అక్షరాలోచన

అమ్మలేని వేళ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలంతో కలిసి -కనుమరుగై
కనుపాపగా నిలచి
కల్లోల లోకాన్ని కాంచి
కాయమని చెప్పి వెళ్లింది
నిన్నగాక మొన్నలా ఉంది
అపుడే ఏడాది గడచిందా! అమ్మా-
జీవన యానంలో-
ప్రతి ప్రయాణంలో
‘ఎదురు రమ్మని’ చెప్పడానికి
నాన్నా-లేడు
రావడానికి నీవూ లేవు
‘వెళ్లగానే ఫోన్ చేయి’
అనే నీ పలుకులు ఏ పరలోకాన్నుండొస్తాయిక
నీ ఏడూరుకై ఎదురుజూసిన నాన్న
అసమాన్య అన్యోన్యతలకు మారుపేరై
నీవులేని నేలపై నిలవలేక
లెక్కల ప్రపంచంపై లెక్కలేని నిన్ను
వెతుక్కుంటూ అర్థాంతరంగా వచ్చేశాడు
నీలోంచి నాలోకి
నాలోంచి నా వ్రేళ్ల చివర్లలోకి
అడపాదడపా అంగిట్లో నుంచీ
ద్రవించి స్రవించి కరుణించి
అవనిపైకి అరుదెంచి పరివ్యాపించే
అక్షర సరస్వతి అమ్మమ్మ సరస్వతే
నాకు ఇంకాలంబన-
ఈ విశాల ఇరుకిరుకు లోకంలో
రోజూ నీ కాకి ముద్దలు తిన్న ప్రకృతి
నీ అంతిమ యాత్రనీ-
పరికించిందీ విలపించిందీ
నింగీ నేలా ఏకం చేస్తూ
వర్షపు పూవులతో ఆసాంతం నిన్ను అభిషేకిస్తూ-
గమ్యం వడిలో ఆకస్మిక అదృశ్యమై-
నీ అభీష్ట సిద్ధికై జరిపిన
క్రతువుల్లో గుంపులుగా వచ్చిన కాకులే
నీ ఆనవాయితీగా - నే పెట్టే
ముద్దలు ఏ కాకీ ముట్టడం లేదు
కాస్త కనికరించి.. నీవన్నా చెప్పరాదూ
నీ మాటైనా - ఓ మాటైనా - వింటాయేమో!
కని పెంచి కమ్మని పేరు పెట్టి
కనిపించని కాలంలో కలసి
పావన పంచభూతాల్లో మిళితమై
కనిపించని నిండు కుండలాంటి నిన్ను-
కనిపించే స్ఫటిక స్వచ్ఛ, సత్య సాత్వికత
నిస్వార్థ ప్రకృతిలో-
నిత్యం చూస్తూనే ఉన్నా-
చూస్తూనే ఉంటా- ఉన్నంతవరకూ
ఎప్పటిలా నా నిజ నైజ ప్రవృత్తిని
ఆ సహజ ప్రకృతిలా మలచడానికి
ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటా-
నీ దివ్య ఆశీస్సులతో.

- లలితానంద్ 9247499715