తెలంగాణ

ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 14: ‘క్రిటికల్ అడ్వాంటేజ్ రైడర్’ పేరిట ఆరోగ్య బీమా పథకాన్ని అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టింది. పాలసీదారులతో పాటుగా సహ వ్యక్తికీ ప్రయాణ, వసతి బీమా సదుపాయాన్ని అందిస్తోంది. ఈ సందర్భంగా అపోలో మ్యూనిచ్ హెల్త్ ఇన్సూరెన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి ఆంటోని జాకబ్ మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణకు వచ్చే సరికి ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యుల కోసం అత్యుత్తమ చికిత్సను కోరుకుంటారని అన్నారు. కొన్ని పరిస్థితులలో విదేశాలలో కూడా చికిత్స చేయించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో రవాణా, వసతి, చికిత్స వ్యయాలు కీలక పాత్ర పోషిస్తాయి కాబట్టి అందుకు అనుగుణంగా అపోలో మ్యూనిచ్ హెల్డ్ ఇన్సూరెన్స్ ఈ నూతన బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఆయన వివరించారు. నగదు రహిత సదుపాయంతో కూడిన ఈ క్రిటికల్ అడ్వాంటేజ్ రైడర్ బీమా పథకం విదేశాల్లో చికిత్స చేయించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. 8 ఆరోగ్య రుగ్మతలకు సంబంధించి విదేశీ చికిత్స సదుపాయాన్ని ఈ నూతన పథకం ద్వారా అందిస్తున్నట్లు ఆయన వివరించారు. క్రిటికల్ అడ్వాంటేజ్ రైడర్ పథకం ద్వారా న్యూరోసర్జరీ, క్యాన్సర్, కరోనరీ ఆర్టెరీ బైపాస్ సర్జరీ, హార్ట్ వాల్వ్ రీప్లైస్‌మెంట్/రిఫైర్, లైవ్ డోనర్ అర్గాన్ లీప్లేస్‌మెంట్, పల్‌మనరీ ఆర్టరీ గ్రాప్ట్ సర్జరీ, అయోర్టా గ్రాఫ్ సర్జరీ, బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ తదితర అనారోగ్యాలకు ఈ బీమాను పొందవచ్చని ఆయన వివరించారు.