తెలంగాణ

‘కల్యాణ లక్ష్మి’ వయసు ధ్రువీకరణకు ఆధార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తర్వులు జారీ
------

హైదరాబాద్, మార్చి 10: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి వయసు ధ్రువీకరణ కోసం ఇకపై ఓటరు కార్డు, ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకుంటారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వయసు ధ్రువీకరణ విషయంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో పలువురు ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి 51వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఇప్పటి వరకు 75వేల మంది పెళ్లి కుమార్తెలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందారు. నూతన ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాల వారికి ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు.