ఎలావుందీ వారం?

ఎలా వుందీ వారం? (ఆగస్టు 21 నుండి 27 వరకు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం)

ఆచితూచి వ్యవహరించాలి. ప్రయాణాలందు అప్రమత్తంగా ఉండాలి. ఆదాయ లావాదేవీలు తృప్తికరం. అనుకోని మంచి సంఘటనలు జరుగనున్నాయి. ఉద్యోగ వ్యవహారాలు స్థిరీకరణకు అవకాశం. ప్రమోషన్లు, బదిలీలుంటాయి. శక్తికి మించిన భారాన్ని మోయవద్దు. వ్యాపార, కళ, విద్య, వైద్య రంగాల వారు మెరుగైన ఫలితాలు అందుకుంటారు. పెట్టుబడిపై అనుకోని రాబడి ఉంది. స్పెక్యులేషన్ తృప్తికరం. ఆధ్యాత్మిక, వినోద, అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. స్ర్తిలకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఏమరుపాటు కూడదు.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా)

సానుకూల ఆలోచనలతో కార్యసిద్ధి. దైనందిన వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల వారు అనుకున్న లాభాలు పొందుతారు. దంపతులు అన్యోన్యతగా మెలగుతారు. ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలు. పోటీ పరీక్షలందు విద్య ఉపయోగపడుతుంది. వైవిధ్య కార్యక్రమాలందు పాల్గొని గౌరవ మన్ననలు పొందుతారు. స్పెక్యులేషన్ స్వల్ప లాభదాయకం. ఆభరణాలతో ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. ఇతర విషయాలందు అనవసర జోక్యం వద్దు.

మిథునం (మృగశిర 3,4 పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

పనులు సిద్ధిస్తాయి. ఆదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. బంధుమిత్రుల సాయం అందుతుంది. ఆరోగ్యం తృప్తికరం. వృత్తి, వ్యాపార, సాంకేతిక, పత్రిక, చిల్లర వ్యాపార రంగాల వారు మంచి గుర్తింపును పొందుతారు. అనుకోని పరిస్థితులు ఎదురుకాకుండా దంపతలు మెలగాల్సి ఉంటుంది. స్పెక్యులేషన్ లాభిస్తుంది. శుభకార్యాలు కలసి వస్తాయి. అనాలోచనలు వదలండి. పరిశీలనతో ఉండాలి.

కర్కాటకం (పునర్వసు 4 పా, పుష్యమి, ఆశే్లష)

విజ్ఞతతో పనులు పూర్తి చేస్తారు. కోపతాపాలు వద్దు. వృత్తి, వ్యాపార, వినోద, సాంకేతిక, రియల్ ఎస్టేట్, పొరుగు సేవలు, ఉద్యోగులు గుర్తింపును పొందుతారు. డయాగ్నస్టిక్ కేంద్రాలు అప్రమత్తంగా ఉండాలి. స్ర్తిలు సంతోష కార్యాలందు పురుషుల, స్నేహితుల సహకారంతో గుర్తింపుని పొందుతారు. ఆభరణాలు కొనే అవకాశాలున్నాయి. పనులందు మీ దృష్టిని కేంద్రీకరించండి. అనుకోని ప్రయాణాలున్నాయి. స్పెక్యులేషన్ వాయిదా మంచిది. అనుకోని లాభాలను, పైకాన్ని అందుకుంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా)

కుంటుపడ్డ పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ట్రాన్స్‌ఫర్లు ఉన్నాయి. బంధుమిత్రుల రాక ఆనందాన్నిస్తుంది. ఆదాయ వ్యయాలు ఆలోచింపజేస్తాయి. బహుమతులు అందుకుంటారు. విలువైన పత్రాలు, వస్తువులు అందుకుంటారు. వ్యవహారాలు క్రమంగా వృద్ధి చేసుకుంటారు. వృత్తి, విద్య, చిరు వ్యాపారులు మెరుగైన ఫలితాలు అందుకుంటారు. అప్పు పొందేటప్పుడు, ఇచ్చేటప్పుడు అప్రమత్తత మంచిది. శక్తికి మించిన పనులు ఒక్కరే చేయకండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త 1,2 పా)

నిర్లక్ష్యం వద్దు. మీ పనితనానికి, పలుకుబడికి గుర్తింపు ఉంటుంది. సంతృప్తిని పొందుతూ మెరుగైన సేవలు అందిస్తారు. వ్యాపార, వినోద, కళ, వృత్తి రంగాల వారు ఆలోచించి ముందుకు వెళ్తారు. ఆదాయ లావాదేవీలు బేరీజు వేసుకోవాలి. ప్రేమానురాగాలు, సంఘసేవలు మెరుగవుతాయి. సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రయాణాలు చేస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఎవరితోనూ గొడవ పడవద్దు. అన్నింటా నియంత్రణ అవసరం.

తుల (చిత్త 3,4 పా, స్వాతి, విశాఖ 1,2,3 పా)

పనులు ఊపందుకుంటాయి. ఆదాయ వ్యయాలు నియంత్రణలో ఉంటాయి. స్ర్తిల సాయంతో కొన్ని కార్యాలు పూర్తి చేస్తారు. వ్యాపార, విద్య, వృత్తి, రిటైర్, వ్యాపార సేవా రంగాల వారు గుర్తింపుని పొందుతూ విస్తరణకై ప్రణాళికలు వేస్తారు. ప్రమాదాలకు అవకాశమివ్వకండి. మిత్రుల సమస్యలు మీ తెలివితేటలతో పరిష్కరిస్తారు. బద్దకం వదిలించుకోండి. వృత్తి, వైద్య, విద్య, స్టేషనరీ వ్యాపార రంగాల వారు లాభాలందుకుంటారు. ధనం ఇంధనంగా మారుతుంది. పెట్టుబడి అనుకున్నట్లు ఆలోచించి చేయాలి.

వృశ్చికం (విశాఖ 4 పా, అనూరాధ, జ్యేష్ట)

ఇతరుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. రావలసినవి అన్నీ ఆలస్యంగానైనా పొందుతారు. వస్త్ర, వస్తువులు పొందే అవకాశముంది. విద్య, వ్యాపార, వ్యవసాయ, వృత్తి రంగాల వారు పునః ఆలోచనలతో మెరుగైన ఫలితాలు అందుకోనున్నారు. స్థాయికి తగ్గని పనులు ప్రారంభించి గుర్తింపును అందుకుంటారు. వాహన ప్రయాణాలందు అప్రమత్తత అవసరం. పొరపొచ్చాలకు అవకాశమివ్వవద్దు. శుభకార్యాలందు పాల్గొంటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పా)

పనులు పూర్తవుతాయి. ఆదాయ వ్యయాలు మీ కోరికలకు అనుగుణంగా ఉంటాయి. వ్యాపార, ఉద్యోగ, విద్య, చేతి వృత్తులు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ రంగాల వారు మెరుగైన గుర్తింపును పొందుతారు. దంపతులు అనుకోని సంఘటనలందు అప్రమత్తంగా మెలగాలి. సంఘ సేవా కార్యాదులందు పాల్గొంటారు. ఆదాయం ఆదాచేసే మార్గాలు అనుకూలిస్తాయి. దగ్గరి వారికి పైకం సర్దుబాటు చేయవలసి వస్తుంది. అనుకున్న విధంగా జాగ్రత్త వహించాలి. నూతన పరిచయాలు లాభిస్తాయి. అవకాశాలను వినియోగించుకోండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4 పా, శ్రవణం, ధనిష్ట 1, 2 పా)

పట్టుదల, వొదుపుదల, నిలుపుదలతో అన్ని కార్యాలు పూర్తి చేస్తారు. రావలసిన పైకం ఆలస్యంగానైనా అందుతుంది. వృత్తి, వ్యాపార, విద్య, వైద్య రంగాల వారు మెరుగైన ఫలితాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు. కోర్టు పరిష్కారాలు ఫలవంతమవుతాయి. స్ర్తి పురుషులు సంయమనంతో మంచి ఫలితాలను అందుకుంటారు. కష్టాలున్నా ఇష్టంతో పరిష్కరించుకోవాలి. స్పెక్యులేషన్ తృప్తికరం. శుభకరం.

కుంభం (్ధనిష్ట 3,4 పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా)

చాకచక్యంతో పనులు పూర్తి చేస్తారు. అనుకున్న వారు అనుకోని సమయంలో వస్తారు. ఫలవంతమైన కార్యాలు ఇతరుల సాయంతో జయప్రదంగా పూర్తి చేస్తారు. ఆభరణాల ధారణలో అప్రమత్తత అవసరం. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుని లాభాలను పొందుతారు. విద్య, వ్యాపార, ఉద్యోగ, జ్యుయలరీ వ్యాపారులు, ట్రావెల్ రంగాల వారు అనుకున్న ఫలితాలను పొందుతారు. అన్నింటా జాగ్రత్త అవసరం. మాటకు విలువ పెరుగుతుంది. శుభ వర్తమానాలు అందుకుంటారు.

మీనం (పూర్వాభాద్ర 4వ పా, ఉత్తరాభాద్ర, రేవతి)

అవకాశాలను అంది పుచ్చుకుంటారు. రావలసిన పైకం అందుతుంది. ఆదాయ వ్యయాలు తృప్తినిస్తాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. విద్య, వ్యాపార, సేవా రంగాల వారు తృప్తిని పొందుతారు. వ్యాపార విస్తరణకు అవకాశముంది. స్పెక్యులేషన్ లింకులు లేకుండా లాభాలను పొందండి. సరిలేరు మీకెవ్వరూ అన్నట్లుంది ఈ వారం. ఐతే నిదానం ప్రధానం.

ఎ.సి.ఎం. వత్సల్.. 93911 37855