గ్రహానుగ్రహం

జన్మ నక్షత్రమే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న: పేరు మార్పుచేసి వివాహం చేయడం అనేది శాస్త్ర సమ్మతమేనా?
-షణ్ముఖ (విజయవాడ)
జ: జన్మనక్షత్రం తెలిసిన వారి విషయంలో జన్మ నక్షత్రమే ప్రధానము. అంతే కానీ ‘నామము’ అనేది ప్రధానం కాదు. పూర్వం విద్యావంతులు కాని వారి విషయంలో జన్మతేదీ, సమయం వివరములు రాసేవారు కాదు. కావున నామనక్షత్రం ఆధారం చేసుకుని నిర్ణయాలు చేసేవారు. అందుకు వీలుగా పుట్టిన వెంటనే దగ్గర్లోని పండితుని ఆశ్రయించి నక్షత్రం ప్రకారంగా ఉండే లాగ పేర్లు నిర్ణయింపజేసుకొని వెళ్లేవారు. ఇక దాని తరువాత ఎప్పుడు ఏ ముహూర్తం అవసరమైనా? అర్వణాదులు అవసరం అయినా ఆ పేరు చెప్పగానే సిద్ధాంతులు వెంటనే వారి యొక్క జన్మ నక్షత్రాన్ని, నామము యొక్క ఆధారం చేత గణన చేసి వ్యవహారములు చూసేవారు. జన్మనక్షత్రం తెలుసుకొని దానిని ప్రతి ముహూర్త విషయములలో వాడుకునే జ్ఞాపకశక్తి, మేధాసంపత్తి వున్న వారికి నామ నక్షత్రం అక్షరాలు ఆశ్రయించవలసిన అవసరం లేదు. నేడు మనకు ఉత్తరాది రాష్ట్రాలలో జన్మనామం అని విడిగా రాసి చెబుతుంటారు. కారణం నక్షత్రం గుర్తుకు రాకపోయినా కర్మనామం, జన్మనామముల రీత్యా జన్మ నక్షత్రం గ్రహణ చేయవచ్చు. జన్మనక్షత్రం జీవితాంతం మారదు. పేరు మార్చినా జన్మతేదీ జన్మ నక్షత్రం జన్మరాశి అనేవి జీవితాంతం మారవు. జన్మనక్షత్రం తెలిసినవారు ఆ జన్మ నక్షత్ర ప్రభావమును పేర్లు మార్పు చేసుకున్ననూ అనుభవించవలసినదే. జన్మనక్షత్రము తద్వారా జన్మనామము తెలియనివారు వారివారి పేరు బలాలు మార్పు చేసుకుని వివాహాది పొంతనలు చూసుకోవచ్చు. మరి ఈ సిద్ధాంతాన్ని గ్రంథకర్తలు సమర్థించిన తీరు మనకు గోచరమవుతుంది. * జన్మతేదీ జన్మనక్షత్రం వున్నవారికి నామనక్షత్ర ఆధారంగా అర్వణాదులు చూడడం శ్రేష్ఠం కాదు. గమనించగలరు. * జన్మతేదీ, నక్షత్రం తెలియనివానికే నామనక్షత్రం, దాని వాడకం విషయాలు పరిగణన చేయాలి. ఉంటే జన్మనక్షత్రం విశేషం.
ప్రశ్న: జాతకాలు చూపించకుండా వివాహం చేయవచ్చా? చూపించినా వివాహానంతరం విడిపోయిన వారి స్థితి ఏమిటి?
-సుందరి (విజయవాడ)
జ: జాతకాలు చూపించడం అనేది సంబంధం వెదుకులాటకు ఎక్కువ శ్రమ లేకుండా చేయడం కోసం చేసిన ఏర్పాటు. మరి ఒక విషయం ఏమిటంటే జాతకాలు చూపించి వివాహం చేసినా జాతకాలు చూపించకుండా వివాహం చేసినా రాసి పెట్టి వున్న సంబంధంతోనే వివాహం అవుతుంది. కొత్తది అవ్వదు. జాతకంలో వివాహానంతరం భార్యాభర్తలు విడిపోవడం, రెండవ వివాహం వంటివి వ్రాసి వున్నాయి అనుకోండి. జాతకాలు చూపించి వివాహం చేసినా అదే యోగం పడుతుంది. జాతకం చూపించకుండా వివాహం చేసినా అదే యోగం పడుతుంది. దీనిని తప్పించలేము. అయితే ‘కదళీ’ వివాహం అనే పేరుతో ఒక శాంతి మార్గం మనవారు ఆచరిస్తూ ఉంటారు. ప్రథమతః వివాహం అయిన సంబంధం వారికి గండం కనుక వుంటే ఆ గండం దాటవేయుటకు గాను అరటి చెట్టుతో వధూవరులలో ఎవరికి దోషం ఉంటే వారికి వివాహం చేసి అరటి చెట్టు నరికివేస్తారు. అలాగ చేయడం వలన దోషం పోతుంది అని భావన. మరి ఇవి పురాణవేత్తలు, వైదీక సంప్రదాయ నిష్ణాతులు చెప్పే సులువైన మార్గములు. ఇలాంటి దోషాలు దోష శాంతులు తెలిసికొని జాగ్రత్త పడటం కోసం జాతకాలు చూపించుకోవాలి.

కప్పగంతు సుబ్బరామ శర్మ (సుబ్బరామ సోమయాజులు)
కామకోటినగర్, శంకరమఠం వీధి, నృసింహ కృప బిల్డింగ్, విజయవాడ - 520 012.

కప్పగంతు సుబ్బరామశర్మ -9848520336