అక్షరాలోచన

దిల్ కీ ఆవాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్ కీ ఆవాజ్
మేరే దిల్ సే సునో
నా మనసు నాతో గొడవ పడుతుంది
ఎందుకో నా మాటే విననంటుంది
మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చానేమో
భయభక్తులు లేకుండా
బడాయి పోజులు కొడుతుంది
ప్రేమించొద్దు అంటున్నా
ప్రేమిస్తానంటూ మొండికేస్తుంది
దానధర్మాలు చేద్దాం అంటే
నువ్వు రోడ్డుపైకి వస్తావంటుంది
దేశం కోసం ప్రాణ త్యాగం చేయడం కోసం
వీరజవానై పోతానంటే
నీ భార్య, నీ పిల్లల కోసం
బ్రతకమని బోధిస్తుంది
డాక్టర్‌నై బీద ప్రజలకు
ఉచిత వైద్యం చేస్తానంటే
నర్సింగ్‌హోమ్ పెట్టు
నాలుగు చేతులా సంపాదించమంటుంది
గందా దిల్ కో మైక్యా కరూం
పానీమే థోయాత్ భీ
పవిత్ నహీ హో రహాహై!

- B.చంద్రశేఖర్ 9640037003