జాతీయ వార్తలు

‘ఆధార్’తో నిధులు ఆదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలాది కోట్లు పొదుపునకు అవకాశం
లోక్‌సభలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడి
మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 11: ఆధార్ వ్యవస్థ ద్వారా లక్ష్యిత వర్గాలకు సబ్సిడీలను అందిస్తే వేలాది కోట్ల రూపాయలు ఆదా అవుతాయని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభలో స్పష్టం చేశారు. ఆధార్‌కు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ బిల్లు వల్ల అవసర వర్గాలకు సబ్సిడీలను అందించేందుకు అవసరమైన వనరులు రాష్ట్రాలకు లభిస్తాయని వెల్లడించారు. ఈ బిల్లుపై జరిగిన స్వల్ప చర్చకు సమాధానం చెప్పిన ఆర్థిక మంత్రి దీని ప్రత్యేకతలను విశదీకరించారు. సబ్సిడీలను ఆధార్‌కు అనుసంధానం చేయడం వల్ల, ఇటు కేంద్రానికి, అటు రాష్ట్రాలకు వేలాది కోట్ల రూపాయలు ఆదా అవుతాయని వివరించారు.
ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన దాని ఆమోదాన్ని కోరిన జైట్లీ ఎల్‌పిజి సరఫరాను ఆధార్‌కు అనుసంధానం చేయడం వల్ల కేంద్రానికి 15వేల కోట్ల రూపాయలు మిగిలాయని, ఇప్పటికే ప్రయోగాత్మకంగా టిడిఎస్‌ను ఆధార్‌కు అనుసంధానం చేసిన నాలుగు రాష్ట్రాలు 2,300 కోట్లకు పైగా నిధులను ఆదా చేసుకోగలిగాయని వివరించారు. ఆధార్‌కు చట్టబద్ధత కల్పించడం వల్ల అనేక రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని, పాలనా పరంగా, పారదర్శకంగా సబ్సిడీలను అర్థవంతంగా అమలుచేసేందుకు వీలు కలుగుతుందన్నారు.
గతంలో యుపిఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు, తాము చేపట్టిన ఈ బిల్లుకు ఎంతో తేడా ఉందని, గత బిల్లు కేవలం ఆధార్ అథారిటీని మాత్రమే ఏర్పాటుచేసిందని చెప్పారు. ఆ అనుభవం నేపథ్యంలోనే తాము ఎంతో మెరుగైన రీతిలో ఈ బిల్లును రూపొందించామని చెప్పారు. సల్ప చర్చ అనంతరం ఆధార్ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.