'క్లాప్' కొట్టు గురూ!

‘డోస్’ పెంచింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలతార కాజల్ అగర్వాల్ ఇక లాభం లేదనుకొని గ్లామర్ డోస్‌ని పెంచేసిందట. తెలుగులో ‘లక్ష్మీ కళ్యాణం’తో ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ అటు తర్వాత ‘చందమామ’, రామ్‌చరణ్‌కు జోడీగా ‘మగధీర’లో నటించి క్రేజీ భామగా మెరుపులా పెరిసింది. నటనలో ఉరుములా ఉరిమింది కూడా. అగ్ర నటులందరితోనూ ఆడిపాడింది. మంచి చిత్రాలు...మంచి పాత్రలు ఇలా అనుకున్నవన్నీ చేసేసి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ఇప్పటికీ కాజల్ అగర్వాల్ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. కొత్త తారలు అనేకమంది పుట్టుకొస్తున్నా, తన ఉనికికి ఏ మాత్రం ప్రమాదం కలగకూడదనే అనుకుంటోంది. అందుకే ఇక తప్పదన్నట్లుగా తన గ్లామర్ డోస్‌ని పెంచేసిందట. పవన్‌కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్’లో మంచుకొండల్లో మెరిసిపోయే పాలరాతి శిల్పంలా స్విట్జర్లాండ్‌లో జరిగిన షూటింగ్‌లో కాజల్ కొత్తగా కనిపించి తన గ్లామర్‌తో అందర్నీ కట్టిపడేసిందట. ఈ చిత్రం తర్వాత కాజల్ అగర్వాల్ మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంటుందని..ఇక తిరుగే ఉండదని ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారు. గ్లామర్ డోస్‌ని పెంచడానికి కాజల్ ఇన్నాళ్లు పట్టిందన్నమాట! ప్చ్..కాజల్!!

తెలివైనదే!

‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ పరిశ్రమ చుట్టూ తిరిగి అవకాశాలు సంపాదించే భామలు ఆ ఛాన్స్ లభించాక తమ పవరేంటో చూపిస్తూ చిత్రసీమను తమవైపునకు తిప్పుకుంటూ డిమాండ్‌ని అమాంతం పెంచేసుకుంటున్నారు. అలాంటి వాళ్లు టాలీవుడ్‌లో అనేకం. వారిలో నవతరం కథానాయిక హెబ్బాపటేల్ కూడా చేరిపోయింది. ‘కుమారి 21ఎఫ్’తో తెలుగు చిత్రసీమలోకి రివ్వున దూసుకొచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఆ చిత్రం సాధించిన విజయం కళ్లు నెత్తికెక్కేలా చేసినట్టుంది. అందుకే తమ డిమాండ్‌ని అమాంతం పెంచేసిందట. ఒక్క విజయం లభిస్తే చాలు..పరిశ్రమలోని నిర్మాతలకు చుక్కలు చూపించడానికి కథానాయికలు వెనుకాడడంలేదు. తొలి చిత్రం సాధించిన విజయం తర్వాత మంచువారి మల్టీస్టారర్ ‘ఈడోరకం..ఆడోరకం’ చిత్రంతో పాటు ‘నేను- నా బాయ్ ఫ్రెండ్స్’లో ప్రస్తుతం నటిస్తున్న హెబ్బాపటేల్ మరో నాలుగైదు చిత్రాల్లో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక మరో అడుగు ముందుకేస్తూ తన పారితోషికాన్ని కూడా అమాంతం పెంచేసిందట. దాంతో ఈ అమ్మడికి డిమాండే డిమాండట. ‘దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే ధోరణి హెబ్బాకు ఇంత త్వరగా కలగడం నిజంగా సూపరే’ అంటున్నారు టాలీవుడ్ సినీ జనాలు. హెబ్బా తెలివైనదే!

వాహ్..సోనాక్షి!!

బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ‘అకిర’, ఫోర్స్-2’ చిత్రాలతో బిజీ బిజీగా షూటింగ్‌లో పాల్గొంటోంది. ప్రస్తుతం ఇవేగాక మరెన్నో చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఇలా చేసే ప్రతీ చిత్రంలో తన పాత్ర ఎలా వుండబోతుందో, ఆ క్యారెక్టర్ తనకు ఎలాంటి ఇమేజ్‌ని తెచ్చిపెట్టబోతుందో ముందే ఊహించుకొని తన క్యారెక్టర్‌ని మలచుకోవడంలో సోనాక్షిని మించిన నటి మరొకరు లేరంటే అతిశయోక్తిలేదు. ఇదంతా ఒక ఎత్తయితే మరో ఎత్తు ఒకటుంది. అదే తన అభిమానులను పెంచుకోవడం. ట్విట్టర్ విషయానికొస్తే ఆమెకు 70లక్షలకు పైగా అభిమానులున్నారట. అంతేకాదు, 7మిలియన్ల మంది సోనాక్షిని ఫాలో చేస్తున్నారట. అంతటి క్రేజ్‌ని సొంతం చేసుకున్న సోనాక్షి ఇకపై కూడా మరెన్నో మంచి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను చేసి మరింత ఇమేజ్‌ని సొంతం చేసుకోవాలనుకుంటుందట. వాహ్..సోనాక్షి!!
అదీ..సంగతీ!!

-సమీర్