క్రీడాభూమి

అదే దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, ఫిబ్రవరి 14: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ దూకుడును కొనసాగిస్తున్నది. ఆదివారం నాటి పోటీలు ముగిసే సమయానికి 160 స్వర్ణం, 88 రజతం, 21 కాంస్యాలతో మొత్తం 275 పతకాలు సాధించి తనకు తిరుగులేని నిరూపించింది. శ్రీలంక 167 (25 స్వర్ణం, 56 రజతం, 85 కాంస్యం), పాకిస్తాన్ 81 (9 స్వర్ణం, 27 రజతం, 45 కాంస్యం) పతకాలతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించాయి. భారత షూటర్ చైన్ సింగ్ ఈ పోటీల్లో మొత్తం ఆరు స్వర్ణ పతకాలను గెల్చుకోవడం విశేషం.
ట్రైయథ్లాన్‌లో క్లీన్‌స్వీప్
గౌహతి: దక్షిణ ఆసియా గేమ్స్ ట్రయథ్లాన్ ఈవెంట్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. పురుషులు, మహిళల విభాగాల్లో శనివారం స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న భారత్ ఆదివారం మిక్స్‌డ్ రిలే టీం ఈవెంట్‌లోనూ విజేతగా నిలిచింది. పల్లవీ రేతివాలా, దిలీప్ కుమార్, తౌడమ్ సరోజినీ దేవి, ధీరజ్ సావంత్ సభ్యులుగా గల భారత జట్టు ఒక గంట, 24.31 నిమిషాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని అందుకుంది. ట్రయథ్లాన్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలతో ఒక జట్టు ఏర్పడుంది. 300 మీటర్ల స్విమ్మింగ్, 60 కిలోమీటర్ల సైక్లింగ్, 1.2 కిలోమీటర్ల పరుగు విభాగాల్లో పందేలాను నిర్వహిస్తారు. ఒక జట్టు ఈ మూడు విభాగాల్లోనూ ప్రతిభ కనబరచాల్సి ఉంటుంది. భారత జట్టు విజయభేరి మోగించగా, పల్లవి, దిలీప్ కుమార్ తమతమ ఖాతాల్లో రెండో స్వర్ణాలను చేర్చుకున్నారు. వీరిద్దరూ ఇండివిజువల్ ఈవెంట్స్‌లోనూ స్వర్ణాలను సాధించిన విషయం తెలిసిందే. కాగా, మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో యెమ్ కుమారీ ఘాలే, హిమల్ తమతా, రొజా, రుద్ర కటూవాల్‌తో కూడిన నేపాల్ జట్టుకు రజత పతకం లభించింది. శ్రీలంక కాంస్యాన్ని అందుకుంది.
గురి తప్పలేదు!
షూటింగ్‌లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. ఆదివారం జరిగిన 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం, ఇండివిజువల్ ఈవెంట్స్‌లో స్వర్ణాలను కొల్లగొట్టింది. పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ త్రీ విభాగంలో భారత్ తరఫున పోటీపడిన చైన్ సింగ్, గగన్ నారంగ్, సురేంద్ర సింగ్ రాథోడ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. డబ్ల్యుకెవై క్రిషాంత, ఎస్‌ఎంఎం సమరకూన్, హెచ్‌డిపి కుమార సభ్యులుగా ఉన్న శ్రీలంక జట్టుకు రజత పతకం లభించింది. గులాం సఫియుద్దీన్ సిప్లు, మహమ్మద్ యూసుఫ్ అలీ, మహమ్మద్ రంజాన్ అలీతో కూడిన బంగ్లాదేశ్ జట్టుకు కాంస్య పతకం దక్కింది.
పురుషుల 50 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఇండివిజువల్ ఈవెంట్‌లో భారత్ స్వర్ణ, రజత పతకాలను సాధించింది. చైన్ సింగ్ స్వర్ణ పతకాన్ని అందుకోగా, గగన్ నారంగ్ రజతాన్ని దక్కించుకున్నాడు. శ్రీలంకకు చెందిన ఎస్‌ఎంఎం సమరకూన్ కాంస్య పతకాన్ని అందుకున్నాడు.
తైక్వాండోలో స్వర్ణం
తైక్వాండోలో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. మహిళల 49 కిలోల విభాగంలో పూర్వా దీక్షిత్ తన ప్రత్యర్థి వైకె చౌలాగైన్‌ను ఓడించింది. కాగా పురుషుల విభాగంలో భారత్‌కు రెండు రజత పతకాలు లభించాయి. 58 కిలోల విభాగంలో మహమూద్ హైదరీ చేతిలో ఓడిన గజేంద్ర పరిహార్, 74 కిలోల విభాగంలో షరీఫ్ మురాదీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్న మనూ జార్జి రజత పతకాలతో సంతృప్తి చెందారు. మహిళల 57 కిలోల విభాగం సెమీ ఫైనల్స్‌లో ఓడిన రాంచియారీ కాంస్య పతకాన్ని అందుకుంది. మార్షల్ ఆర్ట్స్‌లో భారత్ కొంత వెనుకబడి ఉ న్నప్పటికీ పతకాలు రావడం విశేషం.
బాక్సింగ్‌లో ముందంజ
భారత బాక్సర్లు ముందంజ వేశారు. ఐదుగురు తమతమ విభాగాల్లో ఫైనల్ చేరడం ద్వారా పతకాలు ఖాయం చేసుకున్నారు. మహిళల 51 కిలోల విభాగంలో మేరీ కోమ్, అనూష తమతమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. బంగ్లాదేశ్ బాక్సర్ షమీనా అక్తర్‌ను కోమ్ ఓడించింది. అనుష నేపాల్‌కు చెందిన గురుంగ్ మినూపై గెలిచింది. పురుషుల విభాగంలో దేవేంద్రో సింగ్, శివ్ థాపా, మనోజ్ కుమార్ ఫైనల్‌లోకి అడుగుపెట్టారు. 49 కిలోల విభాగంలో దేవేంద్రో సింగ్ 29-28 పాయింట్లతో తేడాతో తివన రనసింఘెను ఓడించాడు. 56 కిలోల విభాగంలో మహమ్మద్ ఒహిదుజమన్ (బంగ్లాదేశ్)పై విజయం సాధించాడు. 64 కిలోల విభాగంలో భూటాన్‌కు చెందిన షెరింగ్ వాంగ్ చంక్‌పై మనోజ్ కుమార్ సునాయాసంగా గెలిచాడు.