టు సభ్యుడిగా పనిచేస్తున్నారని, కనుక ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయమూర్తి పదవికోసం పోటీపడే అభ్యర్థులకు సంబంధించిన ఏ జాబితా అయినా శ్రీనివాసన్‌తోనే మొదలవుతుందని సిఎన్‌ఎన్ వార్తా సంస్థ ఆదివారం పేర్కొంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా శ్రీనివాసన్‌ను నియమించే విషయాన్ని ఒబామా ఇప్పటికే పరిశీలిస్తున్నారని, ఆయన పేరును ఒబామా అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని సిఎన్‌ఎన్‌తో పాటు ‘న్యూ యార్కర్’ లో న్యాయ వ్యవహారాల విశే్లషకుడిగా పనిచేస్తున్న జెఫ్రీ టూబిన్ స్పష్టం చేశారు.